• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Second wife: ఇద్దరూ సెకండ్ హ్యాండ్ సరుకే, ఆ మొగుడితో మళ్లీ లింక్, గొడ్డు మాంసం ఎఫెక్ట్, ఫినిష్ !

|

చెన్నై/ టీనగర్: పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భార్య మరో పెళ్లైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి కుమార్తెను పిలుచుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని మరో కుమార్తెకు జన్మనచ్చింది. రెండో భర్తతో కాపురం చేస్తున్న భార్య మొదటి మొగుడితో మళ్లీ లింక్ పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న రెండో భర్త రగిలిపోయాడు. అసలే గొడ్డు మాంసం వ్యాపారి అయిన వ్యక్తి రెండో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు.

friends: మీ అమ్మ సూపర్ ఫిగర్ రా, కత్తిలా ఉంటుంది, భలే ఎంజాయ్ చేశా, క్వాటర్ బాటిల్ తో రెండు !

 7 ఏళ్లు హ్యాపీలైఫ్

7 ఏళ్లు హ్యాపీలైఫ్

చెన్నైలోని అవడి ప్రాంతానికి చెందిన సరిత, సురేష్ అనే వ్యక్తికి 9 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. సరిత, సురేష్ దంపతులకు చెర్మిలి (7) అనే కుమార్తె ఉంది. చెన్నైలోని పల్లవరంలోని ప్రముఖ కంపెనీలో సరిత సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తోంది. మంచి ఉద్యోగం చేస్తున్న సరిత రెండు సంవత్సరాల క్రితం వరకు భర్త సురేష్ తో చక్కగా కాపురం చేస్తూ కుమార్తె చెర్మిలితో కలిసి జీవించింది.

 గొడ్డు మాంసం వ్యాపారి ఎంట్రీ

గొడ్డు మాంసం వ్యాపారి ఎంట్రీ

మదన్ (42) అనే వ్యక్తి గొడ్డు మాంసం (పశువుల మాంసం) వ్యాపారం చేస్తున్నాడు. మదన్ కు ఇంతకు ముందే అలివేలు అనే మహిళతో వివాహం అయ్యింది. మదన్, అలివేలు దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం సరిత జీవితంలో మదన్ ఎంట్రీ ఇచ్చాడు. తనకు పాత మొగుడు సురేష్ ఎందుకు అనుకుందో ఏమో కాని సరిత మదన్ వలలో పడిపోయి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది.

మతం మార్చుకుని రెండో పెళ్లి

మతం మార్చుకుని రెండో పెళ్లి

రెండు సంవత్సరాల క్రితం సరిత మొదటి భర్త సురేష్ కు హ్యాండ్ ఇచ్చి విడాకులు తీసుకుంది. తరువాత మతం మార్చుకున్న సరిత మదన్ ను పెళ్లి చేసుకుంది. మదన్, సరిత దంపతులు వేరుగా కాపురం పెట్టారు, మదన్ మరో భార్య అలివేలు ఇద్దరు పిల్లలతో కలిసి మరో ప్రాంతంలో వేరుగా నివాసం ఉంటున్నారు.

 లైన్ లోకి వచ్చిన మొదటి మొగుడు

లైన్ లోకి వచ్చిన మొదటి మొగుడు

మదన్, సరిత దంపతులకు 7 నెలల క్రితం ఓ కుమార్తె పుట్టడంతో ఆ పాప పేరు మెక్ గిల్లినా అని నామకరణం చేశారు. సరిత పెద్ద కుమార్తె చెర్మిలి కూడా తల్లి, రెండో తండ్రి మదన్ తో కలిసి నివాసం ఉంటోంది. మదన్ ను పెళ్లి చేసుకున్న తరువాత సరిత ఉద్యోగం నిలిపివేసింది. కొంతకాలం నుంచి సరిత, ఆమె పెద్ద కుమార్తె చెర్మిలి ఫోన్ లో సురేష్ (సరిత మొదటి భర్త)తో ఎక్కువగా మాట్లాడుతున్నారు.

మొదటి మొగుడు+ నేనూ కావాలంటే కుదరదు

మొదటి మొగుడు+ నేనూ కావాలంటే కుదరదు

ఈ విషయం తెలుసుకున్న మదన్ రెండో భార్య సరితను హెచ్చరించాడు. నువ్వు ఇంకా మొదటి మొగుడు కావాలని అనుకుంటున్నావు, అయితే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, పద్దతి మార్చుకోకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని మదన్ రెండో భార్య సరితను హెచ్చరించాడు. గత రెండు రోజుల నుంచి ఇంట్లో ఇదే విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి.

రెండో భార్య ప్రాణాలు పైకి పార్శిల్

రెండో భార్య ప్రాణాలు పైకి పార్శిల్

అర్దరాత్రి సహనం కోల్పోయిన మదన్ ఇనుప రాడ్ తీసుకుని రెండో భార్య సరిత తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. తీవ్రగాయాలైన సరిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కళ్ల ముందే తల్లి హత్యకు గురి కావడంతో చెర్మిలి గట్టిగా కేకలు వేసింది, అదే సమయంలో ఏడు నెలల పాపను ఎత్తుకుని మదన్ అక్కడి నుంచి పరారైనాడు. ఆవడి పోలీసులు మదన్ కోసం గాలించి అరెస్టు చేసి చిన్నారిని బంధువులకు అప్పగించారు. కన్న తండ్రి సురేష్ ఇప్పటికే దూరం కావడం, ఇప్పుడు తల్లి సరిత హత్యకు గురికావడంతో చెర్మిలి బోరున విలపిస్తోంది.

English summary
Second hand wife: Husband killed his second wife in Avadi in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X