Second wife: ఆంటీకి లవర్స్, వాళ్ల ఫ్రెండ్స్ కూతురితో రొమాన్స్, భర్తకు తెలిసి, నడిరోడ్లో వేసేశాడు!
చెన్నై: మొదటి భర్త కుమార్తెతో కలిసి భార్య ఆమె రెండో భర్తతో నివాసం ఉంటున్నది. తన భార్య మొదటి భర్తకు పుట్టిన కుమార్తెను అతను సొంత కుమార్తెలాగా చూసుకుంటున్నాడు. తనను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యకు మొదటి సంతానం అయిన అమ్మాయికి ఏ కష్టం రాకుండా అతను చూసుకుంటున్నారు. భార్య తిరుగుబోతు అని తెలిసినా ఆమె రెండో భర్త పెద్దగా పట్టించుకోలేదు. అయితే తన భార్య కుమార్తెను కూడా చెడగొడుతోందని ఆమె రెండో భర్తకు అనుమానం మొదలైయ్యింది.
కుమార్తెను వెంట తీసుకెళ్లి ఆమె ప్రియుడి స్నేహితుల చేతుల్లో పెడుతోందని, కుమార్తె జీవితం కూడా అవుతోందని తెలుసుకున్న భర్త తెగించాడు. గొడవ పెట్టుకున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్లి పోయింది. రగిలిపోయిన భర్త భార్యతో పాటు అడ్డు వచ్చిన ఆమె తండ్రిని నడిరోడ్డులో దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

మొదటి భర్తకు పంగనామాలు
చెన్నైలోని రాయపేట్ లోని మహమ్మద్ హుస్సేన్ వీధిలో ముసాఫర్ (79) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముసాఫర్ కుమార్తె కౌవుసీ నిషా బేగం (50)కు ఇంతకు ముందే ఖాజాపీర్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నీషా బేగం, ఖాజాపీర్ దంపతులకు 21 ఏళ్ల వయసు ఉన్నఅత్తర్ వున్నీసా (పేరు మార్చడం జరిగింది) అనే కుమార్తె ఉంది. అయితే కుటుంబ సమస్యల కారణంగా నీషా బేగం మొదట భర్త ఖాజాపీర్ కు విడాకులు ఇచ్చేసింది.

పెసరట్టు, ఉప్మా, ఉద్దివడతో నిషా రెండో పెళ్లి
రాయపేట్ లోని యానైకుళం ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్దుల్ ఖాదర్ (41) అనే వ్యక్తి సొంతంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అబ్దుల్ ఆటోలో అప్పుడప్పుడు తిరుగుతున్న నిషా అతన్ని వలలో వేసుకుంది. మంచిటైప్ చూసి అబ్డుల్ కు మంచి మసాలా పెసరట్టు, ఉప్మా, ఉద్దివడ తినిపించిన నిషా అతన్నిన వలలో వేసుకుని రెండో పెళ్లి చేసుకుంది.

భార్య తిరుగుబోతు అని తెలిసినా?
తాను రెండో పెళ్లి చేసుకున్న నిషా బేగం రానురాను బయట తిరుగుళ్లు ఎక్కువ తిరిగింది. సాటి ఆటో డ్రైవర్లు అబ్దుల్ కు నీ భార్య ఎక్కడెక్కడో తిరుగుతోందని, నువ్వు కాకుండా ఆమెకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం మేము కళ్లారా చూశామని చెప్పారు. తాను బుద్దిలేకుండా రెండో పెళ్లి చేసుకున్నానని అబ్దుల్ ఖాదర్ చాలా కాలం నుంచి ఆవేదన చెందుతున్నాడు.

కుతుర్ని చెడగొడుతున్న తల్లి
రానురాను వయసుకు వచ్చిన కుమార్తె అత్తర్ వున్నీసాను వెంట పిలుచుకుని వెలుతున్న నిషాబేగం రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం మొదలుపెట్టింది. నిషా అక్రమ సంబంధం సాగిస్తున్న ఓ వ్యక్తి స్నేహితుడితో కన్న కూతురు అత్తర్ వున్నీసాను చనువుగా ఉండాలని ఆమె సొంత తల్లి ఒత్తిడి చేస్తోందని అబ్దుల్ కు అనుమానం వచ్చింది. అందుకే కూతురిని వెంట తీసుకెళ్లి విలాసవంతమైన జీవితం అలవాటు చేస్తోందని అబ్దుల్ కు తెలిసిందని సమాచారం.

పుట్టింటికి వెళ్లిపోయిన రెండో భార్య
నువ్వు చెడిపోయింది కాకుండా కూతుర్ని కూడా చెడగొడుతున్నావా ? అంటూ అబ్దుల్ ఆమె రెండో భర్త నిషాతో గొడపడటం మొదలుపెట్టాడు. తన రహస్యాలు రెండో భర్తకు తెలిసిపోతున్నాయి అని భయపడిన నిషా ఆమె కుమార్తె అత్తర్ వున్నీసాను పిలుచుకుని రాయపేట్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

నువ్వు తల్లివా ?. కూతురికి బ్రోకర్ వా
పుట్టింటికి వెళ్లిన కుమార్తెను వెంట తీసుకెళ్లి మళ్లీ తన భార్య నిషా కన్నకూతురితో ఎవ్వరూ చెయ్యకూడని పనులు చేయిస్తోందని, చెడుతిరుగుళ్లు తిరుగుతోందని, కూతురిని పూర్తిగా చెడగొడుతోందని అబ్దుల్ రగిలిపోయాడు. వెంటనే భార్య నిషా ఇంటి దగ్గరకు వెళ్లిన ఆమె రెండో భర్త గొడవపెట్టుకున్నాడు.

మామ, భార్యను చంపిన రెండో భర్త
ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో భార్య నిషా అండ్రి ముసాఫర్ జోక్యం చేసుకున్నాడు. అదే సమయంలో సహనం కోల్పోయిన అబ్దుల్ బీర్ బాటిల్ పగలగొట్టి మామ ముసాఫర్ ను పొడిచి చంపేశాడు. తరువాత కత్తి తీసుకుని భార్య నిషా గొంతు కోసి ఆమె కడుపులో పొడిచిపొడిచి చంపేశాడు. కూతురిని చెడగొడుతోందని అనుమానంతోనే నిషాను, ఆమె తండ్రిని రెండో భర్త అబ్దుల్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications