చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Revenge: భార్య బర్త్ డే, కేక్, కొత్త బట్టలు, బంగారు రింగ్ లు తీసుకున్నాడు, ఇంట్లో భార్య లేదని, రోడ్డు మీద!

|
Google Oneindia TeluguNews

చెన్నై/టీ నగర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. వయసులో తేడా ఉన్నా పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో తిరుగుతున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు సంపాదించడం, సంపాదించిన డబ్బులో అర్దం డబ్బులు మద్యం సేవించడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇదే విషయంలో దంపతులు మద్య గొడవలు జరుగుతున్నాయి. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి వస్తోంది. ఈ విషయం కూడా దంపతుల మద్య గొడవలకు దారితీసింది. కొంతకాలం క్రితం భార్య ఆమె భర్తకు గుడ్ బై చెప్పి అదే సిటీలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను ఇంటికి పిలిపించుకోవాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి భార్య బర్త్ డే రోజు ఆమెకు కొత్త బట్టలు, కేక్, గిఫ్ట్ లు తీసుకున్నాడు. భార్యకు బహుమతులు ఇచ్చి ఆమెను బుజ్జగించి ఇంటికి పిలుచుకుని వెళ్లాలని భర్త స్కెచ్ వేశాడు. తనకు తోడుగా వస్తున్న స్నేహితులతో లిక్కర్ పార్టీ జరుపుకోవడానికి మద్యం బాటిల్స్ తీసుకున్నాడు. కొత్త బట్టలు, కేక్, గిఫ్ట్ తీసుకుని భార్య ఇంటికి వెళ్లాడు. అయితే ఫ్రెండ్స్ తో భార్య బర్త్ డే చేసుకోవడానికి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.

సమీపంలోని ఫ్రెండ్ ఇంట్లో అర్దరాత్రి వరకు మద్యం సేవించిన భర్త అతని భార్య కోసం ఎదురు చూశాడు. అర్దరాత్రి దాటినా భార్య ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త రగిలిపోయాడు. వేకువ జామున 4 గంటల వరకు మద్యం సేవించిన భర్త , అతని స్నేహితులు మద్యం మత్తులో కర్రలు, ఇనుప రాడ్లు తీసుకుని భార్య నివాసం ఉంటున్న వీధిలో పార్క్ చేసిన వాహనాలు మొత్తం ద్వంసం చెయ్యడం కలకలం రేపింది.

Illegal affair: భర్త హత్య కేసులో జైలుకు, బెయిల్ మీద వచ్చిన బ్యూటీపార్లల్ కిలాడీ, నడిరోడ్డులో నరికేశారు!Illegal affair: భర్త హత్య కేసులో జైలుకు, బెయిల్ మీద వచ్చిన బ్యూటీపార్లల్ కిలాడీ, నడిరోడ్డులో నరికేశారు!

భార్యతో ఎంజాయ్ చేసిన భర్త

భార్యతో ఎంజాయ్ చేసిన భర్త

చెన్నై సిటీలోని మదురవాయర్ స్ట్రీట్ సమీపంలో నరేంద్రన్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నరేంద్రను రెండు సంవత్సరాల క్రితం సెల్వి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన సంవత్సరం పాటు నరేంద్రన్, సెల్వి దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

మద్యం సేవిస్తున్న భర్త

మద్యం సేవిస్తున్న భర్త

వయసులో తేడా ఉన్నా పెద్దవాళ్లు, చిన్నవాళ్లతో తిరుగుతున్న నరేంద్రన్ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. నరేంద్రన్ ప్రతిరోజు సంపాదించడం, సంపాదించిన డబ్బులో అర్దం డబ్బులు మద్యం సేవించడానికి ఖర్చు పెడుతున్నాడు. ఇదే విషయంలో నరేంద్రన్, సెల్వీ దంపతులు మద్య గొడవలు జరుగుతున్నాయి.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

భర్త నరేంద్రన్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య సెల్వీ కూడా ఆమె స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి వస్తోంది. ఈ విషయంలో కూడా నరేంద్రన్, సెల్వీ దంపతుల మద్య గొడవలకు దారితీసింది. కొంతకాలం క్రితం భార్య సెల్వీ ఆమె భర్తకు గుడ్ బై చెప్పి చెన్నై సిటీలో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలిపించుకోవాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు.

భార్య బర్త్ డే రోజు హంగామా చెయ్యాలని

భార్య బర్త్ డే రోజు హంగామా చెయ్యాలని

చివరికి నరేంద్రన్ అతని భార్య సెల్వీ బర్త్ డే రోజు ఆమెకు కొత్త బట్టలు, కేక్, గిఫ్ట్ లు తీసుకున్నాడు. భార్య సెల్వీకి బహుమతులు ఇచ్చి ఆమెను బుజ్జగించి తన ఇంటికి పిలుచుకుని వెళ్లాలని నరేంద్రన్ స్కెచ్ వేశాడు. తనకు తోడుగా వస్తున్న మేషక్ (19) అనే యువకుడితో కొందరు స్నేహితులతో లిక్కర్ పార్టీ జరుపుకోవడానికి నరేంద్రన్ కొన్ని మద్యం బాటిల్స్ తీసుకున్నాడు.

ఇంట్లో భార్య లేదు

ఇంట్లో భార్య లేదు

కొత్త బట్టలు, కేక్, గిఫ్ట్ తీసుకుని భార్య సెల్వీ ఇంటికి వెళ్లాడు. అయితే ఫ్రెండ్స్ తో భార్య బర్త్ డే చేసుకోవడానికి సెల్వీ బయటకు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు భర్త నరేంద్రన్ కు చెప్పారు. సమీపంలోని ఫ్రెండ్ ఇంట్లో అర్దరాత్రి వరకు మద్యం సేవించిన నరేంద్రన్ అతని ఫ్రెండ్ మేషక్ తదితరులు సెల్వీ కోసం ఎదురు చూశాడు.

 భార్య మీద కోపంతో రోడ్డు మీద రచ్చరచ్చ

భార్య మీద కోపంతో రోడ్డు మీద రచ్చరచ్చ

అర్దరాత్రి దాటినా భార్య సెల్వీ ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త నరేంద్రన్ రగిలిపోయాడు. వేకువ జామున 4 గంటల వరకు మద్యం సేవించిన నరేంద్రన్, అతని స్నేహితుడు మేషక్ తదితరులు మద్యం మత్తులో కర్రలు, ఇనుప రాడ్లు తీసుకుని భార్య సెల్వీ నివాసం ఉంటున్న వీధిలో పార్క్ చేసిన వాహనాలు మొత్తం ద్వంసం చెయ్యడం కలకలం రేపింది. నరేంద్రన్, మేషక్ సుమారు 10 వాహనాలు, బైక్ లు ద్వంసం చేశారు. మా టాటా ఏస్ వాహనాలు, రెండు బైక్ లు దంసం చేశారని సతీష్ అనే వ్యక్తి కేసు పెట్టడంతో పోలీసులు నరేంద్రన్, మేషక్ ను అరెస్టు చేశారు.

English summary
Revenge: Husband celebrating wife birthday with alcohol in road, City police arrested husband in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X