Illegal affair: బెడ్ రూమ్ లో భార్య, ప్రియుడు ఎంజాయ్, స్పాట్ లో యాసిడ్ పోసిన భర్త, ఫినిష్ !
చెన్నై/తుత్తుకూడి: భర్తతో కలిసి హ్యాపీగా సంసారం చేసుకుంటున్న భార్య ప్రియుడి వ్యామోహంలో పడిపోయింది. కూతురు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లి ఆమె భర్తతో చక్కగా కాపురం చేసుకుంటోంది. కూతురు తల్లి కూడా ఆమె భర్త బయటకు వెళ్లిన తరువాత ఇంటికి ప్రియుడిని పిలిపించుకుని అతనితో జల్సా చేస్తోంది. భార్యకు చెప్పిచెప్పి ఆమె భర్త విసుగు చెందాడు. నీ డైలాగులు నీవే, నా రొమాన్స్ నాదే అంటూ భార్య ఆమె భర్త మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. బెడ్ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడు రెడ్ హ్యాండెడ్ గా భర్తకు చిక్కిపోయారు. చాలా కాలం నుంచి ఇద్దరికి తగినబుద్ది చెప్పాలని వేచి చూస్తున్న భర్తకు ఇద్దరు బెడ్ రూమ్ లో అడ్డంగా చిక్కిపోయారు. యాసిడ్ బాటిల్ తీసుకున్న భర్త స్పాట్ లో అతని భార్య, ఆమె ప్రియుడి మీద విసిరేశాడు. అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ, ఆమె ప్రియుడి శరీరాలు కాలిపోవడమే కాకుండా ఇద్దరి కళ్లు పూర్తిగా పోవడం కలకలం రేపింది.

ఆంటీ ఫ్యామిలీది హ్యాపీలైఫ్
తమిళనాడులోని తుత్తుకూడిలోని అశోక్ నగర్ లో రవి (50), మాలా (49) దంపతులు నివాసం ఉంటున్నారు. రవి,మాలా దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సిప్ కాట్ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా సొంతంగా స్కూటర్ గ్యారేజ్ పెట్టుకున్న రవి బైక్ లు రిపేర్లు చేస్తూ డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు.

ఫ్యామిలీ ఫ్రెండ్ ఎంట్రీ
రవి, మాలా దంపతుల ఇద్దరు కుమారులు కాలేజ్ లో చదువుతున్నారు. రవి, మాలా కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. రవికి సెల్వసాయి అనే ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు. స్నేహితుడు రవి ఇంటికి సెల్వా వెళ్లి వస్తున్నాడు. కొడుకులు కాలేజ్ కు వెళ్లడం, కూతురికి పెళ్లి జరిగిపోయి అత్తారింటిలో ఉండటం, భర్త రవి ఉదయం నుంచి రాత్రి వరకు స్కూటర్ గ్యారేజ్ లో ఉండటంతో మాలా మాత్రమే ఇంట్లో ఉంటోంది.

భార్యకు ఇల్లే రసిక సామ్రాజ్యం
ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మాలా ఆంటీని ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ సెల్వా వలలో వేసుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు మాలా ఇంటికి వెలుతున్న సెల్వా ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అడిగే దిక్కు కరువైనారని ఆంటీ మాలా కూడా ప్రియుడు సెల్వాతో కలిసి ఇంటినే రసిక సామ్రాజ్యం చేసుకుంది.

కూతురు అక్కడ కాపురం చేస్తుంటే తల్లి ఇక్కడ ?
తన భార్య మాలా తన ఇంటికి వస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ సెల్వతో చనువుగా ఉంటోందని ఆమె భర్త రవికి తెలిసిపోయింది. మా ఇంటికి రావద్దని రవి అతని ఇంటికి వెలుతున్న సెల్వాకు చెప్పాడు. కూతురికి పెళ్లి అయిపోయి ఆమె భర్తతో కాపురం చేస్తుంటే ఈ వయసులో నువ్వు ఇక్కడ ప్రియుడితో కాపురం చేస్తున్నావా ? అంటూ భర్త రవి ఆమె భార్య మాలాను పట్టుకుని చితకబాదేశాడు.

నా ఇష్టం..... నా కోసం వస్తున్నాడు, నీకెందుకు ?
భర్త రవి వార్నింగ్ ఇచ్చినా అతని భార్య మాలా బుద్దిమాత్రం మారలేదు. నా ఇష్టం, సెల్వా నాకోసం వస్తున్నాడు, మాట్లాడి పంపిస్తున్నాను, నువ్వు ఎంతచెప్పినా నేను మాత్రం సెల్వాతో మాట్లాడకుండా ఉండనని తేల్చి చెప్పింది. భర్త మాలా తీరుమారకపోవడంతో చాలా కాలం నుంచి రవి ఆమెతో గొడవపడుతూనే ఉన్నాడు. బీపీ లేచిపోయి చాన్స్ చిక్కినప్పుడు మాత్రం భర్త రవి అతని భార్య మాలాను పట్టుకుని చితకబాదేస్తున్నాడు.

బెడ్ రూమ్ లో భర్తకు డెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య
రాత్రి భర్త రవి ఆలస్యంగా ఇంటికి వస్తానని అతని భార్య మాలాకు ఫోన్ చేసి చెప్పాడు. భర్త త్వరగా ఇంటికి రాడని రాత్రి మాలా ఆమె ప్రియుడు సెల్వాను పిలిపించుకుని ఇంట్లోని బెడ్ రూమ్ లో దుకాణం పెట్టింది. భార్య మాలా ఆమె ప్రియుడు సెల్వాతో మంచి మూడ్ లో ఉంది. పని త్వరగా ముగిసిపోవడంతో రవి అనుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. బెడ్ రూమ్ లో ప్రియుడు సెల్వాతో కలిసి భార్య మాలా రెడ్ హ్యాండెడ్ గా ఆమె భర్త రవికి చిక్కిపోయింది.

స్పాట్ లో ఇద్దరికీ యాసిడ్ పోసేసిన భర్త
భార్య మాలా, ఆమె ప్రియుడు సెల్వా అలా కంటికి కనపడటంతో రవి రగిలిపోయాడు. తన భార్య మాలాకు బుద్దిచెప్పాలని చాలా కాలం నుంచి వేచిచూస్తున్న రవి వెంటనే ఆలస్యం చెయ్యకుండా వాహనాల బ్యాటరీలకు ఉపయోగించే యాసిడ్ బాటిల్ తీసుకుని స్పాట్ లో భార్య మాలా, ఆమె ప్రియుడు సెల్వా మీద పోసేశాడు.

జీవితంలో ఇక చూడలేరు
యాసిడ్ పడటంతో మంటలు తట్టుకోలేక మాలా, ఆమె ప్రియుడు సెల్వా ఆర్తనాదాలు చేశారు. యాసిడ్ దాడి చేసిన తరువాత రవి అక్కడి నుంచి పరారైనారు. చుట్టుపక్కల వాళ్లు మాలా, ఆమె ప్రియుడు సెల్వాను ఆసుపత్రికి తరలించారు. ఎక్కువ మోతాదులో యాసిడ్ పడటంతో మాలా, ఆమె ప్రియుడు సెల్వాకు కళ్లు పూర్తిగా పోయాయని, ఇద్దరి శరీరాల మీద తీవ్రగాయాలైనాయని వైద్యులు అన్నారు.

పని పూర్తి అయిపోందని మాయం అయిన భర్త
యాసిడ్ దాడి చేసే సమయంలో కొంచెం యాసిడ్ రవి మీద పడి అతనికి గాయాలైనాయి. అయితే భార్య మాలా, ఆమె ప్రియుడు సెల్వా మీద యాసిడ్ దాడి చేసిన రవి మాత్రం ఇంత వరకు చిక్కలేదని, అతని కోసం గాలిస్తున్నామని తుత్తుకూడి పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం కారణంగా మాలా, ఆమె ప్రియుడు సెల్వా కంటిచూపు కోల్పోవడం కలకలం రేపింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications