చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rowdy sheeter: భార్య కౌన్సిలర్, బియ్యం బ్యాగ్ లో బాంబులు, ఎందుకో తెలుసా ?, 5 హత్యలు, 30 కేసులు!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ పుదుచ్చేరి: 30 సంవత్సరాలు దాటకుండానే యువకుడి మీద ఐదు హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, బాంబు దాడుల కేసులతో పాటు 30కి పైగా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. నిందితుడి పేరు ఇప్పటికే రౌడీషీటర్ల జాబితాలో చేరిపోయింది. రాజకీయాల్లోకి రావడానికి రౌడీషీటర్ కు అవకాశం లేకపోవడంతో అతని భార్యను రాజకీయాల్లోకి తీసుకు వచ్చాడు. రాజకీయాల్లోని ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు, సాటి రౌడీషీటర్లు, ప్రత్యర్థుల మీద దాడులు చెయ్యడానికి ఆ రౌడీషీటర్ ప్రయత్నిస్తున్నాడు.

బైక్ మీద వెలుతున్న రౌడీషీటర్ ను గస్తీ తిరుగుతున్న పోలీసులు అడ్డుకున్నారు. తరువాత రౌడీషీటర్ తీసుకెలుతున్న బియ్యం బ్యాగ్ పరిశీలించారు. బియ్యంలో నాటు బాంబులు దర్శనం ఇవ్వడంతో హడలిపోయిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రత్యర్థులను బాంబులు వేసి చంపడానికి వెలుతున్న రౌడీషీటర్ బియ్యం బ్యాగ్ లో బాంబులు పెట్టుకుని వెలుతూ అడ్డంగా పోలీసులకు చిక్కిపోయాడు.

Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!Illegal affair: ప్రియుడి కోసం కిలాడీ తల్లి బిడ్డలను ఏం చేసిందంటే ?, భర్తకు ఫోన్ చేసి డ్రామాలు, చరణ్!

ఇంకా 30 ఏళ్ల కూడా పూర్తి కాలేదు

ఇంకా 30 ఏళ్ల కూడా పూర్తి కాలేదు

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సుమన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల వయసులోనే నేరాలు చెయ్యడం మొదలు పెట్టిన సుమన్ పేరు కొన్ని సంవత్సరాల క్రితమే రౌడీషీటర్ల జాబితాలో చేరిపోయింది. నేరాలు చేస్తున్న సుమన్ ఇప్పటికే ఓ యువతిని లొంగదీసుకుని హీరోలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

ఐదు హత్య కేసులు

ఐదు హత్య కేసులు

30 సంవత్సరాలు దాటకుండానే సుమున్ మీద ఐదు హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, బాంబు దాడుల కేసులతో పాటు మొత్తం 30కి పైగా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. నిందితుడు సుమన్ పేరు ఇప్పటికే రౌడీషీటర్ల జాబితాలో చేరిపోయింది. నేరాలు, సెటిల్ మెంట్లు చెయ్యడం సుమన్ పనిగా పెట్టుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

 భార్యను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి దందాలు

భార్యను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి దందాలు

రాజకీయాల్లోకి రావడానికి రౌడీషీటర్ సుమన్ కు అవకాశం లేకపోవడంతో అతని భార్యను రాజకీయాల్లోకి తీసుకు వచ్చాడు. పుదుచ్చేరి సమీపంలోని ఓ ఊరిలో సుమన్ భార్య కౌన్సిలర్ గా గెలిచింది. రాజకీయాల్లోని ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు, సాటి రౌడీషీటర్లు, ప్రత్యర్థుల మీద దాడులు చెయ్యడానికి రౌడీషీటర్ సుమన్ ప్రయత్నిస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

బియ్యం బ్యాగ్ లో నాటు బాంబులు

బియ్యం బ్యాగ్ లో నాటు బాంబులు

రాత్రి సుమన్, అతని స్నేహితులు ఇద్దరు బైక్ లో బయలుదేరారు. బైక్ మీద వెలుతున్న రౌడీషీటర్ సుమన్ ను గస్తీ తిరుగుతున్న ఎస్ఐ రాజేష్ తో పాటు స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. తరువాత రౌడీషీటర్ సుమన్ తీసుకెలుతున్న బియ్యం బ్యాగ్ పరిశీలించారు.

బియ్యంలో నాటు బాంబులు దర్శనం ఇవ్వడంతో హడలిపోయిన పోలీసులు సుమన్ ను అరెస్టు చేశారు. ప్రత్యర్థులను బాంబులు వేసి చంపడానికి వెలుతున్న రౌడీషీటర్ సుమన్ బియ్యం బ్యాగ్ లో బాంబులు పెట్టుకుని వెలుతూ అడ్డంగా పోలీసులకు చిక్కిపోయాడు. సుమన్ ను కోర్టు ముందు హాజరుపరిచి కేసు విచారణ చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
Rowdy sheeter: Police have arrested rowdy for hiding country bombs in a rice bag in Pondicherry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X