Son in law: కూతురి బాయ్ ఫ్రెండ్ మ్యాటర్ లో గొడవ, అల్లుడిని అత్త ఏ రేంజ్ లో చంపిందంటే ?, రివర్స్ గేర్!
చెన్నై/ నమ్మక్కల్: ఒకే ఊరిలో ఉన్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికులు పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పదేపదే పుట్టింటికి వెలుతున్న భార్య ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త అతని భార్యను చితకబాదేశాడు.
భర్త చితకబాదడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటూ ప్రియుడితో మస్త్ మజా చేసింది. భార్య మ్యాటర్ ఏదోఒకటి తేల్చుకోవాలని భర్త అత్తారింటికి వెళ్లాడు. కూతురి అక్రమ సంబంధం విషయం తెలిసినా ఆమెను మందలించకుండా ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి పంపిస్తావా అంటూ అల్లుడు అత్తను బూతులు తిట్టాడు. కూతురు ప్రియుడి సహాయంతో అత్త ఆమె అల్లుడిని దారుణంగా హత్య చేయించింది.

ఒకేఊరిలో లవర్స్
తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని రాశీపురంలో అరుల్ మణి అలియాస్ అరుల్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాశీపురంలోనే జ్యోతిలక్ష్మి అలియాస్ జ్యోతి (27) అనే యువతి నివాసం ఉంటున్నది. ఒకే ఊరిలో ఉన్న అరుల్, జ్యోతిలక్ష్మి కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు.

లవ్ మ్యారేజ్..... గొడవలు
కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమికులు అరుల్, జ్యోతిలక్ష్మి పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేశారు. అరుల్, జ్యోతిలక్ష్మి దంపతులకు నిట్రన్ (5), అఖిలన్ (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత రానురాను అరుల్, జ్యోతిలక్ష్మి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

పుట్టింటి దగ్గర ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య
భర్త అరుల్ లో ఎక్కువగా గొడవపడి పదేపదే పుట్టింటికి వెలుతున్న జ్యోతిలక్ష్మి ఆమె తల్లి జానకి గొడవల గురించి చెప్పి కొన్ని రోజులు అక్కడే ఉండేది. ఇదే సమయంలో పదేపదే పుట్టింటికి వెలుతున్న జ్యోతిలక్ష్మి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మణికందన్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

కూతురి మ్యాటర్ తెలిసినా తల్లి సైలెంట్..... భర్త వైలెంట్
కూతురు జ్యోతిలక్ష్మి మణికందన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోందని ఆమె తల్లి జానకికి తెలిసినా ఆమె పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. జ్యోతిలక్ష్మి, మణికందన్ అక్రమ సంబంధం గురించి తెలుసున్న ఆమె భర్త అరుల్ రగిలిపోయి అతని భార్యను చితకబాదేశాడు. పద్దతి మార్చుకోకపోతే చంపేస్తానని అరుల్ అతని భార్య జ్యోతిలక్ష్మికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

అత్తమీద రగిలిపోయిన అల్లుడు
భర్త అరుల్ చితకబాదడంతో అతని భార్య జ్యోతిలక్ష్మి ఆమె పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే తల్లి జానకితో కలిసి ఉంటున్నది. పుట్టింటిలో సెటిల్ అయిపోయిన జ్యోతిలక్ష్మి ఆమె ప్రియుడు మణికందన్ తో తిరుగుతూ మస్త్ మజా చేసింది. భార్య జ్యోతిలక్ష్మి మ్యాటర్ ఏదోఒకటి తేల్చుకోవాలని అరుల్ అతని అత్తారింటికి వెళ్లాడు.

నువ్వు తల్లివా..... నా భార్యకు బ్రోకరా?
నీ కూతురి అక్రమ సంబంధం విషయం తెలిసినా ఆమెను మందలించకుండా ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి పంపిస్తావా అంటూ అరుల్ అతని అత్త జానకిని బూతులు తిట్టాడు. ఆ సందర్బంలో అత్త జానకితో అల్లులు అరుల్ గొడవ పెట్టుకున్నారు. అందరి ముందు నన్ను బూతులు తిడుతావా, నీ అంతు చూస్తానని జానకి ఆమె అల్లుడు అరుల్ కు వార్నింగ్ ఇచ్చింది.

బీరు బాటిల్స్, రాళ్లతో అల్లుడిని కొట్టి చంపించిన అత్త
కూతురు జ్యోతిలక్ష్మి ప్రియుడు మణికందన్ ను కలిసిన జానకి తన అల్లుడు అరుల్ ను చంపేస్తే నా కూతురితో నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావని అతన్ని రెచ్చగొట్టింది. మణికందన్, అతని స్నేహితుడు లోకేశ్వరన్ అరుల్ ను లిక్కర్ పార్టీ ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న అరుల్ ను బీరు బాటిల్స్, రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అరుల్ హత్య కేసులో అతని భార్య జ్యోతిలక్ష్మితో పాటు అత్త జానకి, భార్య ప్రియుడు మణికందన్, లోకేశ్వరన్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications