Lady Doctor: కోర్టులో లేడీ డాక్టర్ విడాకుల కేసు, పాప శుభకార్యం రోజే ఆత్మహత్య, బంధులు చేసిన!
చెన్నై/ తిరుచ్చి: ఇష్టపడి పెళ్లి చేసుకున్న డాక్టర్ దంపతులు ఒక పాప పుట్టింది. పాపపుట్టిన తరువాత దంపతల మద్య విభేదాలు రావడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. కూతురితో కలిసి నివాసం ఉంటున్న లేడీ డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూనే సొంతంగా ఓ క్లినిక్ నిర్వహిస్తున్నది. భర్తతో విడిపోవాలని డిసైడ్ అయిన లేడీ డాక్టర్ విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విడాకుల కేసు విచారణలో ఉంది. పాపకు తలవెంట్రుకలు తీసి చెవులు కుట్టే శుభకార్యాన్ని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన లేడీ డాక్టర్ బంధువులు అందరిని ఆహ్వానించింది.
అయితే ఈ శుభకార్యానికి భర్తకు ఆహ్వానించలేదు. శుభకార్యానికి హాజరైన బంధువులు అందరూ నీ భర్త ఎక్కడ ?, ఎందుకు రాలేదు, తండ్రి లేకుండా సొంత కూతురికి చెవులు కుట్టే శుభకార్యం ఎందుకు పెట్టావు అని ప్రశ్నించారు. కూతురి శుభకార్యానికి పిలిచి భోజనం పెట్టాలని గ్రాండ్ గా వేడుక నిర్వహించిన లేడీ డాక్టర్ అదే రోజు రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ప్రభుత్వ ఆసుపత్రి లేడీ డాక్టర్
తమిళనాడులోని తిరుచ్చిలోని సుబ్రమణ్యపురం లేక్ రోడ్డులో సంజని అలియాస్ సంజు (30) అనే యువతి నివాసం ఉంటున్నది. సంజని తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సంజినికి డాక్టర్ తో పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆలోచించారు.

డాక్టర్ భర్త
తమిళనాడులోని తుయ్యూరుకు చెందిన డాక్టర్ గోపాల్ తో సంజని వివాహం చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. సంజని, గోపాల్ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2018 జూన్ 4వ తేదీన గ్రాండ్ గా పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న తరువాత లేడీ డాక్టర్ సంజని ఆమె భర్త గోపాల్ తో చాలా సంతోషంగా గడిపిందని సమాచారం.

పాప పుట్టిన తరువాత భర్తతో విభేదాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సంజని భర్త గోపాల్ తో కలిసి సుబ్రమణ్యపురలో సొంతంగా క్లినిక్ పెట్టింది. గైనకాలజిస్టు అయిన సంజని ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకుని రోగులకు చికిత్స చేస్తోంది. ఒకటిన్నర సంవత్సరాల క్రితం లేడీ డాక్టర్ ఓపాపకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తరువాత గోపాల్, సంజని దంపతుల మద్య తేడాలు వచ్చాయి.

విడాకుల కోసం కోర్టుకు
భర్త గోపాల్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన సంజని కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. భర్త గోపాల్ తో విడిపోవాలని డిసైడ్ అయిన లేడీ డాక్టర్ సంజని విడాకులు తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించిన విషయం ఆమె బంధువులు ఎవ్వరికి ఇంత వరకు తెలీదు. ప్రస్తుతం సంజని, గోపాల్ ల విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది.

గ్రాండ్ గా పాప చెవులు కుట్టే ప్రోగ్రామ్
పాపకు తలవెంట్రుకలు తీసి చెవులు కుట్టే శుభకార్యాన్ని తిరుచ్చిలోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన లేడీ డాక్టర్ సంజని బంధువులు అందరిని ఆహ్వానించింది. అయితే ఈ వేడుకకు సంజని ఆమె భర్త గోపాల్ ను ఆహ్వానించలేదు. మొదటిసారి పాపకు శుభకార్యం చేస్తున్న సంజని చాలా గ్రాండ్ గానే హోటల్ లో ఫంక్షన్ కు ఏర్పాట్లు చేసింది.

తినేసి పోకుండా తిట్టి వెళ్లిపోయారు
శుభకార్యానికి హాజరైన బంధువులు అందరూ నీ భర్త గోపాల్ ఎక్కడ ?, ఎందుకు రాలేదు, తండ్రి లేకుండా సొంత కూతురికి చెవులు కుట్టే శుభకార్యం ఎందుకు పెట్టావు అంటూ బంధువులు చాలా మంది సంజనిని ప్రశ్నించారు. శుభకార్యానికి వచ్చిన వారు తినేసి వెళ్లిపోకుండా సంజనిని సూటిపోటిమాటలతో లేడీ డాక్టర్ సంజనిని మానసికంగా ఇబ్బందికి గురి చేశారని సమాచారం.

రాత్రి ఆత్మహత్య
పాపకు చెవులు కుట్టి తల వెంట్రుకలు తీసి శుభకార్యానికి వచ్చిన బంధువులు సూటిపోటీ మాటలు మాట్లాడటంతో సంజని జీవితంపై విరక్తి పెంచుకుంది. రాత్రి పాపకు పాలు తాగించిన లేడీ డాక్టర్ సంజని తరువాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాపకు మొదటి శుభకార్యం చేసిన లేడీ డాక్టర్ సంజని మరుసటి రోజు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సంజని తెలిపిన వివరాల ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications