School: స్కూల్ పిల్లలను అడ్రస్ అడుగుతున్న కారు డ్రైవర్, మొబైల్ లో వాళ్లకు ఏం చూపించాడంటే?

స్కూల్ కు ఒంటరిగా వెలుతున్న అమ్మాయిలు, అబ్బాయిలను ఓ కారు డ్రైవర్ టార్గెట్ చేసుకున్నాడు. కారు డ్రైవర్ వేసిన స్కెచ్ రివర్స్ కావడంతో అతను స్కూల్ టీచర్లకు, స్థానికులకు అడ్డంగా చిక్కిపోయాడు.

చెన్నై/టీనగర్: శాడిస్టులు ఎన్ని రకాలుగా, ఏ టైపులో ఉంటారో చెప్పడం మానసిక వైద్య నిపుణులకు కూడా కష్టం అని చెప్పాలి. ప్రతిరోజు స్కూల్ కు ఒంటరిగా వెలుతున్న అమ్మాయిలు, అబ్బాయిలను ఓ కారు డ్రైవర్ టార్గెట్ చేసుకున్నాడు. కారు డ్రైవర్ వేసిన స్కెచ్ రివర్స్ కావడంతో అతను స్కూల్ టీచర్లకు, స్థానికులకు అడ్డంగా చిక్కిపోయాడు. శాడిస్టు స్కెచ్ లు తెలుసుకుని స్కూల్ టీచర్లు. ప్రజలు షాక్ అయ్యారు,

చెన్నై సిటీలోని క్రోమ్‌పేట్‌ పక్కనే ఉన్న అస్తినాపురంలో నివాసం ఉంటున్న15 ఏళ్ల విద్యార్థి ప్రతిరోజు స్కూల్ కు నడుచుకుంటూ వెళ్లి స్కూల్ పూర్తి అయిన తరువాత నడుచుకుంటూనే ఇంటికి వెలుతున్నాడు. ఎప్పటిలాగే ఆ అబ్బాయి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి అడ్రస్‌ అడుగుతున్నట్లుగా మాట్లాడించి అసభ్యకరమై పోర్న్ వీడియోలు చూపించి అబ్బాయితో దురుసుగా ప్రవర్తించాడు.

Girls: School teachers and people who caught the car driver showing porn videos to school children in Chennai

దీంతో షాక్‌కు గురైన విద్యార్థిని పాఠశాలకు పరుగు తీసి ఆ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి తెలియజేసింది. ఏం జరిగిందని హెడ్ మాస్టర్ ఆరాతీశాడు. తరువాత హెడ్ మాస్టర్, స్కూల్ టీచర్లు బయటకు వచ్చి స్థానిక ప్రజల సాహాయం తీసుకుని అక్కడి నుంచి కారులో తప్పించుకునే ప్రయత్నం చేసి కారు డ్రైవర్ ను పట్టుకుని చిట్లపాక్కం మహిళా పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.

అనంతరం డ్రైవర్‌ను విచారించగా తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాననని, అస్తినాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్నానని, తన పేరు సూర్యా(25) అని నిందితుడు చెప్పాడని పోలీసులు అన్నారు. ఒంటరిగా వెళ్తున్న విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని గత ఏడాది కాలంగా వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నానని, ఇన్ని రోజులు తాను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు సూర్యా అంగీకరించాడని పోలీసులు అన్నారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సూర్యాను తాంబరం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+