Lady: సార్, మేడమ్ హోటల్ లో ఎంజాయ్, మంచం మీద జరిగిన పంచాయితీతో ప్రాణం పోయింది!

రెండు రోజులు లాడ్జ్ లో ప్రియుడితో కలిసి మద్యం సేవిస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన ప్రియురాలు అతన్ని అదే లాడ్జ్ లో హత్య చెయ్యడం కలకలం రేపింది.

చెన్నై/ టీనగర్: ఓ వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మహిళకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విభేదాలు రావడంతో అతన్ని వదిలేసిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది, పెళ్లికాని సార్ కు, భర్తను వదిలేసిన మేడమ్ కు పరిచయం కావడంతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రెండు రోజులు లాడ్జ్ లో ప్రియుడితో కలిసి మద్యం సేవిస్తూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన ప్రియురాలు అతన్ని అదే లాడ్జ్ లో హత్య చెయ్యడం కలకలం రేపింది.

భర్తను వదిలేసిన మేడమ్

భర్తను వదిలేసిన మేడమ్

తమిళనాడులోని పెరంబూర్‌కు చెందిన ప్రకాష్ (41) అనే వ్యక్తి చెన్నై సిటీ చేరుకుని నివాసం ఉంటున్నాడు. ప్రకాష్ కు ఇంకా పెళ్లి కాలేదు. ప్రకాస్ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. చెన్నైలోని కొసప్పెట్టై ప్రాంతానికి చెందిన ప్రియా (41) అనే మహిళతో ప్రకాష్ కు పరిచయం ఏర్పడింది. ప్రియాకు అప్పటికే వివాహమై ఆమె భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది.

అక్రమ సంబంధం.... లాడ్జ్ లో ఎంజాయ్

అక్రమ సంబంధం.... లాడ్జ్ లో ఎంజాయ్

ప్రియా, ప్రకాష్‌లు అక్రమ సంబంధం పెట్టుకుని తరచూ హోటల్ లో గదిని తీసుకుని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేవారు. ఈనెల 8వ తేదీన చెన్నై పెరియమేడు ఆర్ ఎం రోడ్డులోని ఓ ప్రైవేట్ హోటల్ లో యథావిధిగా గది తీసుకున్న ప్రకాస్, ప్రియా ఎంజాయ్ చేశారు. ప్రకాష్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడని ప్రియా హోటల్ మేనేజర్‌కి సమాచారం అందించింది. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా ప్రకాష్ శవమై కనిపించాడు. పోలీసులు ప్రకాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించి ప్రియాను విచారించారు.

అక్రమ సంబంధం ఉంది

అక్రమ సంబంధం ఉంది

తమ అక్రమ బంధం గురించి ప్రియా పోలీసులకు చెప్పింది. ఈ వియం బయటకు పొక్కితే అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, తరువాత తన ప్రియుడు ప్రకాష్ తన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రియా కన్నీరుమున్నీరుగా పోలీసులకు చెప్పింది. కానీ ప్రకాష్ ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవని నిపుణులు చెప్పడంతో ప్రియాపై పోలీసులకు అనుమానం మొదలైంది. అయితే ప్రియాకు డౌట్ రాకుండా పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూశారు.

సార్ ..... ఆ రోజు నైట్ అక్కడే ఉండాలని ?

సార్ ..... ఆ రోజు నైట్ అక్కడే ఉండాలని ?

పోస్టుమార్టం నివేదిక ప్రకారం ప్రకాష్ తల వెనుక భాగంలో బలమైన గాయమే మృతికి కారణమని వైద్యులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రియాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చివరకు ప్రియా నిజాలు చెప్పి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఘటన జరిగిన రోజు ఇద్దరూ మద్యం సేవించి రోజంతా ఎంజాయ్ చేశామని ప్రియా పోలీులకు చెప్పింది. రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి వెళ్లాలని తాను నిర్ణయించుకున్నానని ప్రియా పోలీసులకు చెప్పింది.

ఫుల్ నైట్ ఉండమని చెప్పాడు

ఫుల్ నైట్ ఉండమని చెప్పాడు

అయితే ప్రకాష్ మళ్లీ తనతో సరసాలాడమని పట్టుబట్టాడని, తనను పదేపదే కోరిక తీర్చాలని విసిగవించకూడదని తాను గట్టిగా ప్రకాష్ చెప్పానని ప్రియా పోలీసులు ముందు అసలు మ్యాటర్ చెప్పింది. ప్రకాష్ తనను పదేపదే ఆ రిలేషన్ షిప్ కోసం ఆహ్వానించాడని, అది తనకు తనకు నచ్చలేదని ప్రియా పోలీసులకు చెప్పింది. ఈ విషయలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ప్రకాష్ ప్రియాపై దాడి చేసి ఆమెను చితకబాదాడు. అప్పుడు ప్రియా అతడిని ఆపి మంచం మీద నుంచి కిందకి లాగింది.

మంచం మీద అది జరిగింది

మంచం మీద అది జరిగింది

మద్యం మత్తులో ప్రకాష్ కిందపడిపోవడంతో తలకు దెబ్బ తగిలి మూగబోయిందని ప్రియా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తాను ప్రకాష్ ను చంపాలని భావించి కిందకు లాగలేదని, అనుకోకుండా జరిగిందని ప్రియా పోలీసులకు చెప్పింది. ప్రియా వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+