family: భార్యను చంపాలని స్కెచ్, కూతుర్ని కాల్చి కాల్చిపారేశాడు, పండుగకు పిలిచి చంపేశాడు!

చెన్నై/కేజీఎఫ్: భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసిన భార్య గర్బవతి అయ్యింది. పండుగ జరుపుకోవడానికి రావాలని తల్లిదండ్రులు చెప్పడంతో కూతురు సంతోషంగా పుట్టింటికి వెళ్లింది. పండుగ సందర్బంగా మద్యం సేవించి మటన్ బిరియాని తిన్న తండ్రి చిందులు వేశాడు. భార్యను పట్టుకుని చితకబాది చంపేయాలని ప్రయత్నించిన సమయంలో కూతురు అడ్డం వెళ్లింది. ఆ సమయంలో రెచ్చిపోయిన తండ్రి తుపాకి తీసుకుని భార్య, కుమార్తె మీద కాల్పులు జరిపాడు. తండ్రి తుపాకితో కాల్పులు జరపడంతో పండుగకు వెళ్లిన కూతురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు.

కూతురు కొత్త పెళ్లికూతురు

కూతురు కొత్త పెళ్లికూతురు

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని డెంకణికోట (బెంగళూరు శివార్లు) దగ్గర ఉన్న అంచెట్టి కరాడికల్ గ్రామంలో అరుణాచలం, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. అరుణాచలం, మాధవి దంపతుల కుమార్తె వెంకటలక్ష్మి అలియాస్ లక్ష్మికి నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు సమీపంలోని గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనివాసన్ తో వివాహం జరిగింది.

పండుగకు పిలిచారు

పండుగకు పిలిచారు

నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న వెంకటలక్ష్మి ప్రస్తుతం మూడు నెలల గర్బవతి. ఆంధ్రులు, కన్నడిగులు ఉగాది పండుగ జరుపుకున్న మరుసటి రోజు తమిళ ఉగాది పండుగ వస్తుంది. ఉగాది పండుగకు రావాలని కూతురు వెంకటలక్ష్మి, అల్లుడు శ్రీనివాసన్ ను అరుణాచలం పిలిచాడు.

సంతోషంగా గడిపేశారు

సంతోషంగా గడిపేశారు

ఉగాది పండుగకు భర్త శ్రీనివాసన్ తో కలిసి వెంకటలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. పండుగ రోజు తల్లిదండ్రులు అరుణాచలం, మాధవితో పాటు ఇంటికి వచ్చిన బంధువులతో వెంకటలక్ష్మి చాలా సంతోషంగా గడిపింది. పండుగ మరుసటి రోజు రాత్రి అరుణాచలం ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ కూర చేశారు.

మద్యం మత్తులో తుపాకితో హల్ చల్

మద్యం మత్తులో తుపాకితో హల్ చల్

ఉగాది పండుగ మరుసటి రోజు దాదాపుగా అందరూ కచ్చితంగా మాంసాహర వంటకాలు చేస్తారు. మద్యం సేవించి ఇంట్లో బిర్యానీ తిన్న తరువాత అరుణాచలం ఓ విషయంలో అతని భార్య మాధవితో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఇంట్లో ఉన్న తుపాకి తీసుకున్న అరుణాచలం భార్య మాదవి మీద కాల్పులు జరిపాడు. మాదవి తుపాకి తూటాల నుంచి తప్పించుకుని పరుగు తీసింది.

తల్లి జస్ట్ మిస్.... తుపాకి తూటాలకు కూతురు బలి

తల్లి జస్ట్ మిస్.... తుపాకి తూటాలకు కూతురు బలి

తల్లి మాధవిని కాపాడటానికి కూతురు వెంకటలక్ష్మి ప్రయత్నించింది. తండ్రి అరుణాచలం చేతిలో నుంచి తుపాకి లాక్కోవడానికి కూతురు వెంకటలక్ష్మి ప్రయత్నించింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అరుణాచలం నువ్వు, నీ అమ్మ ఒక్కటేనా, ఇద్దరిని కాల్చిపారేస్తా అంటూ తుపాకితో కాల్చాడు. వెంకటలక్ష్మి ఛాతిలో తూటాలు దూసుకుపోవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Recommended Video

    Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan || Oneindia Telugu
    నాలుగు నెలల్లో

    నాలుగు నెలల్లో

    నాలుగు నెలల క్రితమే వెంకటలక్ష్మి వివాహం జరిగింది. ప్రస్తుతం మూడు నెలల గర్బవతి అయిన వెంకటలక్ష్మి సంతోషంగా పుట్టింటిలో పండుగ జరుపుకోవడానికి భర్తతో కలిసి వచ్చి కన్న తండ్రి చేతిలో హత్యకు గురైయ్యింది. కుమార్తెను కాల్చి చంపిన అరుణాచలం పరారైనాడు. డెంకణికోటే పోలీసులు అరుణాచలం కోసం గాలిస్తున్నారు. అసలు ఎందుకు అరుణాచలం భార్య, కుమార్తెను కాల్చి చంపడానికి ప్రయత్నించాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+