Lady: గ్రేట్ లవర్స్, వారం క్రితం పెళ్లి, భర్త ఇంటికి వెళ్లి చూస్తే బెడ్ రూమ్ లో భార్య, ఇంతలోనే ఏం జరిగింది?!
చెన్నై/తేన్ కాశి: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రేమికులు హ్యాపీగా తిరిగారు. ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి, యువకుడి కుటుంబ సభ్యులకు ముందు నుంచి పరిచయం ఉండటంతో పెళ్లికి సెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ప్రేమికులు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకుని వారం పూర్తి కాకుండానే పెళ్లి కూతురు ఇంట్లో శవమై కనిపించడం కలకలం రేపింది.

ఒకే ఏరియాలో నివాసం
తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలోని శంకరన్ కోడ్ లోని గాంధీనగర్ లో కౌసల్యా అనే యువతి నివాసం ఉంటున్నది. కౌసల్యా నివాసం ఉంటున్న ఏరియాలోనే కార్తీక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నా కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒకరిని ఒకరు ఎక్కువగా మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండేవాళ్లు.

గ్రేట్ లవర్స్
ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న కార్తీక్, కౌసల్యాకు కొద్దిగా పరిచయం ఉన్నా తరువాత ఒకరిని ఒకరు మాట్లాడుకుంటూ స్నేహితులు అయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం కార్తీక్, కౌసల్యా దగ్గర అయ్యి కొంతకాలం తరువాత ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాల పాటు ప్రేమికులు కౌసల్యా, కార్తీక్ చాలా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

వారం క్రితం పెళ్లి చేసుకున్న ప్రేమికులు
ప్రేమికులు కౌసల్యా, కార్తీక్ పెళ్లి చేసుకోవాలని నాలుగు నెలల క్రితం డిసైడ్ అయ్యారు. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న కార్తీక్, కౌసల్యా కుటుంబ సభ్యులకు ముందు నుంచి పరిచయం ఉండటంతో పెళ్లికి వాళ్ల సెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఈనెల 7వ తేదీన ప్రేమికులు కౌసల్యా, కార్తీక్ వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు.

ఇంట్లో శవమైన కొత్త పెళ్లికూతురు
ఆదివారం ఉదయం కార్తీక్ పని మీద బయటకు వెళ్లాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత కొత్త పెళ్లికూతురు కౌసల్యా ఇంటిలోనే ఉంది. రాత్రి కార్తీక్ ఇంటికి వెళ్లి చూసేసరికి కౌసల్యా ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ శవమై కనిపించడంతో కార్తీక్ షాక్ అయ్యాడు. వివాహం చేసుకుని వారం పూర్తి కాకుండానే కొత్త పెళ్లి కూతురు కౌసల్యా ఇంట్లో శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications