Illegal affair: భర్త హత్య కేసులో జైలుకు, బెయిల్ మీద వచ్చిన బ్యూటీపార్లల్ కిలాడీ, నడిరోడ్డులో నరికేశారు !
చెన్నై/ కాంచీపురం: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో జీవితాంతం సుఖంగా జీవించాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. భార్య బ్యూటీపార్లల్ పెట్టుకుని రోజు అక్కడికి వెళ్లి వస్తోంది. బ్యూటీపార్లల్ ఉండటంతో ఆమె రోజూ సింగారించుకుని టిక్కులాడిలా తిరగడం మొదలుపెట్టింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇంటికి వెళ్లిన తరువాత కూడా భార్య ఎక్కువగా వేరే వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడుతోంది. ఇదే విషయంలో పెద్ద రాద్దాంతం జరిగింది. కొన్ని నెలల క్రితం బయటకు వెళ్లిన భర్త దారుణ హత్యకు గురైనాడు. భర్త హత్య కేసులో కొందరు యువకులతో పాటు అతని భార్య కూడా జైలుకు వెళ్లింది. భర్త హత్య కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన లేడీ మళ్లీ బ్యూటీపార్లల్ కు వెలుతోంది. రాత్రి బ్యూటీపార్లల్ నుంచి ఇంటికి బయలుదేరిన మహిళ మార్గం మద్యలో ఓ యువకుడితో చాలాసేపు మాట్లాడుతూ నిలబడి ఉంది. అదే సమయంలో మూడు బైక్ ల్లో వెళ్లిన వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో బ్యూటీపార్లల్ లేడీని నరికి చంపేయడం కలకలం రేపింది.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కున్రత్తూరు పెరియార్ నగర్ లోని పిళ్లైయార్ కోవిల్ వీధిలో ఇందుమతి అలియాస్ ఇందు (30) అనే యుతి నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం కుమారన్ అలియార్ కుమార్ అనే యువకుడితో ఇందుమతి వివాహం చెయ్యాలని అనుకున్నారు. ఇందుమతి, కుమారన్ పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరి పెళ్లి జరిగిపోయింది.

బ్యూటీపార్లల్ టిక్కులాడి
కుటుంబ సభ్యులు చూపించిన ఇందుమతిని వివాహం చేసుకున్న కుమారన్ అతని భార్యతో జీవితాంతం సుఖంగా జీవించాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కుమారన్ భార్య ఇందుమతి బ్యూటీపార్లల్ పెట్టుకుని రోజు అక్కడికి వెళ్లి వస్తోంది. బ్యూటీపార్లల్ ఉండటంతో ఇందుమతి రోజూ సింగారించుకుని టిక్కులాడిలా తిరగడం మొదలుపెట్టింది.

భర్తకు నచ్చకపోయినా డోంట్ కేర్
ఇదే విషయంలో కుమారన్, ఇందుమతి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. ఇంటికి వెళ్లిన తరువాత కూడా కుమారన్ భార్య ఇందుమతి ఎక్కువగా వేరే వ్యక్తులతో ఫోన్లలో మాట్లాడుతోంది. ఇదే విషయంలో కుమారన్, ఇందుమతి దంపతుల మద్య చాలాకాలం పాటు పెద్ద గొడవలు జరిగాయి. కొంతకాలం పెద్దలు రాజీ చేశారు.

ఎంతో ఆశపడ్డాడు.... .అంతలోనే లేపేశారు
అందమైన భార్య ఇందుమతితో జీవితాంతం సుఖంగా ఉండాలని కుమారన్ చాలా ఆశలు పెంచుకున్నాడని అతని స్నేహితులు అంటున్నారు. అయితే గత ఏడాది ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారన్ దారుణ హత్యకు గురైనాడు. కుమారన్ హత్యకు గురికావడంతో అప్పట్లో కలకలం రేపింది. పోలీసులు కేసు అనేకకోణాల్లో విచారణ చేశారు.

భర్త హత్య కేసులో జైలుకు వెళ్లిన భార్య
భర్త కుమారన్ హత్య కేసులో కొందరు యువకులతో పాటు అతని భార్య ఇందుమతి కూడా జైలుకు వెళ్లింది. కుమారన్ హత్య కేసులో జైలుకు వెళ్లిన ఇందుమతిని ఆమె కుటుంబ సభ్యులు అంత త్వరగా జైలు నుంచి బయటకు తీసుకురాలేదని ,ఇదే విషయంలో ఇందుమతి ఆమె కుటుంబ సభ్యుల మీద రగిలిపోయిందని సమాచారం.

రోడ్డు పక్కన బాయ్ ఫ్రెండ్ తో ?
కొన్ని నెలల తరువాత భర్త కుమారన్ హత్య కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన కిలాడీ లేడీ ఇందుమతి మళ్లీ బ్యూటీపార్లల్ కు వెలుతోంది. రాత్రి బ్యూటీపార్లల్ నుంచి ఇంటికి బయలుదేరిన ఇందుమతి కుంరత్తూరు-పల్లవరం రోడ్డులోని మనంచేరి సమీపంలో ఓ యువకుడితో చాలాసేపు మాట్లాడుతూ నిలబడి ఉంది. ఇందుమతి, ఆమె బాయ్ ఫ్రెండ్ పిచ్చపాటిగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు.

నిమిషాల్లో నరికేసి ఎస్కేప్
అదే సమయంలో మూడు బైక్ ల్లో వెళ్లిన వ్యక్తులు కత్తులు, వేటకొడవళ్లతో బ్యూటీపార్లల్ లేడీ ఇందుమతిని నరికేశారు. ఈ దెబ్బతో ఇందుమతి బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పరారైనాడు. తీవ్రగాయాలైన ఇందుమతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు చెప్పారు.

భర్త హత్యకు ప్రతీకారమా ?, అక్రమ సంబంధంతో హత్యా
భర్త కుమారన్ హత్యకు ప్రతీకారంగా ఇందుమతిని చంపేశారా ?, లేక అక్రమ సంబంధాల కారణంగా ఆమె హత్యకు గురైయ్యిందా ? అని కచ్చితంగా తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని కాంచీపురం జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఇందుమతిని నడిరోడ్డులో నరికి చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications