చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cheating; కాలేజ్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ లో 7 రోజుల్లో రూ. 77 లక్షలు, మైండ్ బ్లాక్, అసలు మ్యాటర్?

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: కాలేజ్ అబ్బాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ రోజు ఓ వ్యక్తి వెళ్లి తాను బ్యాంకు అధికారి అని కాలేజ్ అబ్బాయిని పరిచయం చేసుకున్నాడు. మా బ్యాంకులో కాలేజ్ విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ లు ప్రారంబిస్తున్నామని, నువ్వు బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే నీకు ముందుముందు అనేక లాభాలు ఉంటాయని నమ్మించాడు. కాలేజ్ అబ్బాయి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, విద్యార్థి ఫోటో తీసుకుని వెళ్లాడు.

తరువాత ఆ కాలేజ్ అబ్బాయి పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. కాలేజ్ అబ్బాయి ఆన్ లైన్ లో అతని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే కాలేజ్ అబ్బాయి అకౌంట్ లో రూ. 77 లక్షల డబ్బు డిపాజిట్ అయ్యిందని గుర్తించిన కాలేజ్ అబ్బాయి బిత్తరపోయాడు. అయితే అక్కడే ఓ తిరకాసు ఉంది.

Students: ఫేస్ బుక్ లో లుక్ చూపించి ?, సైకాలజీ చేసి శాడిస్టు ఏం చేశాడంటే?Students: ఫేస్ బుక్ లో లుక్ చూపించి ?, సైకాలజీ చేసి శాడిస్టు ఏం చేశాడంటే?

కాలేజ్ స్టూడెంట్

కాలేజ్ స్టూడెంట్

తమిళనాడులోని మదురై సిటీలోని అన్నానగర్ లో విఘ్నేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మదురైలోని ప్రముఖ కాలేజ్ లో విఘ్నేష్ చదువుకుంటున్నాడు. కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి అతని స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. కాలేజ్ పూర్తి అయిన తరువాత విఘ్నేష్ ఇంటికి వెళ్లిపోతున్నాడు.

జీరో బ్యాలెన్స్ అకౌంట్

జీరో బ్యాలెన్స్ అకౌంట్

ఇటీవల ఓ వ్యక్తి కాలేజ్ దగ్గరకు వెళ్లి కాలేజ్ బయట తాను బ్యాంకు అధికారి అని కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ ను పరిచయం చేసుకున్నాడు. మా బ్యాంకులో కాలేజ్ విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ తో బ్యాంక్ అకౌంట్ లు ప్రారంబిస్తున్నామని, నువ్వు బ్యాంక్ అకౌంట్ ప్రారంభిస్తే నీకు ముందుముందు అనేక లాభాలు ఉంటాయని విఘ్నేష్ ను నమ్మించాడు.

బ్యాంక్ అకౌంట్ కు కాలేజ్ అబ్బాయి ఆధార్ కార్డు, ఫోటో

బ్యాంక్ అకౌంట్ కు కాలేజ్ అబ్బాయి ఆధార్ కార్డు, ఫోటో

కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, అతని ఫోటో తీసుకుని వెళ్లాడు. తరువాత విఘ్నేష్ పేరుతో ఐడీఎఫ్ సీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ అయ్యింది. అంతవరకు కథ బాగానే ఉంది. తన పేరుతో బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ అవుతోందని కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ కూడా మురిసిపోయాడు.

కాలేజ్ అబ్బాయి అకౌంట్ లో అక్షరాల రూ. 77 లక్షలు

కాలేజ్ అబ్బాయి అకౌంట్ లో అక్షరాల రూ. 77 లక్షలు

కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ ఆన్ లైన్ లో అతని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. అంతే తన అకౌంట్ లో రూ. 77 లక్షల డబ్బు డిపాజిట్ అయ్యిందని గుర్తించిన కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ బిత్తరపోయి మదురై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు.

7 రోజుల్లో రూ. 77 లక్షలు డిపాజిట్.... హవాలా సొమ్ము ?

7 రోజుల్లో రూ. 77 లక్షలు డిపాజిట్.... హవాలా సొమ్ము ?

ఈకేసులో పోలీసులు ఉసిలంబట్టికి చెందిన శరన్, దేవన్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి కేవలం 7 రోజులే అయ్యిందని, 7 రోజుల్లో రూ. 77 లక్షలు ఎలా డిపాజిట్ చేశారు ?, ఆ డబ్బు ఏ బ్యాంక్ అకౌంట్ ల నుంచి వచ్చింది ? అని సైబర్ మదురై క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

మొబైల్ నెంబర్ మార్చేశారు

మొబైల్ నెంబర్ మార్చేశారు

కాలేజ్ అబ్బాయి విఘ్నేష్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయ్యింది హవాలా సొమ్మా ?, లేక బినామీల డబ్బులా ? అని ఆరా తీస్తున్నామని మదురై సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ లో విఘ్నేష్ మొబైల్ నెంబర్ కు బదులుగా దేవన్ మొబైల్ ఫోన్ నెంబర్ అటాచ్ చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Fraud: Bank account cheating while using college student name in Madurai in Tami Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X