Marriage: ఇంటి నుంచి వెళ్లిన కొత్త పెళ్లి కూతురు, వారం తరువాత బావిలో శవమైయ్యింది, ఏం జరిగిందంటే?

చెన్నై/ విల్లుపురం: యువతి, యువకుడి చిన్ననాటి స్నేహం ప్రేమకు దారితీసింది. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని గొడవ చెయ్యడంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత సిటీలో కాపురం పెట్టారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొత్త పెళ్లి కూతురు మాయం అయ్యింది. ఇంటి నుంచి మాయం అయిన కొత్త పెళ్లి కూతురు బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది. కొత్త పెళ్లి కూతురిని ఆమె భర్త హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో కథ మలుపుతిరిగింది.

లవర్స్

లవర్స్

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి సమీపంలోని బ్రహ్మదేశం గ్రామంలో గోపీనాథ్ అలియాస్ గోపీ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బ్రహ్మదేశం గ్రామంలోనే కలైసెల్వీ అలియాస్ సెల్వీ (22) అనే యువతి నివాసం ఉంటున్నది. గోపీ, సెల్వీల చిన్ననాటి స్నేహం ప్రేమకు దారితీసింది.

చెన్నైలో పెళ్లి

చెన్నైలో పెళ్లి

కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత గోపీ, సెల్వీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెద్దలు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని గొడవ చెయ్యడంతో జూన్ 26వ తేదీన గోపీ, అతని ప్రియురాలు సెల్వీ ఇంటి నుంచి పారిపోయారు. మరుసటి రోజు చెన్నైలోని ఓ గుడిలో ప్రేమికులు గోపీ, సెల్వీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత చెన్నై సిటీలో కాపురం పెట్టారు.

బావిలో శవమైన కొత్త పెళ్లి కూతురు

బావిలో శవమైన కొత్త పెళ్లి కూతురు

నెల రోజుల పాటు కొత్త జంట గోపీ, సెల్వీ చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఆగస్టు 2వ తేదీన తాను పుట్టింటికి వెలుతున్నానని భర్త గోపీకి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొత్త పెళ్లి కూతురు సెల్వి మాయం అయ్యింది. ఇంటి నుంచి మాయం అయిన కొత్త పెళ్లి కూతురు సెల్వీ ఆచూకి లేదు. సోమవరాం వ్యవసాయ బావిలో సెల్వీ శవమై కనిపించడం కలకలం రేపింది.

భర్త చంపేశాడని కేసు పెట్టిన అమ్మాయి తండ్రి

భర్త చంపేశాడని కేసు పెట్టిన అమ్మాయి తండ్రి

సెల్వీ శవాన్ని బావిలో నుంచి బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సెల్వీని ఆమె భర్త గోపీ హత్య చేశాడని ఆమె తండ్రి మురుగన్ పోలీసు కేసు పెట్టాడు. అయితే తన భార్య సెల్వీని తాను హత్య చెయ్యలేదని, లవ్ మ్యారేజ్ చేసుకున్నదని కోపంతో ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని గోపీ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+