Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియురాలి కోసం ఆమె ఫ్యాన్స్ వస్తున్నారని ?, వీధిలో ప్రియుడు ఏం చేశాడంటే!

చెన్నై/ క్రిష్ణగిరి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైన ఆమె భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత ఇంట్లో ఆమె ఒక్కటే ఉంటున్నది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తి భార్య కూడా ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది. భర్త చనిపోయిన మహిళ, భార్య చనిపోయిన వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోకుండానే ఇద్దరూ వేరే ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ఏడాది నుంచి ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి.

తాను బయటకు వెళ్లిన తరువాత తన ప్రియురాలి కోసం ఎవరెవరో ఇంటికి వచ్చి వెలుతున్నారని తెలుసుకున్న ప్రియుడు రగిలిపోయారు. ఇదే విషయంలో ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి. సహనం కోల్పోయిన ప్రియుడు కత్తి తీసుకుని అతని ప్రియురాలిని ఇంట్లోనే పొడిచేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ప్రియురాలిని రోడ్డు మీద కత్తితో పొడిచిన ప్రియుడు తప్పించుకుని ఎస్కేప్ అయ్యాడు.

భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ

భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని మాటూరు సమీపంలోని చోళరపల్లిలో పార్వతి (40) అనే మహిళ నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు చూపించిన రమేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న పార్వతి ఆమె భర్తతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైన పార్వతి భర్త రమేష్ చనిపోయాడు.

భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న పొటుగాడు

భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న పొటుగాడు

భర్త రమేష్ చనిపోయిన తరువాత పార్వతి ఇంట్లో ఒక్కటే ఉంటున్నది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న మురుగన్ (45) అనే వ్యక్తి భార్య కూడా ఐదు సంవత్సరాల క్రితం చనిపోయింది. భార్య చనిపోయిన తరువాత మురుగన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఒకే ఊరిలో నివాసం ఉంటున్న పార్వతి, మురుగన్ కు ముందు నుంచి పరిచయం ఉంది.

పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో?

పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో?

భర్త చనిపోయిన పార్వతి, భార్య చనిపోయిన మురుగన్ రెండు సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోకుండానే పార్వతి, మురుగన్ కలిసి వేరే ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. మేస్త్రీ పని చేస్తున్న మురుగన్ డబ్బులు సంపాధిస్తూ అతని ప్రియురాలు పార్వతిని బాగానే చూసుకునేవాడు.

ప్రియురాలి మీద అనుమానం

ప్రియురాలి మీద అనుమానం

ఏడాది నుంచి పార్వతి, మురుగన్ మద్య గొడవలు మొదలైనాయి. తాను బయటకు వెళ్లిన తరువాత తన ప్రియురాలు పార్వతి కోసం ఎవరెవరో ఇంటికి వచ్చి వెలుతున్నారని తెలుసుకున్న ఆమె ప్రియుడు మురుగన్ రగిలిపోయాడు. ఇదే విషయంలో పార్వతి, మురుగన్ మద్య గొడవలు జరుగుతున్నాయి. పగలు గొడవపడటం, రాత్రి ఒక్కటి అయిపోవడం మామూలుగా జరిగిపోతా ఉందని తెలిసింది.

 ఇంట్లో, వీధిలో కూడా వదలకుండా పొడిచేసిన ప్రియుడు

ఇంట్లో, వీధిలో కూడా వదలకుండా పొడిచేసిన ప్రియుడు

రాత్రి పార్వతి, మురుగన్ మధ్య ఇదే విషయంలో గొడవలు జరిగాయి. సహనం కోల్పోయిన ప్రియుడు మురుగన్ కత్తి తీసుకుని అతని ప్రియురాలు పార్వతిని ఇంట్లోనే పొడిచేశాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ప్రియురాలు పార్వతిని రోడ్డు మీద కత్తితో పొడిచిన ప్రియుడు మురుగన్ తప్పించుకుని ఎస్కేప్ అయ్యాడు. తీవ్రగాయాలైన పార్వతిని ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. ప్రియురాలిని పొడిచి తప్పించుకున్న మురుగన్ అతని బంధువు ఇంట్లో తలదాచుకోవడంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+