Illegal affair: కంపెనీలో కలిసి పని చేస్తున్న ప్రియుడు, బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తుంటే భర్త ఎంట్రీ !
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు వయసుకు వస్తున్న సమయంలో భార్య ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది, రానురాను యువకుడితో చనువు పెంచుకున్న మహిళ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడిని నేరుగా ఇంటికే పిలిపించుకుంటున్న భార్య అతనితో ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోవడంతో భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త వార్నింగ్ ఇచ్చినా భార్య మాత్రం పట్టించుకోకుండా తన కంటే వయసులో చిన్నవాడైన యువకుడితో ఎంజాయ్ చేసింది. భర్త అనుకోకుండా ఇంటికి వెళ్లాడు.
భర్త తలుపు తట్టిన కొంతసేపటి తరువాత భార్య, ఆమె ప్రియుడు అర్దనగ్నంగా బట్టలు వేసుకుని ఇంటి డోర్ తీశారు. భర్తను చూసి ప్రియుడు ఎస్కేప్ కావడంతో భార్య మాత్రం భర్తకు చిక్కిపోయింది. భార్యను పట్టుకుని చితకబాదిన భర్త ఎవరో ఒకరు చస్తేకాని ఈ సమస్యకు పరిష్కారం చిక్కదు అని ఆవేశంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తన అక్రమ సంబంధం గురించి అందరికీ తెలిసిపోయిందని అవమానంతో భార్య నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియుడు ఎస్కేప్ అయ్యాడు.

దంపతులు హ్యాపీ
చెన్నై సిటీలోని పల్లవరం ఏరియాలోని కన్నపిరాన్ ప్రాంతంలోని దేవాలయం వీధిలో పెరుమాల్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెరుమాల్ రాజలక్ష్మి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న పెరుమాల్, రాజలక్ష్మి దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

పని చేస్తున్న కంపెనీలో యువకుడితో ?
రాజలక్ష్మి, పెరుమాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నైలోని పల్లవరం ఏరియాలోనే ఉన్న ఓ కంపెనీలో రాజలక్ష్మి ఉద్యోగం చేస్తున్నది పిల్లలు వయసుకు వస్తున్న సమయంలో రాజలక్ష్మి ఆమె ఉద్యోగం చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో పరిచయం పెంచుకుంది,

ప్రియుడిని ఇంటికే పిలిపించుకుంటున్న భార్య
రానురాను రాజేష్ తో ఎక్కువ చనువు పెంచుకున్న రాజలక్ష్మి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజలక్ష్మి, రాజేష్ ఒకే చోట ఉద్యోగాలు చేస్తుండటంతో ఆ విషయం చాలాకాలం బయటపడలేదు. తరువాత ప్రియుడు రాజేష్ ను నేరుగా పల్లవరంలోని ఇంటికే పిలిపించుకుంటున్న రాజలక్ష్మి అతనితో ఎంజాయ్ చేసింది.

ఏమాత్రం పట్టించుకోని భార్య
కొన్ని నెలల క్రితం రాజలక్ష్మి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త పెరుమాల్ కు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని రాజలక్ష్మికి ఆమె భర్త పెరుమాల్ వార్నింగ్ ఇచ్చాడు. భర్త పెరుమాల్ వార్నింగ్ ఇచ్చినా అతని భార్య రాజలక్ష్మి ఏమాత్రం మాత్రం పట్టించుకోకుండా తన కంటే వయసులో చిన్నవాడైన రాజేష్ తో ఎంజాయ్ చేసింది.

బెడ్ రూమ్ లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంటే భర్త ఎంట్రీ
పనిమీద బయటకు వెళ్లిన పెరుమాల్ అనుకోకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి లోపల డోర్ లాక్ చేసి ఉండటంతో పెరుమాల్ తలుపుకొట్టారు. 20 నిమిషాల తరువాత రాజలక్ష్మి, ఆమె ప్రియుడు అర్దనగ్నంగా బట్టలు వేసుకుని ఇంటి డోర్ తలుపులు తీశారు. భార్య రాజలక్ష్మి, ఆమె ప్రియుడు రాజేష్ అర్దనగ్నంగా చూసిన పెరుమాల్ షాక్ అయ్యి ఆవేశంతో ఊగిపోయాడు.

భార్యను బెండ్ తీసిన భర్త
ఇంటి బయట ప్రియురాలు రాజలక్ష్మి భర్త పెరుమాల్ ను చూసిన ప్రియుడు రాజేష్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని పారిపోయాడు. భర్త పెరుమాల్ ను చూసి ప్రియుడు ఎస్కేప్ కావడంతో రాజలక్ష్మి మాత్రం ఆమె భర్తకు చిక్కిపోయింది. భార్య రాజలక్ష్మిని పట్టుకుని చితకబాదిన పెరుమాల్ ఎవరో ఒకరు చస్తేకాని ఈ సమస్యకు పరిష్కారం చిక్కదు అని ఆవేశంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

అక్రమ సంబంధం మ్యాటర్ లీక్ అయ్యిందని భార్య ఆత్మహత్య
తన అక్రమ సంబంధం గురించి అందరికీ తెలిసిపోయిందని అవమానంతో రాజలక్ష్మి ఇంట్లో ఎవరులేని సమయంలో నిప్పంటించుకుంది. తీవ్రగాయాలైన రాజలక్ష్మిని చెన్నైలోని కీల్పాక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 90 శాతం కాలిపోయిన రాజలక్ష్మి చికిత్స విఫలమై చనిపోయిందని పల్లవరం పోలీసులు చెప్పారు. ప్రియురాలు రాజలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ప్రియుడు ఎస్కేప్ అయ్యాడని పోలీసులు అంటున్నారు.