Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lockdown: బ్లాక్ మూన్ వ్యాపారం, పైకి మసాజ్, లోపల మస్త్ మసాలా, ఆంటీలు, అమ్మాయిలు, మైండ్ బ్లాక్!

చెన్నై/ కన్యాకుమారి/ కొచ్చి: కరోనా వైరస్ (COVID 19) పుణ్యమా అంటూ లాక్ డౌన్ విధించడంతో చాలా మందికి పనులు లేక, చేతిలో డబ్బులు లేక అడ్డదార్లు తొక్కుతున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న సందర్బంగా బార్ అండ్ రెస్టారెంట్లు, రిసార్టులు, పబ్ లు, మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లల్స్, లాడ్జ్ లు, హోటల్స్ తదితర విలాసవంతమైన వ్యాపారాలకు ప్రభుత్వాలు చెక్ పెట్టాయి. పైకి మసాజ్ సెంటర్, పైగా ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం, పొరుగున మరో రాష్ట్రం ఇలా అన్ని రకాలుగా కలిసి రావడంతో లాక్ డౌన్ నియమాలను తుంగలో తొక్కేశారు. మసాజ్ సెంటర్ లోపల ఆంటీలు, అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రంతో పాటు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని చాలా రోజుల నుంచి నిఘా వేసిన పోలీసులకు కాలం కలిసి రావడంతో అసలు గుట్టు బయటపడటంతో మైండ్ బ్లాక్ అయ్యింది.

ప్రపంచంలోనే ఫేమస్

ప్రపంచంలోనే ఫేమస్

ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం తమిళనాడులోని కన్యాకుమారి. కన్యాకుమారిలో ప్రతిరోజు వేల సంఖ్యలో విదేశీయులు, ఇతర రాష్ట్రాల ప్రజలతో పాటు తమిళ ప్రజలు పర్యటిస్తుంటారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బకు ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన కన్యాకుమారి ఇప్పుడు బోసిపోయింది.

వందల సంఖ్యలో మసాజ్ సెంటర్లు

వందల సంఖ్యలో మసాజ్ సెంటర్లు

కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికే 90 శాతం మంది పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు. ఇక ఉదయం సూర్యోదయం చూసిన తరువాత సుమారు 50 శాతం మంది సముద్ర తీరంలో ఉన్న కన్యాకుమారిలో మసాజ్ చేసుకుంటారు. మసాజ్ చేసుకున్న తరువాత సముద్రంలో స్నానం చేస్తే ఆ మజానే వేరు అంటుంటారు పర్యటకులు. పర్యాటక కేంద్రం అయిన కన్యాకుమారిలో వందల సంఖ్యలో మసాజ్ సెంటర్లు ఉన్నాయి.

స్టిల్ లాక్ డౌన్ రూల్స్, కర్ఫ్యూ

స్టిల్ లాక్ డౌన్ రూల్స్, కర్ఫ్యూ

కరోనా వైరస్ దెబ్బకు కన్యాకుమారిలో లాక్ డౌన్ అమలులో ఉంది. గత నాలుగు నెలల నుంచి లాక్ డౌన్ దెబ్బతో కన్యాకుమారిలో మసాజ్ సెంటర్లతో పాటు హోటల్స్, లాడ్జీలతో పాటు అన్ని వ్యాపారలావాదేవీలు నిలిచిపోయాయి. ఇప్పటికీ కన్యాకుమారిలో లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే నిత్యవసర వస్తువులు కొనుగోలు చెయ్యడానికి ప్రజలు నాలుగు గంటలు బయట సంచరించడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. మిగిలిన సమయం అంతా కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లల్స్, పబ్ లు, రిసార్టులు తియ్యడానికి అధికారులు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

బ్లాక్ మూన్ స్టైలే వేరప్ప

బ్లాక్ మూన్ స్టైలే వేరప్ప


కన్యాకుమారిలోని దక్షిణ కుండల్ ప్రాంతంలోని బిస్మిల్లా నగర్ లో విలాసవంతమైన ‘బ్లాక్ మూన్' మసాజ్ సెంటర్ ఉంది. బయట బోర్డు మాత్రమే బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ పేరు ఉంది. లోపల జరిగే ఆ కథ తతంగం వేరు. లాక్ డౌన్ అమలులో ఉన్నా ప్రతిరోజు లెక్కలేనంత మంది బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ కు వచ్చి వెలుతున్నారు. స్థానికులు విషయం గుర్తించారు. మసాజ్ సెంటర్లు అన్నీ మూసివేసినా బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్, పక్కనే ఉన్న లాడ్జ్ లోకి ఎందుకు ఇంత మంది వచ్చి వెలుతున్నారు ? అని స్థానికుల అనుమానం పెరిగిపోయింది.

పోలీసులకు సినిమా

పోలీసులకు సినిమా


బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ కార్యకలాపాలపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, దాని కథ ఏమిటో మీరే చూడాలని స్థానికులు పోలీసులకు కొన్ని రోజులుగా వరుసగా ఫిర్యాదులు చేశారు. గత వారం నుంచి బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ పై పోలీసులు నిఘా వేశారు. అయితే పోలీసుల కళ్లు గప్పి బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ లో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహించారు. ఎన్నిసార్లు పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

బ్లాక్ మూన్ లో ఆంటీతో రసపట్టులో బిగ్ షాట్

బ్లాక్ మూన్ లో ఆంటీతో రసపట్టులో బిగ్ షాట్

నాలుగు రోజుల నుంచి ఓ బిగ్ షాట్ ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ లోకి వచ్చి వెలుతున్నాడు. లాక్ డౌన్ లో ఇన్నిసార్లు మసాజ్ సెంటర్ కు అతను ఎందుకు వచ్చి వెలుతున్నాడు ? అనే అనుమానం పోలీసులకు పెరిగిపోయింది. బిగ్ షాట్ వెళ్లిన 10 నిమిషాల తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అంతే గురుడులో లోపల ఓ ఆంటీతో మంచి రసపట్టులో ఉన్న విషయం గుర్తించి పోలీసులు షాక్ కు గురై వారి మైండ్ బ్లాక్ అయ్యింది.

కిటికీలు, గోడలు దూకి ఎస్కేప్

కిటికీలు, గోడలు దూకి ఎస్కేప్


పోలీసులు ఎంట్రీతో షాక్ కు గురైన బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ లోని కొందరు పెద్దపెద్ద కిటీల్లో నుంచి బయటకు వెళ్లి గొడలు దూకి పారిపోయారు. పోలీసులు వారిని వెంబడించినా రసగుల్లాగాళ్లు స్థానిక ప్రజల్లో కలిసిపోయి తప్పించుకున్నారు. మసాజ్ సెంటర్ లో ఓ ఆంటీతో పాటు మరి కొందరు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని, కరోనా వైరస్ ను లెక్క చెయ్యకుండా అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యారని, హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారని బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ నిర్వహకుల మీద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు బ్లాక్ మూన్ మసాజ్ సెంటర్ ను మూసేసి బయట నో ఎంట్రీ అంటూ బ్లాక్ బోర్డు తగిలించి పరారైన వారి కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+