kidnap: మైనర్ తో లవ్, పెళ్లి చేసుకున్న పాపానికి కిడ్నాప్, రేప్ కేసు, విందు భోజనం కాదు చిప్పకూడు !

చెన్నై/ క్రిష్ణగిరి/ హోసూర్: అందమైప 17 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాని అజిత్ కుమార్ అనే యువకుడు వెంటతిరిగాడు. అయితే తల్లిదండ్రులకు బయపడిన అమ్మాయి చాలా కాలం మౌనంగా ఉండిపోయింది. లాక్ డౌన్ దెబ్బతో ఇంటికే పరిమితం అయిన అమ్మాయి ఎప్పుడు బయటకు వస్తుందా ? అంటూ అజిత్ ఎదురు చూశాడు. అంతే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమార్తె కనపడటం లేదని ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు. మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని పోలీసులు కేసు నమోదు చేసి అజిత్ ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి విందు భోజనంకు బదులుగా ఆ యువకుడిని జైలుకు పంపించి చిప్పకూడు తినిపిస్తున్నారు. అయితే అమ్మాయి, అజిత్ పెళ్లి చేసుకున్నారని, ఆమె మైనర్ కావడం వలనే కేసు నమోదైయ్యిందని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

17 ఏళ్ల అమ్మాయిపై కన్ను

17 ఏళ్ల అమ్మాయిపై కన్ను

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా బర్గూరు (ఆంధ్రప్రదేశ్-కర్ణాటక-తమిళనాడు సరిహద్దు) సమీపంలోని బ్యాలెట్ స్కూల్ గ్రామంలో రామక్రిష్ణన్, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. రామక్రిష్ణన్, లక్ష్మి దంపతులకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ అమ్మాయిపై కొందరు యువకుల కళ్లుపడింది. అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో ఆమెను కొందరు ఆటపట్టించేవాళ్లని తెలిసింది.

అజిత్ కుమార్ ఎంట్రీ

అజిత్ కుమార్ ఎంట్రీ

క్రిష్ణగిరి జిల్లాలోని కండికుప్పంలోని సెంగోడి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అభిమన్యన్ అనే వ్యక్తి కుమారుడు అజిత్ కుమార్ (23) సైతం అమ్మాయిపై కన్ను వేశాడు. కండికుప్పం ప్రాంతం, యువతి నివాసం ఉంటున్న బ్యాలెట్ స్కూల్ ప్రాంతాలు పక్కపక్కనే ఉండటంతో అజిత్ కుమార్ ప్రతిరోజు వెళ్లి ఆమె ముందు ప్రజెంట్ వేసుకుంటున్నాడు. అజిత్ కుమార్, ఆ అమ్మాయి ప్రేమించుకున్నారని కొందరు అంటున్నారు.

ఇంటి నుంచి వెళ్లిన యువతి మాయం

ఇంటి నుంచి వెళ్లిన యువతి మాయం

వారం రోజుల క్రితం యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత రాత్రి అయినా ఆమె ఇంటికి వెళ్లలేదు. బంధువులు, యువతి స్నేహితుల ఇళ్లలో గాలించిన రామక్రిష్ణన్, లక్ష్మి దంపతులు కుమార్తె ఆచూకిలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో అజిత్ కుమార్ తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని రామక్రిష్ణన్, లక్ష్మి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి కిడ్నాప్, అత్యాచారం ?

యువతి కిడ్నాప్, అత్యాచారం ?

పోలీసులు కేసు నమోదు చేసి యువతి కోసం, అజిత్ కుమార్ కోసం గాలించారు. ఓ ప్రాంతంలోని ఇంటిలో అజిత్ కుమార్ యువతితో కలిసి ఉంటున్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తననను కిడ్నాప్ చేసి తన మీద అత్యాచారం చేశాడని యువతి చెప్పిందని క్రిష్ణగిరి పోలీసులు అన్నారు.

 పెళ్లి చేసుకున్నారు... కాని ?

పెళ్లి చేసుకున్నారు... కాని ?


యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ అజిత్ కుమార్ అను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు తెలిపారు. అయితే యువతి, అజిత్ కుమార్ ప్రేమించుకున్నారని, ఇద్దరు పెళ్లి చేసుకున్నారని తెలిసింది. యువతి మైనర్ కావడం వలనే అతన్ని అరెస్టు చేశారని, ఇద్దరు ఇష్టపడి ఇంటి నుంచి వెళ్లిపోయారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే కేసు నమోదైయ్యిందని అజిత్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+