Madam: కొంప ముంచిన కంపెనీ మొబైల్ ఫోన్, లేడీ పర్సనల్ ఫోటోలతో అరవిందస్వామి ఏం చేశాడంటే ?
మహిళ మొబైల్ ఫోన్ కు ఆమె పర్సనల్ ఫోటోలు కొన్ని షేర్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన వివాహిత మహిళ హడలిపోయింది. మర్యాదగా నాకు కొన్ని లక్షల డబ్బులు ఇవ్వపోతే నీ పర్సనల్ ఫోటోలు మొత్తం షేక్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు.
చెన్నై/సేలం: పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వివాహిత మహిళ ఓ యువకుడితో చనువుగా ఉంది. ఆమె కంటే వయసులో ఆ యువకుడు చాలా చిన్నవాడు. చాలాకాలం పాటు ఇద్దరూ అదే కంపెనీలో ఉద్యోగం చేశారు. కంపెనీలోని ఫైల్స్, ఆఫీసుకు సంబంధించిన పత్రాలను యువకుడికి అప్పగించిన మహిళ వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరింది. మహిళ మొబైల్ ఫోన్ కు ఆమె పర్సనల్ ఫోటోలు షేర్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన మహిళ హడలిపోయింది. మర్యాదగా నాకు కొన్ని లక్షల డబ్బులు ఇవ్వపోతే నీ పర్సనల్ ఫోటోలు మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆమె గతంలో పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు వివాహిత మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు.

ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచింది
మహిళలు పని చేస్తున్న కంపెనీల్లో సాటి ఉద్యోగులతో, ముఖ్యంగా యువకులతో జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని సమస్యలు వస్తాయని మరోసారి వెలుగు చూసింది. కంపెనీలో ఎంత వరకు పని ఉందో అంత వరకు చూసుకుని వెళ్లిపోతే ఏ సమస్య ఉండదు. టీలు, టిఫిన్లు, హోటల్స్, పబ్ లు, పార్టీలు, పార్క్ లు అంటే ఇలాగే ఉంటుంది. మంచిగా ఉంటూ కొంత మంది కోంపలు ముంచే పనులు చేస్తున్నారు.

ఒకే కంపెనీలో ఉద్యోగం
చెన్నైలో నివాసం ఉంటున్న 33 ఏళ్ల మీనా (పేరు మార్చడం జరిగింది) అనే వివాహిత మహిళ అదే సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో చాలా సంవత్సరాలు ఉద్యోగం చేసింది. కంపెనీలో పనిచేస్తున్న సమయంలో చెన్నైలోని పుదుప్‌పేటకు చెందిన అరవిందస్వామి (27) అనే యువకుడు మీనాకు పరిచయం అయ్యాడు, వివాహిత మహిళ మీనా, అరవిందస్వామితో కొన్ని సంవత్సరాలు పని చేసింది. వీళ్లు పని చేసే ప్రైవేట్ కంపెనీ టీనగర్ లో ఉంది. ఆ సమయంలో అరవిందస్వామి, మీనా కొంచెం క్లోజ్ గా ఉన్నారని తెలిసింది. ఇద్దరి మధ్య వయసులో ఆరు సంవత్సరాల తేడా ఉంది.

కొంప ముంచిన కంపెనీ ఫోన్
ఆఫీసులో పని చేస్తున్న అరవిందస్వామి, మీనా అప్పుడప్పుడు టీలు, టిఫిన్లు, భోజనాలు అంటూ బయటకు వెళ్లారు. పని చేస్తున్న చోటే వివాహిత మహిళ మీనాతో అరవిందస్వామి కొంచెం క్లోజ్ గా ఉన్నాడని తెలిసింది. తరువాత మీనాకు వేరే కంపెనీనలో ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంలో ఆఫీస్ కు సంబంధించిన అన్ని ఫైల్స్, పత్రాలను 2020లో స్నేహితుడు అరవిందసామికి మీనా అప్పగించింది. అదే సమయంలో కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్ కూడా మీనా ఆమె ఫ్రెండ్ అరవిందస్వామి చేతిలో పెట్టి ఆ కంపెనీలో ఉద్యోగం మానేసి వెళ్లిపోయింది. గత ఏడాది అరవిందస్వామి కూడా ఆ కంపెనీలో ఉద్యోగం మానేసి పోలీస్ స్టేషన్ లో సీసీటీవీల ఆపరేటర్ గా ఉద్యోగంలో చేరాడు.

కంపెనీ మొబైల్ ఫోన్ లో మేడమ్ పర్సనల్ ఫోటోలు
మీనా మేడమ్ కొన్ని సంవత్సరాలు ఉపయోగించిన కంపెనీ ఫోన్ లో ఆమె పర్సనల్ ఫోటోలు ఉన్నాయి. అరవిందస్వామికి ఫోన్ అప్పగించక ముందు ఆ మొబైల్ లోని ఫోటోలను మీనా డిలీట్ చెయ్యకుండా మరిచిపోయి అతనికి ఇచ్చేసింది. కొంతకాలం తరువాత కన్నింగ్ అరవిందస్వామి మీనా మేడమ్ పర్సనల్ ఫోటోలు చూసి జోల్లు కార్చుకున్నాడు. మీనా మేడమ్ గ్లామర్ ఫోటోలు చూసి తట్టుకోలేకపోయాడు. ఇంతకాలం మీనా మేడమ్ ఫోటోలు చూసుకుంటూ కాలం గడిపేసిన అరవింద్ స్వామి ఇటీవల కన్నింగ్ స్కెచ్ వేశాడు.

ఎన్ని రూ. లక్షలు డిమాండ్ చేశాడంటే ?
మీనా ఉపయోగించిన సెల్‌ఫోన్‌లో ఉన్న ఆమె ప్రైవేట్ ఫోటోలను అరవిందస్వామి అతనని మొబైల్ ఫోన్ కు షేర్ చేసుకున్నాడు. మీనాను సెల్‌ఫోన్‌లో సంప్రదించిన అరవిందస్వామి ఆమె పర్సనల్ ఫోటోలను ఆమెకే షేర్ చేశాడు. మీనా ఆమె పర్సనల్ ఫోటోలె చూసి షాక్ అయ్యింది, నాకు రూ. 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే నీ పర్సనల్ ఫోటోలు అన్నీ సోసల్ మీడియాలో షేర్ చేస్తానని మీనా మేడమ్ ను అరవిందస్వామి డిమాండ్ చేశాడు.

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది
రూ. 2 లక్షలు డబ్బులు ఇవ్వడానికి మీనా నిరాకరించింది. మీనా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో రెచ్చిపోయిన అరవిందస్వామి నీ ప్రైవేట్ ఫోటోను సోషల్ మీడియాలో పెడతానని పదేపదే ఆమెను బెదిరించాడు. ఈ ఘటనపై తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్‌లో మీనా ఫిర్యాదు చేసింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరవిందస్వామిని విచారించారు.

వీడికి పోలీస్ స్టేషన్ లోనే ఉద్యోగం వచ్చింది
పోలీసుల విచారణలో అరవిందసామి కరూర్ నగర పోలీస్‌స్టేషన్‌లో సీసీటీవీఎన్‌ఎస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని తేలింది. అరవిందస్వామి నేరం ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని మొబైల్ ఫోన్ సీజ్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచామని పోలీసులు అన్నారు. కోర్టు ఆదేశాలతో కన్నింగ్ అరవిందసామిని చెన్నై సమీపంలోని పుఝల్ సెంట్రల్ జైలుకు తరలించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications