Khiladi lady: సెంట్రల్ జైల్లో డ్రామాలు, ఆసుపత్రిలో లిక్కర్ క్వీన్ గ్రేట్ ఎస్కేప్, పోలీసు బందోబస్తు ఉన్నా!
చెన్నై/తిరువారూర్: ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్టు వెయ్యాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగానే జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఓ కిలాడీ లేడి విదేశీ మద్యం, అక్రమ మద్యం విక్రయిస్తున్నది. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా కిలాడీ లేడి చాకచక్యంగా తప్పించుకుంటున్నది. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లేడీని అరెస్టు చెయ్యడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు.
అయితే కిలాడీ లేడీ మాత్రం ఆమె అనుచరులు, రాజకీయంగా అండగా ఉన్న కొందరు పెద్దల సహకారంతో తప్పించుంటున్నది. ఇటీవల మాయలేడీని పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపించారు. జైల్లో కొన్ని రోజులు కాలం గడిపిన కిలాడీ లేడీ తనకు కడుపు నొప్పి ఎక్కువగా ఉందని చెప్పింది. జైలు శాఖ అధికారులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కిలాడీ లేడీకి లేడీ పోలీసులు బందోబస్తు ఉన్నారు. పోలీసులు కపలా ఉన్నా సరే కిలాడీ లేడీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. విచారణ ఎదుర్కొంటు సెంట్రల్ జైలుకు వెళ్లిన మహిళా ఖైదీ తప్పించుకోవడంతో పోలీసులు హడలిపోయారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు
తమిళనాడులో అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్టు వెయ్యాలని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగానే జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

లిక్కర్ క్వీన్
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో కస్తూరి అలియాస్ లిక్కర్ కస్తూరి అక్క జోరుగా విదేశీ మద్యం, నాటుసారాతో పాటు అక్రమంగా అనేక బ్రాండ్ల మద్యం విక్రయిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కస్తూరి విదేశీ మద్యంతో పాటు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు సంపాధిస్తోందని పోలీసులు అంటున్నారు.

తప్పించుకుంటున్న కిలాడీ లేడీ
కిలాడీ లేడి కస్తూరి జోరుగా విదేశీ మద్యం, అక్రమ మద్యం విక్రయిస్తున్నది. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా కస్తూరి చాకచక్యంగా తప్పించుకుంటున్నది. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కస్తూరిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే కిలాడీ లేడీ కస్తూరి మాత్రం ఆమె అనుచరులు, రాజకీయంగా అండగా ఉన్న కొందరు పెద్దల సహకారంతో ఇంతకాల తప్పించుంటున్నది.

సెంట్రల్ జైల్లో కస్తూరి డ్రామాలు
20 రోజుల క్రితం మాయలేడీ కస్తూరిని పోలీసులు విదేశీ మద్యం విక్రయిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా తిరువారూరు జిల్లాలోని పూంతోట్టం లో అరెస్టు చేసి తిరువారూతరు మహిళా సెంట్రల్ జైలుకు పంపించారు. మహిళా జైల్లో కొన్ని రోజులు కాలం గడిపిన కిలాడీ లేడీ కస్తూరి తనకు కడుపు నొప్పి ఎక్కువగా ఉందని డ్రామాలు ఆడింది.

ఆసుపత్రిలో గ్రేట్ ఎస్కేప్
జైలు శాఖ అధికారులు కస్తూరిని తిరువారూరు జిల్లా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కిలాడీ లేడీ కస్తూరికి ఇద్దరు లేడీ పోలీసులు బందోబస్తు ఉన్నారు. మహిళా పోలీసులు కపలా ఉన్నా సరే కిలాడీ లేడీ కస్తూరి తిరువారూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోవడం కలకలం రేపింది.
విచారణ ఎదుర్కొంటు సెంట్రల్ జైలుకు వెళ్లిన మహిళా ఖైదీ కస్తూరి తప్పించుకోవడంతో పోలీసులు హడలిపోయారు. కస్తూరిని పట్టుకోవడానికి పోలీసులు ఐదు టీమ్ లు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications