Girl: లేడీ సింగర్ కు షాక్, కూతురికి బంధువుల టార్చర్, చర్చి ఫాదర్ కూడా వదల్లేదు, నమ్మినందుకు!
చెన్నై/హైదరాబాద్: హైదరాబాద్ కు చెందిన ప్లేబ్యాక్ సింగర్ కుమార్తెకు చేదు అనుభవం ఎదురైయ్యింది. నిత్యం కార్యక్రమాలకు హాజరుకావడానికి, సాంగ్స్ రికార్డింగ్ ల కోసం బయట తిరుగుతున్న ప్లేబ్యాక్ సింగర్ ఆమె కుమార్తెను చూసుకోవాలని సోదరుడి ఇంటిలో పెట్టింది. తల్లి బయట తిరుగుతుండటం, బంధువుల ఇంట్లో ఉన్న అమ్మాయి మీద కొందరు బంధువుల కళ్లుపడ్డాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సింగర్ కూతురిని కొందరు బంధువులు, చర్చి ఫాదర్ లైంగిక వేధింపులకు గురి చేసి చిత్రహింసలకు గురి చేశారని వెలుగు చూడటంతో ఆ సింగర్ షాక్ కు గురై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు చర్చి ఫాదర్ తో పాటు అమ్మాయి బంధువుల దూలతీరుస్తున్నారు.

హైదరాబాద్ ప్లేబ్యాక్ సింగర్
హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఆమె 15 ఏళ్ల కూతురితో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నది. నిత్యం అనేక కార్యక్రమాలకు హాజరుకావడానికి, సినిమా సాంగ్స్ రికార్డింగ్ కు వెళ్లడానికి ఆ ప్లేబ్యాక్ సింగర్ బయట ప్రాంతాల్లో తిరుగుతోంది. తాను బయటకు వెళితే తన కూతురు క్షేమంగా ఉండదని ఆ ప్లేబ్యాక్ సింగర్ గుడ్డిగా సొంత బంధువులను ఆశ్రయించింది.

నమ్మకంతో కూతుర్ని ఇంట్లో పెట్టింది
చెన్నైలోని సాలిగ్రామ్ లో నివాసం ఉంటున్న సోదరుడి ఇంట్లో కుమార్తెను పెట్టింది. గత 8 సంవత్సరాల నుంచి ఆ ప్లేబ్యాక్ సింగర్ కుమార్తె అత్త ఇంట్లోనే ఆశ్రయం పొందుతోంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆన్ క్లాస్ ల్లో చదువుతోంది. బాలికకు వరుసకు అత్త అయ్యే మహిళ భర్త పేరు జాన్ జెసిల్.

వన్ బై వన్ టార్చర్
అమ్మాయికి వరుసకు మామ అయ్యే జాన్ జెసిల్ కళ్లు అ అమ్మాయి మీదపడ్డాయి. ఇంట్లో ఒంటరిగా చిక్కినప్పుడు ఆ అమ్మాయిని జాన్ జెసిల్ లైంగిక వేధింపులకు గురి చేశాడు. జాన్ జెసిల్ బంధువులు అయిన షకీన్ షాన్, క్లారో అనే ఇద్దరు బంధువులు కూడా అమ్మాయి మీద కన్ను వేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసి చిత్రహింసలు పెట్టారు. వీళ్లు క్రమం తప్పకుండా చర్చికి కూడా వెళ్లి వస్తున్నారు.

చంపేస్తామని వార్నింగ్
విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆ అమ్మాయిని ఇంతకాలం ఈ కామాంధులు బెదరిస్తూ వస్తున్నారు. అమ్మాయి బంధువులు అందరూ క్రైస్తవులు కావడంతో వాళ్లు ఓ చర్చికి వెలుతున్నారు. చర్చిలో ఫాదర్ గా పని చేస్తూ అందరిని మంచి మార్గంలో నడవాలని సూచించాల్సిన చర్చి ఫాదర్ హెన్రీకి ఆ అమ్మాయి పరిచయం అయ్యాయింది. చర్చి ఫాదర్ కూడా ఆ అమ్మాయి మీద కన్ను వేశాడు.

చర్చి ఫాదర్ కూడా వదల్లేదు
చర్చి ఫాదర్ కూడా లైంగిక వేధింపులకు గురి చేసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని తెలిసింది. ఒకరి తరువాత ఒకరు బంధువులే లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. సహనం కోల్పోయిన అమ్మాయి ఇంతకాలం జరిగిన విషయాలు మొత్తం ఆమె తల్లి ప్లేబ్యాక్ సింగర్ కు చెప్పింది.

నీ దిక్కున్నచోట చెప్పుకో
తన కూతురి పట్ల ఎందుకు ఇంత నీఛంగా ప్రవర్తించారని, మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు కాదా, వాళ్లతో కూడా ఇలాగే ఉంటారా అంటూ ఆ ప్లేబ్యాక్ సింగర్ బంధువులను నిలదీసింది. మీకు దిక్కున్న చోటచెప్పుకోండి అంటూ బంధువులు ఎదురు తిరగడంతో ఆ ప్లేబ్యాక్ సింగర్ చెన్నైలోని కీల్ పాక్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

దెబ్బకు దూలతీరిపోయింది
అమ్మాయి దగ్గర స్టేట్ మెంట్ తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్చి ఫాదర్ హెన్రీతో పాటు అమ్మాయి బంధువులు ముగ్గురిని అరెస్టు చేశారు. అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్న మరో ముగ్గురిని విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications