ముత్తువేళ్ కరుణానిధి స్టాలిన్ అను నేను..: హోం శాఖా ఆయన వద్దే..కంప్లీట్ లిస్ట్ ఇదే
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని చెన్నైలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్టాలిన్ అనంతరం తమిళనాడు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించిన జాబితా, వారి పోర్ట్ ఫోలియోను ప్రభుత్వం ఒకరోజు ముందే విడుదల చేసింది.
రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలకక నాయకులు ఇందులో పాల్గొన్నారు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత.. కేబినెట్ సమావేశం కానుంది. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనుంది.

Recommended Video
స్టాలిన్‌తో పాటు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ పెరియసామి, కే పొన్ముడి, ఈవీ వేలు, ఎంఆర్‌కే పన్నీర్ సెల్వం, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, థంగం థెన్నరసు, ఎస్ రఘుపతి, ఎస్ ముత్తుసామి, కేఆర్ పెరియకరుప్పన్, టీఎం అన్బరాసన్, ఎంపీ స్వామినాథన్, పీ గీతా జీవన్, అనిత ఆర్ రాధాకృష్ణన్, ఎస్ రాజకన్నప్పన్, కే రామచంద్రన్, ఆర్ సక్కరపాణి, వీ సెంథిల్ బాలాజీ, ఆర్ గీతా గాంధీ, మా. సుబ్రమణియన్, పీ మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకే శేఖర్‌బాబు, పళణివేల్ త్యాగరాజన్, ఎస్ఎం నాజర్, గింగీ కేఎస్ మస్తాన్, అన్బిల్ మహేష్ పొయ్యమొళి, శివ వీ మెయ్యనాథన్, సీవీ గణేషన్, టీ మనో థంగరాజ్, ఎం మథివెంథన్, ఎన్ కాయల్‌విళి సెల్వరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications