Girls: కాలేజ్ లో ప్రొఫెసర్ బంతి... చామంతి, స్వాతిముత్యం కమల్ హాసన్, మనోడు గోకాడు, చివరికి ?
చెన్నై/ మెడికల్ కాలేజ్: ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉన్నత మైన ఉద్యోగం చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ చేతివాటం చూపించి అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఒంటరిగా అమ్మాయి కనపడితే చాలు ఆయన వాళ్లను తెగ గోకేశాడని తెలిసింది. మెడికల్ కాలేజ్ అమ్మాయిలతో ఇంతకాలం బంతి చామంతి అంటూ ఎంజాయ్ చేసిన ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ పాపం పండిపోవడంతో వెంటనే ఆయనకు ఆ కాలేజ్ నుంచి గేట్ పాస్ ఇప్పించేశారు. మెడికల్ కాలేజ్ అమ్మాయిలు ఒక్కసారిగా ఆయన బండారం మొత్తం బయటపెట్టడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తనకు ఏపాపం తెలీదని, తాను స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాంటి వాడు అని ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ చెబుతున్నాడు.
NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !

చెన్నై మెడికల్ కాలేజ్
చెన్నైలో తమిళనాడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్వహిస్తున్నాడు. చెన్నై మెడికల్ కాలేజ్ కు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. చెన్నై ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ చంద్రశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నై మెడికల్ కాలేజ్ లో ఇంతకాలం డాక్టర్ చంద్రశేఖర్ ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైయ్యిందని ఆరోపణలు ఉన్నాయి.

సార్ బంతి... చామంతి డ్యూయెట్లు
మెడికల్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలపై డాక్టర్ చంద్రశేఖర్ కన్ను పడిందని సమాచారం. కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక కాలేజ్ క్యాంపెస్ లో ఎవరైనా ఒంటరిగా అమ్మాయి కనపడితే వాళ్లను డాక్టర్ చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అమ్మాయిలు రివర్స్
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోవడంతో ఆ కాలేజ్ లో మెడిసిన్ చదువుతున్న అమ్మాయిలు సహనం కోల్పోయి కాలేజ్ డీన్ కు ఫిర్యాదు చేశారు. కాలేజ్ డీన్, ఆ కాలేజ్ లోని సీనియర్ ప్రొఫెసర్లు సైతం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఇదే సమయంలో ఆ కాలేజ్ లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలు అందరూ ఒక్కసారిగా రివర్స్ అయ్యారు.

ఎదురు తిరిగిన అమ్మాయిలు.... సార్ కు ఎర్ర జెండా
వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మీద చర్యలు తీసుకోకపోతే కాలేజ్ గేట్ ముందు ధర్నా చేస్తామని ఆ కాలేజ్ అమ్మాయిలు తేల్చి చెప్పారు. కాలేజ్ విద్యార్థులతో కాలేజ్ యాజమాన్యం రాజీ చర్చలు జరిపింది. చర్చలు విఫలం అయ్యాయి. కాలేజ్ అమ్మాయిలు అందరూ ఒక్కటి అయ్యి ఆందోళన చేస్తామని తేల్చి చెప్పడంతో కాలేజ్ డీన్ దిగి వచ్చారు. ప్రభుత్వం అనుమతితో అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ను చెన్నై మెడికల్ కాలేజ్ నుంచి రాయపేట్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు బదిలి చేశారు.

నేను స్వాతిముత్యం కమల్ హాసన్
తాను ఏ తప్పు చెయ్యలేదని, కాలేజ్ అమ్మాయిల పట్ల కఠినంగా వ్యవహించడం వలనే తన మీద వాళ్లు ఆరోపణలు చేస్తున్నారని అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వాదించడం మొదలుపెట్టాడు. తాను స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాంటి వాడిని, తాను ఏ ఒక్క అమ్మాయిని వేధించలేదు, కేవలం పరీక్షల్లో తక్కువ మార్కులు వేశానని కోపంతో కొందరు అమ్మాయిలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపిస్తున్నాడు.

11 మందితో విచారణ కమిటి
చెన్నై మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల కేసు విచారణ చెయ్యడానికి 11 మందితో ప్రత్యేక కమిటీ వేసిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొత్తం మీద కాలేజ్ అమ్మాయిలను గిల్లిన అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహారంపై చెన్నై మెడికల్ కాలేజ్ విద్యార్థులు పండిపడుతున్నారు.