• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!

|

చెన్నై: లారీ యజమాని అయిన వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యల ముద్దులమొగుడు టైప్ లో హ్యాపీగా ఉంటున్నాడు. సొంత భవనంలోని కింద అంతస్తులో మొదటి భార్య, ఆమె పిల్లలు, రెండో అంతస్తులో రెండో భార్య, పిల్లలు ఉంటున్నారు. కింద భర్త ఉంటే పైన ప్రియుడితో రెండో భార్య జల్సాలు చేస్తోంది. అంతే కాకుండా తెలిసిన మహిళలు, విటుల రప్పించి ఫ్యామిలీ హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోంది. ప్రియురాలి ఇంటికి వచ్చి జల్సాలు చేస్తున్న వ్యక్తి ఆమె బంగారు నగల మీద కన్ను వేశాడు. అంతే ఒక్కసారిగా తన గ్యాంగ్ ను వెంట వేసుకుని ముఖాలకు ముసులుగు వేసుకుని ఇంట్లో చొరబడి సినిమా స్టైల్లో ఇల్లు లూటీ చేసి వెళ్లిపోయాడు. అంత వరకు పై అంతస్తులోని టెర్రాస్ మీద ప్రియుడి కోసం, హైటెక్ వ్యభిచారం చెయ్యడానికి తన భార్య సీక్కెట్ రూమ్ ఏర్పాటు చేసుకుందని కనీసం భర్తకు కూడా తెలీదని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

ఇద్దరు భార్యల ముద్దలమొగుడు

ఇద్దరు భార్యల ముద్దలమొగుడు

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని చెంకున్రామ్ ప్రాంతంలోని పాడియనల్లూర్ లో అన్బుమణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అన్బుమణికి ఇద్దరు భార్యలు, మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్బుమణి రాధా అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. సొంతంగా లారీ తీసుకున్న అన్బుమణి అతనే డ్రైవర్ గా ఒక్కసారి బయటి రాష్ట్రాలకు బాడుగకు వెళితే నెల రోజుల పాటు ఇంటి వైపు కన్నెత్తి చూడడు,

రాధాకు రంకు మొగుళ్లు

రాధాకు రంకు మొగుళ్లు

అన్భుమణి మొదటి భార్య, ఆమె పిల్లలు కింద అంతస్తులో ఉంటున్నారు. పైన అంతస్తులో రాధా, ఆమె కుమారుడు, కుమార్తె ఉంటున్నారు. అన్బుమణి ఇంట్లో ఉంటున్న సమయంలో ఎక్కువ టైమ్ రాధా ఇంట్లో ఉండకుండా మొదటి భార్యతోనే కాలం గడిపేవాడు. ఇలాంటి సమయంలో రాధా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రఘు (32) అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రఘు స్నేహితులతో ఈమె లింక్ ఉందని సమాచారం.

కింద మొగుడు.... పైన ప్రియుడు

కింద మొగుడు.... పైన ప్రియుడు

అన్బుమణి మొదటి భార్య ఇంట్లో ఉంటే పైన ఉంటున్న రెండో భార్య రాధా ఇంటికి ఎప్పుడో ఒక టైమ్ లో అలా వెళ్లి ఇలా వచ్చేసేవాడు. కింద మొదటి భార్యతో తన భర్త అన్బుమణి ఉన్నాడని, అతని పైకి రాడని రాధాకు పూర్తిగా తెలుసు. ఇంట్లో ఉంటున్న పిల్లలను కిందకు వెళ్లి ఆడుకోవాలని చెబుతున్న రాధా పక్కింటి మేడ మీద నుంచి వచ్చేయాలని ప్రియుడు రఘుకు సమాచారం ఇచ్చేది. ఇలా రఘు మిద్దెల మీద నుంచి వెళ్లి ప్రియురాలు రాధాతో ఎంజాయ్ చేసేవాడు. రఘు లేని సమయంలో అతని స్నేహితులు అలాగే వెళ్లి రాధాతో జల్సాలు చేస్తున్నారు.

 తమిళ సినిమా స్కెచ్

తమిళ సినిమా స్కెచ్


ప్రియురాలు రాధా ఇంటికి వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేసి వెలుతున్న రఘు ఆమె ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించాడు. రాధా ఇంట్లోని బీరువాలో భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు, వెండి వస్తువులు ఉన్నాయని తెలుసుకున్న రఘు వాటిని ఎలాగైనా చోరీ చెయ్యాలని వేచి చూశాడు. తమిళ సినిమాల్లో స్కెచ్ వేసినట్లు రఘు అతని స్నేహితులతో కలిసి రఘు పక్కాస్కెచ్ వేశాడు.

పట్టపగలు సినిమా చూపించారు

పట్టపగలు సినిమా చూపించారు

నెల 5వ తేదీన అన్బుమణి మొదటి భార్య ఇంట్లో పిల్లలతో కలిసి అందరూ కుర్చుని భోజనం చేస్తున్నారు. రెండో భార్య రాధా కూడా కింద ఇంటికి వచ్చి భోజనం చేస్తోంది. ఆ సమయంలో రఘుతో పాటు కొందరు ముసుగులు వేసుకుని అన్భుమణి ఇంట్లోకి చోరబడి కత్తులతో బెదిరించి బీరువాలో ఉన్న ఐదు బంగారు నక్లెస్ లు, లక్షల రూపాలయ విలువైన వెండి వస్తువులు, మూడు విలువైన మొబైల్ ఫోన్లు, చేతికి చిక్కిన నగదు లూటీ చేసి పరారైనారు.

సీసీకెమెరాల్లో బైక్ నెంబర్ చిక్కింది

సీసీకెమెరాల్లో బైక్ నెంబర్ చిక్కింది

అన్భుమణి ఫిర్యాదు చెయ్యడంతో చెంక్రునామ్ పోలీసులు రంగంలోకి దిగి అన్బుమణి ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు పరిశీలించారు. లూటీ చేసిన రఘు గ్యాంగ్ లోని వాళ్ల ముఖాలు గుర్తు చిక్కకపోయినా ఒక బైక్ నెంబర్ మాత్రం పోలీసులకు చిక్కింది. బైక్ నెంబర్ ఆధారంగా రఘుతో పాటు మరో ముగ్గురు పోలీసులకు చిక్కారు. పోలీసులు బెండ్ తియ్యడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

  COVID -19 : కరోనా లాంటి మహమ్మారులు శతాబ్దానికోసారి పుట్టుకొస్తాయి - WHO || Oneindia Telugu
  నా ఇంట్లో భార్యకు సీక్కెట్ రూమ్ ఉందా ?

  నా ఇంట్లో భార్యకు సీక్కెట్ రూమ్ ఉందా ?


  రఘు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అన్భుమణి ఇంటికి వెళ్లి పై ఉన్న గదులు మొత్తం పరిశీలించారు.ఆ సమయంలో రాధా భర్త లారీ తీసుకుని నెలల పాటు బయటకు వెళ్లిన సమయంలో టెర్రాస్ లో ప్రత్యేకంగా ఓ గది నిర్మించిందని, రఘుతో పాటు మరో ఇద్దరితో అక్రమ సంబంధం సాగిస్తూ వారిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతే కాకుండా రఘుతో పాటు అతని స్నేహితులు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవాళ్లని, వీళ్లు నా ఫ్రెండ్స్, వాళ్లు ఆమె భర్తలు అని నమ్మిస్తున్న రాధా గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులకు కూడా తెలీకుండా సీక్రెట్ రూమ్ లో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త అన్బుమణికే తెలీకుండా రాధా టెర్రాస్ లో ప్రత్యేకంగా ఓ గది నిర్మించుకుందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ కు గురైనారు.

  English summary
  lockdown: High Tech Prostitution in Chennai in Tamil Nadu and two arrested.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X