Wife: ఎవడేవాడు ?, ఇంత రాత్రి నీకు ఏం పని ?, రోడ్లో భార్యను బీర్ బాటితో పొడిచి చంపిన భర్త!

చెన్నై: భార్య ప్రవర్తనపై మొదటి నుంచి భర్తకు అనుమానం ఉంది. ఇదే సమయంలో భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత భార్య పుట్టింటికి భర్త వెళ్లాడు. ఆ సమయంలో భార్య పుట్టింటిలో లేకపోవడంతో భర్త రగిలిపోయాడు. నీ కూతురు ఎక్కడ అని మామను ప్రశ్నించాడు. బంధువుల ఇంటికి వెళ్లిందని మామ చెప్పడంతో అల్లుడు అతన్ని పట్టుకుని చితకబాదేశాడు. గర్బవతి అయిన భార్య రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లడంతో ఆమెను పట్టుకుని చితకబాదేశాడు. ఇంతరాత్రి వరకు నువ్వు ఎవడితో కులకడానికి వెళ్లావు, ఇంత రాత్రినీకు ఏం పని, ఎవడే వాడు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ భర్త రెచ్చిపోయాడు. మార్యాదగా ఇప్పుడే నా ఇంటికి రా అని చెప్పి భార్యను బలవంతంగా పిలుచుకుని వెళ్లిన భర్త నడిరోడ్డులో బీర్ తాగి ఖాళీ బీర్ బాటిల్ పగలగొట్టి నడిరోడ్డులోనే ఆ బాటిల్ తో భార్యను పొడిచి చంపేశాడు.

చిన్న వయసులోనే కేటుగాడు

చిన్న వయసులోనే కేటుగాడు

చెన్నై సిటీలోని పులియంతోపు సమీపంలోని కన్యకాపురంలోని వాసుకీనగర్ లో రవి (27) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తున్న రవి మీద చెన్నైలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదైనాయి. పీకలదాక మద్యం సేవిస్తున్న రవి నిత్యం గొడవలు ఎక్కువగా చేస్తున్నాడు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

రవికి రెండు సంవత్సరాల క్రితం విజయలక్ష్మి (24) అనే యువతితో వివాహం అయ్యింది. రవి, విజయలక్ష్మి దంపతులకు ఏడాది వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. విజయలక్ష్మి ప్రస్తుతం మూడు నెలల గర్బవతి. భార్య విజయలక్ష్మి మీద మొదటి నుంచి భర్త రవికి అనుమానం ఎక్కువగా ఉంది. తాను బయటకు వెళ్లిన తరువాత విజయలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో బయట తిరుగుతోందని భర్త రవి చాలాసార్లు గొడవ చేశాడు.

భర్త దెబ్బకు భార్య పుట్టింటికి పరార్

భర్త దెబ్బకు భార్య పుట్టింటికి పరార్

రోజూ పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న రవి భార్య విజయలక్ష్మితో పదేపదే ఎవడు వాడు ? అంటూ గొడవ చేసేవాడు. భర్త రవి టార్చర్ తట్టుకోలేని విజయలక్ష్మి చెన్నైలోని పులియంతోపులోనే ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది. కొన్ని రోజుల నుంచి రవి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయాలని భార్య విజయలక్ష్మికి చెప్పినా ఆమె మాత్రం పట్టించుకోకుండా పుట్టింటిలోనే ఉండిపోయింది.

రాత్రి భార్య ఇంట్లో లేకపోవడంతో ?

రాత్రి భార్య ఇంట్లో లేకపోవడంతో ?


రాత్రి పీకలదాక మద్యం సేవించిన రవి భార్య పుట్టింటికి వెళ్లాడు. ఆ సమయంలో విజయలక్ష్మి ఇంట్లో లేకపోవడంతో రవి రగిలిపోయాడు. నీ కూతురు ఎక్కడ ? అంటూ విజయలక్ష్మి తండ్రి వెంకటేష్ ను ప్రశ్నించాడు. బంధువుల ఇంటికి వెళ్లిందని మామ వెంకటేష్ చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న రవి చిందులు వేశాడు.

నువ్వు తండ్రివా ? నా భార్యకు బ్రోకర్ వా

నువ్వు తండ్రివా ? నా భార్యకు బ్రోకర్ వా

నువ్వు నా భార్యకు తండ్రివా ? లేక బ్రోకర్ వా? అంటూ మామ వెంకటేష్ పట్టుకుని చితకబాదేశాడు. రాత్రి పొద్దుపోయిన తరువాత భార్య విజయలక్ష్మి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో పుట్టింటి దగ్గర భర్త రవిని చూసిన విజయలక్ష్మి షాక్ అయ్యింది. ఇంత రాత్రి వరకు ఎవడితో కులకడానికి వెళ్లావే ?, ఎవడే వాడు ? అంటూ రవి రెచ్చిపోయాడు. భార్య విజయలక్ష్మిని ఆమె ఇంటి ముందే పట్టుకుని చితకబాదేశాడు.

బీర్ బాటిల్ తో హంగామా

బీర్ బాటిల్ తో హంగామా

మర్యాదగా నాతోపాటు ఇంటికి వచ్చేయ్ అంటూ రవి భార్యకు చెప్పాడు. నేనురాను అని విజయలక్ష్మి చెప్పినా రవి మాత్రం మాట వినలేదు. భార్య విజయలక్ష్మిని బలవంతంగా పిలుచుకుని వెళ్లిన రవి వ్యాసరప్పాడి ఫ్లై ఓవర్ సమీపంలో భార్య విజయలక్ష్మితో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో వెంట తీసుకెళ్లిన బీర్ బాటిల్ తీసి అందులోని బీర్ మొత్తం తాగేశాడు. అదే సమయంలో భయంతో విజయలక్ష్మి తండ్రి వెంకటేష్ పులియంతోపు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 భార్యను నడిరోడ్డులో పొడిచి చంపేసిన భర్త

భార్యను నడిరోడ్డులో పొడిచి చంపేసిన భర్త

ఖాళీ బీర్ బాటిల్ పగలగొట్టిన రవి అదే బాటిల్ తీసుకుని గర్బిణి అయిన భార్య విజయలక్ష్మిని నడిరోడ్డులో పోడిచేశాడు. కడుపులో బీర్ బాటిల్ గుచ్చుకోవడంతో విజయలక్ష్మి అక్కడే ప్రాణాలు వదిలేసింది. స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో అటువైపు గస్తి తిరుగుతున్న పోలీసులు రావడంతో రవి పారిపోవడానికి ప్రయత్నించారు. స్థానికులు వెంటాడి గర్బణి అయిన భార్యను దారుణంగా బీర్ బాటిల్ తో పొడిచి చంపిన రవిని పట్టుకుని చిలకబాది పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+