Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !

చెన్నై/ కన్యాకుమారి: బీఎస్పీ నర్సింగ్ చేసిన షామిలి అనే యువతి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరు రాజుతో షామిలి ప్రేమలో పడింది. ఇద్దరు Secret marriage చేసుకుని ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. లాక్ డౌన్ దెబ్బతో షామిలి ఇంటికి వెళ్లడంతో వేరే యువకుడితో ఆమె పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. షామిలి దగ్గర మొబైల్ ఫోన్ లాక్కొని ఆమె బయటకు వెళ్లకుండా చేశారు. సినిమా స్టైల్లో విషయం భర్త రాజుకు తెలిసిపోయింది. రిసెప్షన్ కూడా జరిగిపోయింది. ఆ సమయంలో రాజు పోలీసులను వెంటపెట్టుకుని కల్యాణమండపం దగ్గరకు వెళ్లి ఆపండిరా... నేనేరా రాజు అంటూ గట్టిగా కేకలు వేశాడు. థ్రిల్లర్ సినిమా క్రైమాక్స్ ను మించిపోయే విధంగా షామిలి, రాజుల లవ్ స్టోరీ కథ కొత్తమలుపు తిరిగింది.

 కన్యాకుమారి షామిలి

కన్యాకుమారి షామిలి


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ సమీపంలోని మార్తాండంలోని వెట్టువెన్ని ప్రాంతంలో నివాసం ఉంటున్న షామిలి (23) అనే యువతి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన తరువాత కన్యాకుమారిలోని ప్రముఖ ఆసుపత్రిలో కొంతకాలం ఉద్యోగం చేసిన షామిలి తరువాత బెంగళూరులో మంచి ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది.

 నీ జీవితానికి నేనే రాజు

నీ జీవితానికి నేనే రాజు

తమిళనాడులోని ధర్మపురికి చెందిన రాజు (25) బీటెక్ పూర్తి చేసి బెంగళూరు చేరుకుని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. అనుకోకుండా ఓసారి రాజు, షామిలి కలిశారు. ఇద్దరిది తమిళ వాసనకావడంతో పరిచయం పెరిగి స్నేహితులుగా మారారు. ఇద్దరి మనసులు దగ్గర కావడంతో షామిలి, రాజు ప్రేమించుకున్నారు. షామిలి ఈ జీవితానికి నేనే నీ రాజు అంటూ ప్రియుడు చెప్పాడు.

 ముందు జాగ్రతగా సీక్రెట్ పెళ్లి

ముందు జాగ్రతగా సీక్రెట్ పెళ్లి

షామిలి, రాజు ఒకరిని ఒకరు విడిచిపెట్టలేకపోయారు. ఎక్కడ విషయం బయటకు తెలిస్తే మన పెళ్లికి పెద్దలు అడ్డుచెబుతారో అనే భయంతో షామిలి, రాజు రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. షామిలి, రాజు బెంగళూరులో ఉండటంతో కొంతకాలం ఆ విషయం బయటకు రాలేదు. బెంగళూరులో హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్న రాజు, షామిలి కొంతకాలం ఎంజాయ్ చేశారు.

 కరోనా పుణ్యమా అంటూ ఇంట్లో లాక్

కరోనా పుణ్యమా అంటూ ఇంట్లో లాక్

మార్చి రెండో వారంలో కుటుంబ సభ్యులు ఇంటికి రావాలని బలవంతం చెయ్యడంతో షామిలి బెంగళూరు నుంచి బయలుదేరి కన్యాకుమారి జిల్లాలోని మార్తాండంలోని సొంత ఇంటికి వెళ్లింది. వారం రోజుల తరువాత నేను ఉద్యోగానికి వెలుతానని షామిలి చెప్పడంతో ఈరోజు రేపు అంటూ ఆమె కుటుంబ సభ్యులు కాలం గడిపారు. కరోనా వైరస్ పుణ్యమా అంటూ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో షామిలి బెంగళూరు వెళ్లలేక మార్తాండంలోని ఇంటిలోనే ఉండిపోయింది.

 సినిమా లెవల్లో సెకండ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్

సినిమా లెవల్లో సెకండ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్

లాక్ డౌన్ దెబ్బకు ఇంట్లోనే ఉండిపోయిన షామిలికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు డిసైడ్ అయిపోయారు. బెంగళూరులో ఒక యువకుడితో షామిలి తిరుగుతోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. మార్తాండంలోనే ఓ పెళ్లి కొడుకుని చూసిన కుటుంబ సభ్యులు షామిలితో బలవంతంగా నిశ్చితార్థం జరిపించేశారు. షామిలి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడిన కుటుంబ సభ్యులు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని ప్రియుడు రాజుకు ఎలాంటి సమాచారం వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

చిన్న మెసేజ్ తో కలకలం

చిన్న మెసేజ్ తో కలకలం

పెళ్లి కోసం రాత్రి రిసెప్షెన్స్, మరుసటి రోజు ఉదయం ముహూర్తం పెట్టుకున్న కుటుంబ సభ్యులు షామిలికి ప్రాణ స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలకు ఓ మెసేజ్ పంపించారు. మీరు పెళ్లికి వచ్చి వెళ్లాలని ఇద్దరు అమ్మాయిలకు మెసేజ్ వెళ్లింది. అప్పటికే ఆ అమ్మాయిలకు షామిలి ప్రేమ విషయం తెలుసు. వెంటనే షామిలి స్నేహితులు రాజుకు సమాచారం ఇచ్చారు. కొంప మునిగిపోతుందిరా దేవుడా అంటూ రాజు మార్తాండంకు పరుగు తీశాడు. స్థానిక పోలీసులకు జరిగిన విషయం మొత్తం రాజు కుయ్యోమొర్రో అంటూ చెప్పాడు.

 క్లైమాక్స్ లో ట్విస్ట్ అంటే ఇదే

క్లైమాక్స్ లో ట్విస్ట్ అంటే ఇదే


రాత్రి వేరే యువకుడితో షామిలి పెళ్లి రిసెప్షన్ జరిగిపోయింది. ఉదయం పెళ్లి సవ్యంగా జరిగిపోతుందని షామిలి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పెళ్లికి రెండు గంటల ముందు రాజు పోలీసులను వెంటపెట్టుకుని కల్యాణమండపంలోకి ఎంట్రీ ఇచ్చారు. కరోనా దెబ్బకు వందమంది లోపే పెళ్లికి హాజరైనారు. రాజు ఒక్కసారిగా పెళ్లి ఆపండి అంటూ సినిమా డైలాగ్ చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి షామిలిని విచారణ చేశారు.

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు

తాను రాజు గత ఏడాది పెళ్లి చేసుకున్నామని, తల్లిదండ్రులకు భయపడి వేరే పెళ్లికి అంగీకరించానని షామిలి చావు కబురు చల్లాగా చెప్పింది. షామిలి, రాజు ఇద్దరు మేజర్లు కావడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నామని లిఖితపూర్వకంగా లేఖలు తీసుకున్న పోలీసులు వారిని బెంగళూరు పంపించారు. చివరి నిమిషయంలో షామిలి మొదటి భర్త వచ్చి పెళ్లి నిలిపివేయడంతో కన్యాకుమారి జిల్లాలో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+