Girls: మహిళా క్రీడా కేంద్రంలో అమ్మాయిలను కోచ్ ఏం చేశాడంటే ?, కలెక్టర్ కు టోపీ, క్లైమాక్స్ లో ?
చెన్నై/ పెరంబూరు: మహిళా క్రీడా కేంద్రంలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న తైక్వాండో కోచ్‌కి అమ్మాయిలు సినిమా చూపించడంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. కలెక్టర్ కు తప్పుడు నివేదిక ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. కోచ్ కు సహాయం చేసిన జిల్లా స్థాయి అధికారికి ఉద్యోగం పోయింది. దెబ్బకు పరారైనా కోచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోచ్ ను 15 రోజుల జైలుకు పంపించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెరంబలూరు జిల్లా మహిళా క్రీడా కేంద్రంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినులు తైక్వాండో శిక్షణ తీసుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా కోచ్ విద్యార్థులతో అసభ్యకరంగా మాట్లాడటం, లైగింక వేధింపులకు పాల్పడటం, మద్యం మత్తులో విద్యార్థినులతో సరసాలు ఆడటం, అనుచితంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడి అడ్డంగా బుక్కైపోయాడు.

జిల్లా మహిళా క్రీడా కేంద్రం
పెరంబలూరు జిల్లా మహిళా క్రీడా కేంద్రంలో తైంక్వాండో కోచ్ గా ధర్మరాజన్ పని చేస్తున్నాడు. ధర్మరాజన్ అక్కడ శిక్ష తీసుకుంటున్న అమ్మాయిలో మద్యం మత్తులో సరసాలు ఆడి ఎదురు తిరిగిన అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణల.ు ఉన్నాయి. ఈ విషయంపై బాధిత యువతులు జిల్లా క్రీడా అధికారి సురేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు నవంబర్ 2న జిల్లా జడ్జికి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారికి ఫిర్యాదు చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా క్రీడా అధికారి సురేష్‌కుమార్‌ను ఆదేశించారు.

అమ్మాయిలను బెదిరించిన అధికారి
కోచ్ ధర్మరాజన్ మీద అధికారులకు ఫిర్యాదు చేయవద్దని సురేశ్‌కుమార్ విద్యార్థులను బెదిరించారని, ఎలాంటి వేధింపులు జరగలేదని వాంగ్మూలం ఇవ్వాలని చెప్పాడు. కోచ్ ధర్మరాజన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడలేదని నివేదిక తయారు చేసిన సురేష్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు సమర్పించాడని సమాచారం. అయితే పెరంబలూరు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం లీగల్ ప్రొబేషన్ ఆఫీసర్ గోపీనాథ్ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ 3, 6 తేదీల్లో మహిళా క్రీడా కేంద్రాన్ని స్వయంగా సందర్శించారు.

అమ్మాయిలకు కోచ్ టార్చర్ పెట్టాడని ?
అప్పుడు అమ్మాయిలు చేసిన ఫిర్యాదు నిజమైంది. తైక్వాండో ఇన్‌స్ట్రక్టర్ ధర్మరాజన్, స్పోర్ట్స్ ఆఫీసర్ సురేష్ కుమార్‌లపై పెరంబలూరు ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పెరంబలూరు జిల్లా క్రీడా అధికారి సురేష్ కుమార్ ను అరియలూరు జిల్లాకు బదిలీ చేశారు.

కోచ్ కు సహాయం చేశాడు.... ఉద్యోగం ఊడిపోయింది
క్రీడా విభాగం జోనల్ సీనియర్ మేనేజర్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం పెరంబలూరు జిల్లా క్రీడా ప్రాంగణాన్ని, ప్రభుత్వ మహిళా క్రీడా హాస్టల్‌ను స్వయంగా సందర్శించి విద్యార్థినులను విచారించారు. విచారణ నివేదికను స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శి కార్తికేయన్‌కు కూడా పంపించారు. స్పోర్ట్స్ హాస్టల్ అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా క్రీడా అధికారి సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.

సెంట్రల్ జైల్లో కామాంధుడు
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కమీషన్ సభ్య కార్యదర్శి కూడా తాత్కాలిక తైక్వాండో కోచ్ ధర్మరాజన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చెయ్యాలని ఆదేశించారు. పెరంబూరు జిల్లా తాత్కాలిక తైక్వాండో కోచ్‌గా భరణి దేవి నియమితులయ్యారు. తైంక్వాడో కోచ్ ధర్మరాజన్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ కు పంపించారు.












Click it and Unblock the Notifications