jewelery: భలే చాన్స్ రా, కింద జ్యూవెలరీ షోరూమ్, పైన ఓనర్ ఫ్యామిలీ, మార్నింగ్ చూస్తే రూ. కోట్లలో?
బంగారు నగలు లూటీ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. పైన ఓనర్ ఫ్యామిలీ ఉన్నా కింద కోట్ల విలువైన బంగారు నగలు లూటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
చెన్నై/ టీ నగర్: బంగారు నగలు ఎక్కడ విక్రయిస్తారు, ఎంత లావాదేవీలు జరుగుతున్నాయని దొంగలు ఆరా తీస్తుంటారు. బంగారు నగలు లూటీ చేస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటారు. ఇదే ప్లాన్ చాలా మంది వేసినా చాలా కేసుల్లో చిక్కడం లేదు. అయితే కొన్ని కేసుల్లో మాత్రం నిందితులకు పోలీసులకు చిక్కిపోతున్నారు. పైన ఓనర్ ఫ్యామిలీ ఉన్నా కింద కోట్ల విలువైన బంగారు నగలు లూటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీధర్ అనే వ్యక్తికి చెన్నై సిటీలోని పెరంబూర్ పేపర్ మిల్స్ రోడ్‌లో నగల దుకాణం ఉంది. ఈ దుకాణం పైనున్న ఇంట్లో శ్రీధర్ అతని కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఈరోజు ఉదయం యథావిధిగా దుకాణం తెరిచేందుకు వచ్చి చూడగా ముందు షట్టర్‌కు వెల్డిం కట్టర్ తో కట్ చేశారని గుర్తించి షాక్‌కు గురయ్యాడు. అనంతరం లోపలికి వెళ్లి చూడగా లాకర్‌లోని రూ 4 కోట్ల రూపాయల 79 లక్షల రూపాయల విలువైన 9 కిలోల బంగారు ఆభరణాలు, 20 లక్షల రూపాయల విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అనంతరం స్నిఫర్ డాగ్‌తో వచ్చిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి చోరీకి సంబంధించిన ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు దుండగులు నగల దుకాణంలోని సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను లాక్కెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
జ్యూవెలరీ షాపు దోపిడీ ఘటనా స్థలంలో చెన్నై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోలీసు అధికారులు నేరస్తులను పట్టుకునేందుకు ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో 9 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లతో కూడిన 6 ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశామన్నామని, దుకాణంలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా విడివిడిగా విచారిస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications