Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పెళ్లి తరువాత భార్యకు బ్రేక్, మళ్లీ గేర్ మార్చిన లవర్, విరక్తితో భర్త, ఫినిష్!

చెన్నై/పొల్లాచ్చి/కోయంబత్తూరు: పెళ్లి చేసుకుని చక్కగా భర్తతో కాపురం చేస్తున్న మహిళ జీవితంలో ఆమె పాత ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. పాత నేస్తం పరకో కొట్టినా పోదు అనే సామెతలాగా భార్య కూడా పెళ్లి తరువాత బ్రేక్ ఇచ్చి మళ్లీ పాత ప్రియుడు, సమీప బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకునింది. రెండుమాడుస్లారు భర్తకు బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయిన భార్యకు, ఆమె ప్రియుడికి భర్త బుద్దిమాటలు చెప్పాడు. భర్త చెప్పిన బుద్దిమాటలను భార్య బూడిదతో సమానంగా చూసింది.

అంతే విరక్తితో రగిలిపోయిన భర్త వేటకోడవలి తీసుకుని మంచం మీద ఉన్న భార్యను నిలువునా నరికేశాడు. భార్య చేతిని నరికేసి పక్కన విసిరేసిన భర్త నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతని భార్య, ప్రియుడి కథతో పాటు స్క్రీన్ ప్లే అంటూ స్టోరీ మొత్తం చెప్పడం కలకలం రేపింది.

రైతుకు గ్రాండ్ గా పెళ్లి

రైతుకు గ్రాండ్ గా పెళ్లి

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపంలోని తోండముత్తూర్ ప్రాంతంలో లక్ష్మణ్ రాజ్ (36) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం లక్ష్మణ్ రాజ్ శరణ్య (26) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. లక్ష్మణ్ రాజ్, శరణ్య దంపతులకు లోకేష్ (5) అనే కుమారుడు ఉన్నాడు. లక్ష్మణ రాజ్ కు సొంత పొలం ఎక్కవగా ఉండటంతో అతను వ్యవసాయం చేస్తూ భార్య, కుమారడితో కలిసి సంతోషంగా ఉంటున్నాడు.

 భార్య పాత ప్రియుడు+ దూరపు బంధువు

భార్య పాత ప్రియుడు+ దూరపు బంధువు

శరణ్యకు ఓంప్రకాష్ అనే దూరపు బంధువు ఉన్నాడు. శరణ్య కంటే వయసులో ఓం ప్రకాష్ చిన్నవాడు. పెళ్లికాకముందే శరణ్య, ఓం ప్రకాష్ కు అక్రమ సంబంధం ఉందని తెలిసింది. పెళ్లి తరువాత నాలుగు సంవత్సరాలు పాటు శరణ్య ఆమె ప్రియుడు ఓం ప్రకాష్ కు దూరంగా ఉండేది. తరువాత శరణ్య చాలా కాలం బ్రేక్ తరువాత ఆమె ప్రియుడు ఓం ప్రకాష్ మళ్లీ రెండు సంవత్సరాల క్రితం దగ్గర అయ్యింది.

భర్త లేకపోతే భార్య, ప్రియుడికి అదే పని

భర్త లేకపోతే భార్య, ప్రియుడికి అదే పని

భర్త లక్ష్మణ్ రాజ్ వ్యవసాయం చెయ్యడానికి బయటకు వెళ్లిన సమయంలో, పనిమీద కోయంబత్తూర్ వెళ్లిన సమయంలో అతని భార్య శరణ్య ప్రియుడు ఓం ప్రకాష్ కు ఫోన్ చేసి విషయం చెప్పింది. గత రెండు సంవత్సరాల నుంచి లక్ష్మణ్ రాజ్ ఇంట్లో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న ఓం ప్రకాష్ అతని భార్య, పాత ప్రియురాలు శరణ్యతో ఎంజాయ్ చేసి వెళ్లిపోతున్నాడు.

భర్తకు కు మూడుసార్లు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది

భర్తకు కు మూడుసార్లు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది

తాను ఇంట్లోలేని సమయంలో ఓం ప్రకాష్ తన ఇంటికి వచ్చి వెలుతున్నాడని లక్ష్మణ్ రాజ్ కు తెలిసింది. మూడుసార్లు శరణ్య, ఓం ప్రకాష్ బెడ్ రూమ్ లో, ఇంట్లో ఏకాంతంగా గడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా భర్త లక్ష్మణ్ రాజ్ కు చిక్కిపోయారు. అయినా భార్యను, ఓం ప్రకాష్ మీద చెయ్యి చేసుకోకుండా జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముంద ఇలా చెయ్యకండి అంటూ భర్త లక్ష్మణ్ రాజ్ ఇద్దరికి బుద్దిమాటలు చెప్పాడు.

మడు నెలలు సైలెంట్

మడు నెలలు సైలెంట్

మూడు నెలలపాటు శరణ్య, ఓం ప్రకాష్ కలవడం మానేశారు. మూడు నెలల తరువాత మళ్లీ ఇద్దరూ పాతపాట మొదలుపెట్టి రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ రాజ్ భార్య శరణ్య మీద తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. నువ్వు పద్దితి మార్చుకోకపోతే నేనే నా పద్దతి మార్చుకోవాల్సి వస్తుందని భర్య శరణ్యను హెచ్చరించాడు.

అన్నా.... నాకేమి తెలీదు. నీ భార్య రమ్మంటే వస్తున్నా

అన్నా.... నాకేమి తెలీదు. నీ భార్య రమ్మంటే వస్తున్నా

భార్య శరణ్యతో పాటు ఆమె ప్రియుడు ఓం ప్రకాష్ ను కలిసిన లక్ష్మణ్ రాజ్ మీ పద్దతి మార్చుకోవాలని మరోసారి మర్యదగా చెప్పాడు. అన్నా నాకే ఏమీ తెలీదు, నీ భార్య రమ్మంటుంటే వచ్చి వెలుతున్నా, నా మీద నీ ప్రతాపం చూపించకు, నీ భార్యను కంట్రోల్ లో పెట్టుకో అంటూ ఓం ప్రకాష్ ఎదురు తిరగడంతో లక్ష్మణ్ రాజ్ కు ఎక్కడో కాలిపోయింది.

ఆ ఒక్కటిఅడక్కు అని చెప్పిన భార్య

ఆ ఒక్కటిఅడక్కు అని చెప్పిన భార్య

నా భార్య ఇక మారదని లక్ష్మణ్ రాజ్ డిసైడ్ అయ్యాడు. రాత్రి భార్య శరణ్య, కుమారుడితో కలిసి లక్ష్మణ్ రాజ్ భోజనం చేశాడు. తరువాత బాబు నిద్రపోయిన తరువాత లక్ష్మణ్ రాజ్, శరణ్య దంపతులు గొడవపడ్డారు. నువ్వు ఒక్కసారి ఇక మీదట ఓం ప్రకాష్ ను కలవను అని చెప్పాలని భర్త భార్య శరణ్యను అడిగాడు. అయితే శరణ్య మాత్రం తాను ఓం ప్రకాష్ ను వదిలే ప్రసక్తిలేదని తేల్చిచెప్పింది.

వేటకోడవలితో ఏసేశాడు

వేటకోడవలితో ఏసేశాడు

మాటామాటా పెరిగిపోవడంతో అంతవరకు సహనంగా ఉన్న లక్ష్మణ్ బెడ్ రూమ్ పక్క రూమ్ లో ఉన్న వేటకొడవలి తీసుకువచ్చి మంచం మీద పడుకుని ఉన్న భార్య శరణ్యను అడ్డంగా నరికేశాడు. మంచం మీద కుప్పకూలిన శరణ్య గొంతు కోసేయడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తరువాత భార్య చేతిని పూర్తిగా నరికేసిన లక్ష్మణ్ రాజ్ నేరుగా పొల్లాచ్చి పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య అక్రమ సంబంధం కథ, స్క్రీన్ ప్లే కూడా మొత్తం చెప్పేసిన లక్ష్మణ్ రాజ్ పోలీసుల ముందు బోరున విలపించాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+