Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sisters: అక్క కాంచన, చెల్లెలు చంద్రముఖి, దెయ్యం పట్టిందని నకిలీ పూజారి అరాచకం, చిత్రహింసలు, రేప్ !

చెన్నై/సేలం: మానసికంగా కుంగిపోయి ఎవ్వరితో మాట్లాడకుండా ఉంటున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లకు దెయ్యం పట్టిందని, వారికి వైద్యం చేస్తానని నమ్మించిన నకిలీ స్వామీజీ వారి జీవితాలు నాశనం చేశాడు. అక్కలో కాంచన ఉందని, చెల్లెలులో చంద్రముఖి ఉందని నమ్మించాడు. ఇద్దరు అమ్మాయిలకు దెయ్యం పట్టిందని, ప్రతి శుక్రవారం రాత్రి వారికి పూజలు చెయ్యాలని, అప్పుడే వారి శరీరం నుంచి దెయ్యాలు వదిలి వెళ్లిపోతాయని నకిలీ స్వామీజీ వారి తల్లిదండ్రులను నమ్మించాడు. పూజల నెపంతో తన దగ్గర ఉన్న ఇద్దరు అమ్మాయిలపై కామాంధుడైన నకిలీ స్వామీజీ పదేపదే అత్యాచారం చేశాడు. మైనర్లు అయిన అమ్మాయిలు అతని చిత్రహింసలు తట్టుకోలేక జరిగిన విషయం వారి తల్లిదండ్రులకు చెప్పడంతో నకిలీ స్వామీజీ బండారం బయటపడింది.

ఇద్దరు కుమార్తెలు

ఇద్దరు కుమార్తెలు

తమిళనాడులోని సేలం జిల్లా, పొన్నారంపట్టి సమీపంలోని వలైపాడి గ్రాయంలోని పొలంలో ఇల్లు నిర్మించుకున్న సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) ఆయన భార్య, 15 ఏళ్లు, 13 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సెల్వరాజ్ కుమార్తెలు ఇద్దరూ పాఠశాలకు వెలుతున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఇద్దరు అమ్మాయిలు వారి తల్లిదండ్రులతో కలిసి పొలంలోని ఇంట్లోనే ఉంటున్నారు.

మానసిక అనారోగ్యం

మానసిక అనారోగ్యం

సెల్వరాజ్ కుమార్తెలు ఇద్దరూ కొంతకాలంగా ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడుకుండా, ఎవ్వరినీ కలవకుండా వారిద్దరే ఒంటరిగా గడుపుతున్నారు. కుమార్తెల ఆరోగ్యం కుదటపడాలని వారి తల్లిదండ్రులు ఆనేక ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. ఎన్ని చోట్ల వైద్యం చేయించినా ఇద్దరు అమ్మాయిలకు మానసిక వ్యాధి నయం కాకపోవడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

స్వామీజీలు, మంత్రగాళ్లు

స్వామీజీలు, మంత్రగాళ్లు


ఆసుపత్రుల్లో అమ్మాయిలకు వ్యాధి నయం కాకపోవడంతో సెల్వరాజ్ ఇద్దరు కుమార్తెలను పలువురు స్వామీజీలు, పాస్టర్లు, దర్గాలకు తీసుకెళ్లి అక్కడ వాళ్లకు మంత్రాలు, తాయత్తులు వేయించారు. ఎక్కడా ఇద్దరు అమ్మాయిలకు వ్యాధి నయం కాలేదు. ఇదే సమయంలో తెలిసిన వాళ్లు తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా రాసీపురం నుంచి వచ్చిన శేఖర్ అలియాస్ సెహగర్ అనే వ్యక్తి దగ్గరకు మీ అమ్మాయిలను పిలుచుని వెళితే వ్యాధి నయం కావచ్చని ఉచిత సలహా ఇచ్చారు.

 అక్కకు కాంచన, చెల్లికి చంద్రముఖి దెయ్యాలు

అక్కకు కాంచన, చెల్లికి చంద్రముఖి దెయ్యాలు

అమ్మాయిలను నకిలీ స్వామీజీ శేఖర్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. ఇద్దరు అమ్మాయిల పరిస్థితి గమనించిన శేఖర్ వీళ్లకు దెయ్యం పట్టిందని, ఆ దెయ్యాలు వీళ్లను వదిలి వెళితే వారు అందరితో మాట్లాడుతారని శేఖర్ సెల్వరాజ్ కు చెప్పాడు. తమ కుమార్తెలను ఎలాగైనా మామూలు మనుషుల్లా చూడాలని సెల్వరాజ్ దంపతులు ఆశపడ్డారు.

అమావాస్య, శుక్రవారం, కాష్మోరా పూజలు

అమావాస్య, శుక్రవారం, కాష్మోరా పూజలు


అమావాస్య రోజు, మూడు శుక్రవారాలు కాష్మోరాకు పూజలు చెయ్యాలని, మూడు వారాల పాటు అమ్మాయిలు ఇక్కడి నుంచి బయటకు వెళ్లకూడదని, ఇక్కడే వదిలేసి మీరు వెళ్లిపోవాలని నకిలీ స్వామీజీ సెల్వరాజ్ దంపతులకు చెప్పాడు. ఎలాగైనా కుమార్తెల వ్యాధి నయం చేసుకోవాలని నిర్ణయించిన సెల్వరాజ్ దంపతులు ఇద్దరు అమ్మాయిలను మంత్రగాడు శేఖర్ దగ్గర వదిలేసి వెళ్లారు.

పూజల పేరుతో అక్కాచెల్లెలిపై అత్యాచారం

పూజల పేరుతో అక్కాచెల్లెలిపై అత్యాచారం


పూజలు చేసే నెపంతో అక్కాచెల్లెలిపై మంత్రగాడు శేఖర్ అత్యాచారం చేశాడు. పూజలలో భాగంగా తమపై లైంగిక దాడి జరుగుతోందని మొదట ఆ అమ్మాయిలు భావించారు. అయితే శేఖర్ ఆగడాలు ఎక్కువ కావడంతో ఓర్చుకోలేని అమ్మాయిలు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దారుణం జరిగిపోయిందని తెలుసుకున్న సెల్వరాజ్ మంగళపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శేఖర్ ను పట్టుకుని బెండ్ తియ్యడంతో అక్కాచెల్లి మీద అత్యాచారం చేసిన విషయం ఒప్పుకున్నాడు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ స్వామీజీ, మంత్రగాడు శేఖర్ అలియాస్ సెహగార్ ను అరెస్టు చేసి బెండ్ తీసి జైలుకు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+