• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఆంటీ టీచర్, బెడ్ రూమ్ లో రొమాన్స్ పాఠాలు, తట్టుకోలేని భర్త ఎడిటింగ్ చేశాడు!

|

చెన్నై/ పుదుచ్చేరి: దంపతులు ఇద్దరూ స్కూల్ టీచర్లు. ఉదయం నిద్రలేచి ఎవరిపాటికి వాళ్లు ఉద్యోగాలకు వెళ్లిపోతారు. సాయంత్రం ఇంటికి వస్తున్న స్కూల్ టీచర్లు మూడు సంవత్సరాల క్రితం వరకు సంతోషంగానే గడిపారు. అయితే తరువాత కామరాజ్ రూపంలో ఓవ్యక్తి వీరి సంసారంలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్కూల్ టీచర్ అయిన ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్న అతను ఏకంగా ఆమె ఇంటిలోనే మకాం వేశాడు. బెడ్ రూమ్ లో ప్రపంచాన్ని మరిచిపోయి సర్గంలో తేలిపోతున్న భార్యను, ఆమె ప్రియుడు కంటపడటంతో ఆ ధరిద్రాన్ని చూసిన భర్త సహించకలేకపోయాడు. అంతే కత్తి తీసుకుని భార్యను బెడ్ రూమ్ లోనే చంపేసిన భర్త ఆమె జీవితానికి ఎడిటింగ్ చేసి ధైర్యంగా పోలీస్ స్టేషన్ చేరుకుని జరిగిన విషయం మొత్తం వివరించాడు.

Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!Illegal affair: మరిది మసాజ్, వదిన వన్స్ మోర్, ఏక్ మార్ తీన్ తుకుడా, అడ్డంగా లేపేసిన అన్న!

స్కూల్ టీచర్లు....హ్యాపీలైప్

స్కూల్ టీచర్లు....హ్యాపీలైప్

కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలోని వేల్ రామ్ పేటలో విజయన్ (55), శాంతి (48) దంపతులు నివాసం ఉంటున్నారు. విజయన్, శాంతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విజయన్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో శాంతి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. విజయన్, శాంతి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి మొదట చాలా సంతోషంగా కాలం గడిపారు.

ఇంటి ఇంటి సమీపంలో కామరాజ్

ఇంటి ఇంటి సమీపంలో కామరాజ్


విజయన్, శాంతి నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో కామరాజ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఆంటీ శాంతితో కామరాజ్ కు పరిచయం అయ్యింది. శాంతి స్కూల్ కు వెలుతున్న సమయంలో, స్కూల్ నుంచి మళ్లీ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను కామరాజ్ పలకరించేవాడు. ఇలా కామరాజ్, టీచర్ శాంతి రానురాను చాలా దగ్గర అయ్యారు.

భర్త స్కూల్ కు, పిల్లలు కాలేజ్ కు, ఇక జల్సా

భర్త స్కూల్ కు, పిల్లలు కాలేజ్ కు, ఇక జల్సా

మూడు సంవత్సరాల నుంచి శాంతి, కామరాజ్ వ్యవహారం ముదిరిపోయింది. అసలే ప్రైవేట్ స్కూల్ కావడంతో మద్యాహ్నం మూడు గంటలకు శాంతి ఇంటికి వెళ్లిపోయేది. భర్త విజయన్ స్కూల్ కు వెళ్లడం, కుమార్తె, కుమారుడు కాలేజ్ కు వెళ్లడంతో కామరాజ్ ఆంటీ శాంతి ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో శాంతి, కామరాజ్ ఆడిందే ఆటపాడిందే పాటగా తయారైయ్యింది.

శాంతి దెబ్బకు ఫ్యామిలీలో ‘అశాంతి’

శాంతి దెబ్బకు ఫ్యామిలీలో ‘అశాంతి’

స్కూల్ టీచర్ శాంతి, కామరాజ్ వ్యవహారం వారు నివాసం ఉంటున్న చుట్టుపక్కల వాళ్లకు తెలిసిపోయింది. నీ భార్య శాంతి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నదని, ఇలాంటి పని చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్నదని, నీ భార్య శాంతిని నువ్వు కొంచెం కంట్రోల్ లో పెట్టుకో అంటూ చుట్టుపక్కలవాళ్లు ఆమె భర్త విజయన్ కు చెప్పారు. కొన్ని నెలల క్రితం విజయన్ ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్య శాంతికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

నీ బంగారం జాగ్రత్త

నీ బంగారం జాగ్రత్త


నీకారణంగా వీధిలో తల ఎత్తుకోలేకపోతున్ననానని, పిల్లలు చెడిపోతారని, నీ కారణంగా ఇంట్లో గొడవలు మొదలైనాయని, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నీకు తగినబుద్ది చెబుతానని భర్త విజయన్ భార్య శాంతిని హెచ్చరించాడు. ఇదే సమయంలో భార్య శాంతి ప్రియుడు కామరాజ్ కు భర్త విజయన్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో నీ ఇంట్లోని బంగారం (భార్య శాంతి) జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు ఏందిరా నాకు బుద్దిమాటలు చెబుతావు అంటూ కామరాజ్ ఎదురుతిరిగాడు.

బెడ్ రూమ్ లో ప్రపంచాన్ని మరిచిపోయారు

బెడ్ రూమ్ లో ప్రపంచాన్ని మరిచిపోయారు


స్కూల్ కు వెళ్లిన విజయన్ మద్యాహ్నం ఒక్కసారిగా ఇంటికి బయలుదేరాడు. ఉదయం స్కూల్ కు వెళ్లిన భర్త విజయన్ సాయంత్రం ఇంటికి వస్తాడని, కుమార్తె, కుమారుడు కూడా లేడని శాంతి ఆమె ప్రియుడు కామరాజ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. అంతే బెడ్ రూమ్ లో నగ్నంగా తయారైన శాంతి, కామరాజ్ ప్రపంచాన్ని మరిచిపోయి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఒక్కసారిగా ఇంటికి వెళ్లిన విజయన్ భార్య శాంతి, ఆమె ప్రియుడు కామరాజ్ ను చూడరాని చోట అలా చూడటంతో సహనం కోల్పోయాడు.

  North Korea ను తాకిన Coronavirus.. Lockdown ప్రకటించిన Kim || Onendia Telugu
  నీకు బతికే అర్హత లేదు..... చచ్చిపో !

  నీకు బతికే అర్హత లేదు..... చచ్చిపో !

  ఇంటి లోపల గడియ పెట్టిన విజయన్ భార్య శాంతి తప్పించుకోకుండా చూశాడు. అదే సమయంలో వంట గదిలోని కత్తి తీసుకున్న విజయన్ బెడ్ రూమ్ లో నగ్నంగా ప్రియుడితో కలిసి ఉన్న శాంతిపై కత్తితో పదేపదే పొవడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న కామరాజ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. భార్య శాంతిని దారుణంగా హత్య చేసిన విజయన్ కత్తి తీసుకుని నేరుగా ముదలియార్ పేట పోలీస్ స్టేషన్ చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. తన భార్య శాంతి కారణంగా మా పరువు మొత్తం పోయిందని, అందుకే ఆమెను చంపేశానని స్కూల్ టీచర్ విజయన్ నేరం అంగీకరించాడని ముదలియార్ పేట పోలీసులు తెలిపారు.

  English summary
  Illegal relationship: School teacher stabs wife to death in Puducherry near Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X