I’M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

చెన్నై/ న్యూఢిల్లీ/ ఖతార్: ఇంజనీరింగ్ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అమ్మాయిల పిచ్చి ఉండటంతో ఉద్దరగా డబ్బులు సంపాధించాలని అత్యాశ అతనిలో పెరిగిపోయింది. బాగా డబ్బున్న అమ్మాయిలను పెళ్లి పేరుతో ఎంజాయ్ చెయ్యడం, తరువాత చిక్కినకాడికి దోచుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది. బాగా చదువుకున్న ఆ యువకుడు ఒక్క సినిమాను 30 సార్లు చూశాడు. 10 సార్లు I'M NOT HIM అనే సినిమా ట్రైలర్ గా చూసిన అతను మరో 20 సార్లు ఆ సినిమాను సీరియస్ గా చూశాడు. అంతే 20 మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడి వారికి రసగుల్లా తినిపించిన అతను 21 అమ్మాయి విషయంలో పప్పులోకాలేసి అడ్డంగా బుక్కైపోయాడు.

చెన్నైలో ఇంజనీరింగ్

చెన్నైలో ఇంజనీరింగ్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని అవడి సమీపంలోని తిరుములైవాయల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాకేష్ శర్మ (36) ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేశాడు. చదువులో ముందుండే రాకేష్ శర్మకు మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న రాకేష్ శర్మాకు ఆ డబ్బులు సరిపోలేదు.

అమ్మాయిని లైన్ లో పెట్టినా టైం కలిసిరాలేదు

అమ్మాయిని లైన్ లో పెట్టినా టైం కలిసిరాలేదు

చెన్నైలోని కొడుంగైయూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతిని రాకేష్ శర్మ లైన్ లో పెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని, ఈ జీవితానికి నువ్వే నాదేవత అంటూ రాకేష్ శర్మ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై ఆమెకు అనుమానం వచ్చింది. యువతి ఆమె తండ్రికి అసలు విషయం చెప్పడంతో ఆయన కోడుంగైయూర్ పోలీసులకు రాకేష్ శర్మ మీద ఫిర్యాదు చేశారు.

 డబ్బులు ఇస్తే వదిలేస్తా

డబ్బులు ఇస్తే వదిలేస్తా

యువతితో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలు, కొన్ని వీడియోలు రాకేష్ శర్మ దగ్గర ఉన్నాయి. ఆ ఫోటోలు వీడియోలు అడ్డం పెట్టుకున్న రాకేష్ శర్మ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తనకు డబ్బులు ఇస్తే నిన్ను వదిలి వెళ్లిపోతానని ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. యువతి తండ్రి మళ్లీ కొడుంగైయూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్లాన్ ప్రకారం డబ్బులు తీసుకోవడానికి మాధవరం ప్రాంతం దగ్గరకు రావాలని ఆమె రాకేష్ శర్మకు ఫోన్ చేసి చెప్పింది.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రాకేష్

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రాకేష్

యువతి చెప్పిన మాధవరంలోని ప్రాంతానికి వెళ్లిన రాకేష్ శర్మ డబ్బులు తీసుకుని హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. అసలే ఆ డ్రామా స్కెచ్ వేసిన పోలీసులు ఎంట్రీ ఇచ్చి డబ్బుతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించి రాకేష్ శర్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెండ్ తీశారు.

కేటుగాడికి దూరంగా భార్య

కేటుగాడికి దూరంగా భార్య

రాకేష్ శర్మకు ఇంతకు ముందే పెద్దలు నిశ్చయించిన అమ్మాయితో వివాహం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే రాకేష్ శర్మ ప్రవర్తనపై విసిగిపోయిన భార్య అతనికి దూరంగా పుట్టింటిలో ఉంటున్నదని పోలీసులు అన్నారు. భార్యకు దూరంగా ఉంటున్న రాకేష్ శర్మ అమాయకులైన అమ్మాయిలకు వలవేసి పెళ్లి పేరుతో వారిని నిలువుదోపిడీ చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఖతార్ లో I’M NOT HIM సినిమా 30 సార్లు

ఖతార్ లో I’M NOT HIM సినిమా 30 సార్లు

రాకేష్ శర్మ ఖతార్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ సమయంలో రాకేష్ శర్మ I'M NOT HIM సినిమా 30 సార్లు చూశాడు. సినిమా సీన్లలో లీనమైపోయిన రాకేష్ శర్మకు అంతకు ముందే అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా సినిమా స్టైల్లో యువతులను మోసం చెయ్యాలని స్కెచ్ వేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలకు అనుమానం వచ్చి రాకేష్ శర్మను ప్రశ్నిస్తే I'M NOT HIM, అతను వేరే, నేను వేరు అంటూ సినిమా డైలాగులు చెప్పి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడని పోలీసులు అన్నారు.

 20 మందిని మోసం చేసి రూ. లక్షలు లూటీ

20 మందిని మోసం చేసి రూ. లక్షలు లూటీ


ప్రేమ, పెళ్లి పేరుతో రాకేష్ శర్మ ఇప్పటి వరకు సుమారు 20 మంది అమాయకులైన యువతులను మోసం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలను మోసం చేస్తున్న రాకేష్ శర్మ వారితో ఎంజాయ్ చేసిన తరువాత చిక్కినకాటికి రూ. లక్షల రూపాయలు, భారీ మొత్తంలో బంగారు నగలు లూటీ చేశాడని పోలీసులు అంటున్నారు. రాకేష్ శర్మ మాయమాటలతో మోసపోయిన యువతులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చెయ్యాలని, అతని బండారం బయటపెట్టిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చెన్నై సిటీ పోలీసులు అంటున్నారు. మొత్తం మీద 20 మంది అమ్మాయిలకు రసగుల్లా తినిపించిన రాకేష్ శర్మను పోలీసులు బెండ్ తీసి బండారం మొత్తం బయటకు లాగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+