చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: ఆరు మంది భర్తలు, 7 పెళ్లికి రెఢీ,పెళ్లికొడుకు తాళి కట్టేటైమ్ లో ఆరో భర్త ఎంట్రీ,కన్నింగ్ స్కెచ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/నమ్మక్కల్: ఓ యువతి, యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లిళ్ల బ్రోకర్ వీరి పెళ్లి సెట్ చేశారు. పెళ్లికూతురు అక్క,బావ మాత్రమే పెళ్లికి హాజరైనారు. పెళ్లి కొడుకు తరపున చాలా మంది పెళ్లికి హాజరైనారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు పెళ్లి కొడుకు పెళ్లి జరిపించిన బ్రోకర్ కు రూ.1.50 లక్షలు కమీషన్ ఇచ్చాడు.

పెళ్లి జరిగిన మూడురోజులకే పెళ్లి కూతురు మాయం అయ్యింది. పెళ్లికూతురు, పెళ్లి చేసిన బ్రోకర్, పెళ్లి కూతురు అక్కాబావా మొబైల్ ఫోన్లు నాలుగు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. పెళ్లి కూతురి కోసం పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు అనే ప్రాంతాల్లో గాలించారు. అయితే ఓ మరుపురాని సన్నివేశంలో పెళ్లికూతురు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులకు కనపడటంతో అందరూ హడలిపోయారు.

Techie: ప్రియురాలి కోసం కిల్లర్స్ తో భార్యను హత్య చేయించిన టెక్కీ, టీచర్ కోసం, పార్ట్ 2!Techie: ప్రియురాలి కోసం కిల్లర్స్ తో భార్యను హత్య చేయించిన టెక్కీ, టీచర్ కోసం, పార్ట్ 2!

పెళ్లి చేస్తానని బ్రోకర్ హామీ

పెళ్లి చేస్తానని బ్రోకర్ హామీ

తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలోని కల్లిపాళయంలో ధనపాల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ధనపాల్ పెళ్లి చేసుకోవాలని చాలాకాలం నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నా ఎక్కడా పెళ్లి మాత్రం సెట్ కాలేదు. ఇదే సందర్బంలో పెళ్లిళ్ల బ్రోకర్ బాలమురుగన్ అనే వ్యక్తి ధనపాల్ ను కలిసి పెళ్లి చేస్తానని అతనికి హామీ ఇచ్చాడు.

సింపుల్ గా పెళ్లి

సింపుల్ గా పెళ్లి

మదురైకి చెందిన సంధ్యా అనే యువతిని ధనపాల్ కు చూపించిన బ్రోకర్ బాలమురుగన్ పెళ్లి సెట్ చేశాడు. ఇదే నెల 7వ తేదీన ఓ గుడిలో సంధ్యా, ధనపాల్ ల వివాహం చాలా సింపుల్ గా జరిగింది. పెళ్లికి సంధ్య అక్కా, బావ అని చెప్పిన ఇద్దరు వ్యక్తులు, బ్రోకర్ బాలమురుగన్ మాత్రమే హాజరైనారు.

మూడు రోజులకే పెళ్లికూతురు ఎస్కేప్

మూడు రోజులకే పెళ్లికూతురు ఎస్కేప్

పెళ్లికొడుకు ధనపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు చాలా మంది పెళ్లికి హాజరైనారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు పెళ్లి కొడుకు ధనపాల్ పెళ్లి జరిపించిన బ్రోకర్ బాలమురుగన్ కు రూ.1.50 లక్షలు కమీషన్ ఇచ్చాడు. పెళ్లి జరిగిన మూడురోజులు భర్త ధనపాల్ తో కాపురం చేసిన పెళ్లి కూతురు సంధ్యా ఒక్కసారిగా మాయం అయ్యింది.

అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్

అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్

భార్య సంధ్యా మాయం కావడంతో హడలిపోయిన ధనపాల్ ఆమె కోసం చాలా ప్రాంతాల్లో గాలించాడు. పెళ్లికూతురు సంధ్యా, పెళ్లి చేసిన బ్రోకర్ బాలమురుగన్, పెళ్లి కూతురు అక్కాబావా మొబైల్ ఫోన్లు నాలుగు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. పెళ్లి కూతురు సంధ్యా కోసం పెళ్లి కొడుకు ధనపాల్ కుటుంబ సభ్యులు అనే ప్రాంతాల్లో గాలించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని?

వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవాలని?

తనను పెళ్లి చేసుకుని మూడురోజులకే మోసం చేసిన సంధ్యాను పట్టుకోవాలని ధనపాల్ అనేక ప్రాంతాల్లో ఆమె కోసం గాలించాడు. ఇదే సందర్బంలో సంధ్యా ఫోటో ధనపాల్ బంధువుకు చూపించిన బాలమురుగన్ అతనితో పెళ్లి జరిపించడానికి మాట్లాడేశాడు. సంధ్యాకు మరో వ్యక్తితో పెళ్లిడేట్ కూడా ఫిక్స్ అయ్యింది. సంధ్యా మరో పెళ్లి చేసుకుంటున్నదని ధనపాల్ కు తెలిసిపోయింది.

నిత్యపెళ్లికూతురు

నిత్యపెళ్లికూతురు

మరో యువకుడిని పెళ్లిచేసుకోవడానికి సిద్దం అయిన సంధ్యా, ఆమె అక్కాబావ కారులో పెళ్లికొడుకు ఊరు సమీపంలోని గుడి దగ్గరకు వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ధనపాల్, అతని కుటుంబ సభ్యులు సంధ్యా, బ్రోకర్ బాలమురుగన్, సంధ్యా అక్కాబావను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఇప్పటికే మేడమ్ 6 మందికి భార్య

ఇప్పటికే మేడమ్ 6 మందికి భార్య

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలో వెలుగులోకి వచ్చాయి, సంధ్యా ఇప్పటికే ఆరు మందిని పెళ్లి చేసుకుందని, ఏడో పెళ్లి చేసుకుంటున్నసమయంలో చిక్కిపోయిందని నమ్మక్కల్ జిల్లా పోలీసులు చెప్పారు. తన బిడ్డను కిడ్నాప్ చేస్తామని బెదిరించి తనతో ఇన్ని పెళ్లిళ్లు జరిపించారు. సంధ్యా ఇప్పటికే పెళ్లి కొడుకుల దగ్గర రూ. లక్షల రూపాయలు వసూలు చేసిందని బాలమురుగన్ చెప్పాడని పోలీసులు అన్నారు. మొత్తం మీద నిత్య పెళ్లికూతురు సంధ్య అరెస్టు కావడం తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Khiladi lady: Young woman arrested for cheating six people by marrying them near Namakkal in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X