చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

family: సీఆర్ఫీఎఫ్ కమాండెంట్ ఆత్మహత్య, భార్యతో, నా ఫ్యామిలీకి శవాన్ని ఇవ్వకండి, క్యాంపస్ లో !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కేరళ: జీవితంపై విరక్తి చెందిన సీఆర్ఫీఎఫ్ కమాండెంట్ విధుల్లో ఉన్న సమయంలోనే రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కలకంరేపింది. ఇంటి నుంచి విధులకు హాజరైన మరుసటి రోజు కమాండెంట్ ఆత్మహత్య చేసుకోవడంతో సాటి ఉద్యోగులు, సీఆర్ఫీఎఫ్ అధికారులు హడలిపోయి విచారణకు ఆదేశించారు. కుటుంబ సమస్యల కారణంగానే కమాండెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నా శవాన్ని కుటుంబ సభ్యులక ఇవ్వకండి, మీరే అంత్యక్రియలు చెయ్యండి అంటూ కమాండెంట్ డెత్ నోట్ రాసిపెట్టారు.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

 కేరళ శ్రీజన్ కు భార్య, పిల్లలు

కేరళ శ్రీజన్ కు భార్య, పిల్లలు

కేరళకు చెందిన శ్రీజన్ చెన్నైలోని పూండమల్లి సీఆర్ఫీఎఫ్ 7వ బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీజన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాటి ఉద్యోగులతో కలిసి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే శ్రీజన్ కొంతకాలంగా విచారంతో ఉంటున్నాడని, ఎక్కువగా మాట్లాడేవాడు కాదని తెలిసింది.

కాట్టుపాక్కంలో కాపురం

కాట్టుపాక్కంలో కాపురం

శ్రీజన్ భార్య, ఇద్దరు పిల్లలు కాట్టుపాక్కంలో నివాసం ఉంటున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఇంటి నుంచి చెన్నైలోని పూండమల్లిలోని సీఆర్ఫీఎఫ్ 7వ బెటాలియన్ కు వెళ్లి విధులకు హాజరైనాడు. విధులకు హాజరైన తరువాత శ్రీజన్ సాటి ఉద్యోగులతో హాయ్ అంటే హాయ్ అని మాత్రమే మాట్లాడారని తెలిసింది.

గదిలో తుపాకి తూటాల మోత

గదిలో తుపాకి తూటాల మోత


బుధవారం తన రైఫిల్ తీసుకున్న శ్రీజన్ సీఆర్ఫీఎఫ్ క్యాంపు కార్యాలయంలోని ఓ గదిలోకి వెళ్లాడు. ఆ సయంలో శ్రీజన్ గది నుంచి రైఫిల్ తూటాల కాల్పులు వినపడటంతో సాటి ఉద్యోగులు అక్కడికి పరుగు తీశారు. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీజన్ ను వెంటనే పోరూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీజన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు నిర్దారించారు.

 అధికారులు షాక్

అధికారులు షాక్

శ్రీజన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న సీఆర్ఫీఎఫ్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఉద్యోగం విషయంలో శ్రీజన్ కు ఎలాంటి సమస్యలు లేవని, కుటుంబ సమస్యల కారణంగానే శ్రీజన్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

 భార్యతో గొడవలా ?

భార్యతో గొడవలా ?

విధులకు హాజరైయ్యే ముందు శ్రీజన్ ఏమైనా భార్యతో గొడవపడ్డాడా ?, కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీజన్ ఆత్మహత్య చేసుకునే ముందు ఓ డెత్ నోట్ రాసిపెట్టాడు. తన ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని, తనను అధికారులు ఎంతో బాగా చూసుకున్నారని, అందరి థ్యాక్స్, నా ఆంత్యక్రియులు చెన్నైలోనే నిర్వహించండి, నా శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకండి అంటూ రాసి ఉందని పోలీసులు తెలిపారు.

English summary
CRPF police deputy commandant commits suicide in Poonamallee in Chennai in Tamil Nadu. Police found suicidal note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X