Lovers: ప్రియురాలి పెళ్లి ఫిక్స్, ప్రియుడు, ఫ్రెండ్స్ ఏం చేశారంటే ?, ఏకాతంలో వెనుక నుంచి!
చెన్నై: ప్రియురాలితో కలిసి ఏకాంత ప్రదేశాలకు వెళ్లిన ప్రియుడు ఆమెతో కలిసి జల్సా చేశాడు. ఇద్దరు కలాలు వేరుకావడంతో పెళ్లికి అమ్మాయి త్రండి నో చెప్పాడు. ఇదే సమయంలో ప్రియురాలికి వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగిపోయి పెళ్లి ఫిక్స్ అయ్యింది. తనకు దక్కని ప్రియురాలు ఎవ్వరికి దక్కకూడదని, ఆమె మరెవరితో సంసారం చెయ్యడానికి అవకాశం ఇవ్వకూడదని ప్రియుడు స్కెచ్ వేశాడు.
ఏకాంతంలో ఎంజాయ్ చెయ్యడానికి రావాలని, నీకు పెళ్లైతే నేను నీ వైపు కన్నెత్తి కూడా చూడనని ప్రియుడు ప్రియురాలిని నమ్మించాడు. ప్రియుడితో కలిసి నిర్జనప్రదేశంలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి ప్రియురాలిని ముగ్గురు కలిసి పక్కాప్లాన్ తో చంపేయడం కలకలం రేపింది.

భలే లవర్స్
తమిళనాడులోని కల్లకురుచ్చి సమీపంలోని తిరునావూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలందరూర్ లో వీరమణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వీరమణి కుమార్తె సరస్వతి అనే యువతి, రంగస్వామి అనే యువకుడు ప్రేమించుకున్నారని తెలిసింది. రంగస్వామి, సరస్వతికి ఆ ప్రాంతంలోని ప్రజలు భలే లవర్స్ అంటూ ఇంత కాలం ఆటపట్టించేవాళ్లని తెలిసింది.

కులాలు వేరు... సేమ్ స్టోరి
సరస్వతి, రంగస్వామి ఏకాంతంగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేశారు. సరస్వతి వన్నియార్ కులానికి చెందినది. రంగస్వామి కులం వేరు. రంగస్వామిని పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరించనని సరస్వతి తండ్రి వీరమణి తేల్చిచెప్పాడు. తండ్రిమాటకు కట్టుబడి ఉన్న సరస్వతి రానురాను ప్రియుడు రంగస్వామికి దూరం అయ్యింది.

వేరే యువకుడితో పెళ్లి
తండ్రి మాటకు ఎదురుచెప్పలేని సరస్వతి వీరమణి చూసిన యువకుడితో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. సరస్వతి, సెల్వ అనే యువకుడికి పెళ్లి నిశ్చితార్థం జరిగిపోయింది. తనకు భార్య కావలసిన సరస్వతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం చెయ్యడాన్ని తాను జీర్ణించుకోలేని రంగస్వామి పదేపదే అతని స్నేహితులకు చెప్పాడు.

చివరిసారి ఎంజాయ్ చేద్దాం రా
తనతో ఏకాంతంగా ఒకసారి ఎంజాయ్ చేస్తే జీవితంలో నీవైపు కూడా చాడనని, నువ్వు చక్కగా నీ భర్తతో కాపురం చేసుకోవచ్చని, లేదంటే మనపాత లవ్ స్టోరీ, ఎంజాయ్ చేసిన విషయాలు మొత్తం నీకు కాభోయే భర్త సెల్వంకు చెబుతానని రంగస్వామి అతని ప్రియురాలు సరస్వతిని బెదిరించాడు. ప్రియుడి కోరిక తీర్చితే తనకు ఇక ముందు తనకు ఇబ్బందులు ఉండవని, ఒకసారి వెళ్లి వచ్చేద్దాం అని సరస్వతి పొరపాటు పడింది.

ఏకాంతంలో ఉంటే.... వెనుక నుంచి ఏసేశారు
ఈనెల 2వ తేదీన మద్యాహ్నం 1 గంట సమయంలో సరస్వతి ఆమె మాజీ ప్రియుడు రంగస్వామిని కలవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉలందూర్ సమీపంలోని ఓ నిర్జనప్రదేశంలో రంగస్వామి, సరస్వతి ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ప్రియుడు రంగస్వామి కోరిక తీర్చిన సరస్వతి ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యారు. అదే సమయంలో సరస్వతిని వెనుక నుంచి ఇద్దరు పట్టుకుని ఆమె గొంతు కోసి చంపేశారు.
Recommended Video

ప్రియుడి పక్కాప్లాన్ తో ప్రియురాలి హత్య
మరుసటి రోజు సరస్వతి శవాన్ని గుర్తించిన పోలీసులు కేసు విచారణ చేశారు. సరస్వతి హత్యకు గురి కాకముందు చివరిసారి రంగస్వామికి ఫోన్ చేసిందని పోలీసులు గుర్తించారు. తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన సరస్వతిని నమ్మించి పిలిపించిన రంగస్వామి అతని స్నేహితులు రవీంద్రన్, క్రిష్ణస్వామి కలిసి ఆమె గొంతు కోసి చంపేశారని గుర్తించిన తిరునావూర్ పోలీసులు ప్రియుడ రంగస్వామితో సహ అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications