Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: కాలేజ్ అమ్మాయి లవ్ స్టోరీ, ఎస్కేప్, ప్రియుడికి ఎయిడ్స్: ప్రియురాలికి నోప్రాబ్లమ్, మైండ్ బ్లాక్!

చెన్నై/ కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి వెంట ఓ అబ్బాయి తిరిగాడు. కొంతకాలం ఆ అబ్బాయితో పరిచయం పెంచుకున్న అమ్మాయి కూడా అతని ప్రేమలో పడింది. యువతీ యువకుడు ప్రేమించుకుని కలిసి తిరిగారు. మంచి రోజు చూసి కాలేజ్ అమ్మాయి అబ్బాయితో ఎస్కేప్ అయ్యింది. అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ప్రేమికులను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తనకు ఎయిడ్స్ ఉందని అబ్బాయి బాంబు పేల్చాడు. నా ప్రియుడికి ఎయిడ్స్ ఉంటే నాకు సమస్య కానీ మీకేందుకు ప్రాబ్లమ్ అంటూ అమ్మాయి పోలీసులను ప్రశ్నించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎయిడ్స్ పేషంట్ తో 17 ఏళ్ల అమ్మాయి ప్రేమపురాణం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. గత ఏడాది ఈ అమ్మాయి ఇంటర్ లో కాలేజ్ లో చేరి చదువుకుంటోంది. అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలోనే 22 ఏళ్ల యువకుడు నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఆ యువకుడు కాలేజ్ కు వెలుతున్న అమ్మాయి వెంటపడ్డాడు.

గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మాయి

గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మాయి


కొంతకాలంగా తన వెంటపడుతున్న ఆటో డ్రైవర్ మీద కాలేజ్ అమ్మాయి జాలి పడింది. ఆటో డ్రైవర్ ను ప్రేమించడానికి కాలేజ్ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి కాలేజ్ అమ్మాయి, ఆటో డ్రైవర్ కలిసితిరిగారు. కరోనా వైరస్ దెబ్బతో కొన్ని నెలలు కాలేజ్ మూసివేయడంతో ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది.

ప్రియుడితో అమ్మాయి ఎస్కేప్

ప్రియుడితో అమ్మాయి ఎస్కేప్

ఇటీవల కాలేజ్ మళ్లీ ప్రారంభం కావడంతో ఆ అమ్మాయి కాలేజ్ కు వెలుతోంది. వారం రోజుల క్రితం కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి తరువాత ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి అమ్మాయి ఆచూకిలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎయిడ్స్ ఉందని బాంబు పేల్చిన ప్రియుడు

ఎయిడ్స్ ఉందని బాంబు పేల్చిన ప్రియుడు


పోలీసులు రంగంలోకి దిగి గాలించారు. అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతంలో విచారణ చెయ్యగా ఆటో డ్రైవర్ తో ఆమె ప్రేమలో ఉందని వెలుగు చూసింది. పోలీసులు ఇద్దరి కోసం గాలించగా వాళ్లు కోయంబత్తూరులో ఉన్నారని తెలుసుకున్నారు. మంగళవారం సాయంత్రం కోయంబత్తూరులో ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తనకు ఎయిడ్స్ వ్యాధి ఉందని అబ్బాయి బాంబు పేల్చడంతో పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

ఎయిడ్స్ ప్రియుడు నాకు ఓకే

ఎయిడ్స్ ప్రియుడు నాకు ఓకే

ప్రియుడు తనకు ఎయిడ్స్ ఉందని చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు, పోలీసులు హడలిపోయారు. అమ్మాయి చెప్పిన మాటకు పోలీసులు మతిపోయింది. అవును నా ప్రియుడికి ఎయిడ్స్ ఉందని నాకు ముందే తెలుసు, అతను నాకు ఆ విషయం చాలా కాలం క్రితమే చెప్పాడు. ఎయిడ్స్ ఉందని అతన్ని దూరం పెట్టడం చాలా పాపం, అతనికి ఇప్పుడు సుఖం కావాలని అమ్మాయి భారీ డైలాగులు చెప్పడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో పాటు అందరూ షాక్ అయ్యారు.

Recommended Video

    Bengaluru : బిర్యానీ పిచ్చి.. ప్రాణాల కంటే బిర్యానే ఎక్కువా? || Oneindia Telugu
    షాక్ మీద షాక్..... మైండ్ బ్లాక్

    షాక్ మీద షాక్..... మైండ్ బ్లాక్

    ప్రియుడికి ఎప్పుడు, ఏ విధంగా ఎయిడ్స్ వ్యాధి సోకింది ?, అతనితో ఎవరెవరికి శారీరక సంబంధం ఉంది ? అనే విషయం గురించి కన్యాకుమారి జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. తనకు ఎయిడ్స్ ప్రియుడు కావాలని మొండికి వేసిన అమ్మాయికి కేవలం 17 ఏళ్ల మాత్రమే. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఎయిడ్స్ ప్రియుడిని అరెస్టు చేశారు. బాలికకు వైద్యపరీక్షలు చేయించామని, ఆమెకు ఎయిడ్స్ ఉందా ? లేదా ? అనే విషయం వైద్యపరీక్షల్లో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+