చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Actress: హీరోయిన్ రెండో మొగుడు ఎస్ఐ, కేసు పెట్టిన రాధా, చెత్త క్యారెక్టర్ అంటూ రివర్స్ కేసు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ నటి తన భర్త తనను మోసం చేసి టార్చర్ పెడుతున్నాడని పోలీసు కేసు పెట్టింది. ఆ నటి కేసు పెట్టింది మొదటి భర్త మీద కాదు, రెండో భర్త మీద. పైగా మేడమ్ రెండో మొగుడు ఓ పోలీసు అధికారి. ఓ రాజకీయ ప్రముఖుడు, ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు మరి కొంత మందితో నటి రాధాకు అక్రమ సంబంధం ఉందని, తనను మోసం చేసి పెళ్లి చేసుకుని నన్ను నిలువునా ముంచేసిందని ఆ పోలీసు అధికారులు రివర్స్ కేసు పెట్టడం కలకలం రేపింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి, రెండో భర్తను పెళ్లి చేసుకున్న నటి రాధా రచ్చరచ్చ చెయ్యడంతో సినీ పరిశ్రమలో, పోలీసు శాఖలో ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ అయ్యింది.

family: భార్యను చంపాలని స్కెచ్, కూతుర్ని కాల్చి కాల్చిపారేశాడు, పండుగకు పిలిచి చంపేశాడు!family: భార్యను చంపాలని స్కెచ్, కూతుర్ని కాల్చి కాల్చిపారేశాడు, పండుగకు పిలిచి చంపేశాడు!

 ఒక్క సినిమాతో ఫేమస్

ఒక్క సినిమాతో ఫేమస్

తమిళంలో తెరకెక్కిన సుందర ట్రావెల్స్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రాధా అలియాస్ సుంధరా ట్రావెల్స్ రాధా (38) తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవ్వరూ ఊహించనిదానికంటే సుందరా ట్రావెల్స్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్క సినిమాతోనే నటి రాధా మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా ఫేమస్ అయిపోయింది.

మొదటి మొగుడు గెటౌట్

మొదటి మొగుడు గెటౌట్

రాధాకు ఇంతకు ముందే పెళ్లి జరిగి ఓ కుమారుడు ఉన్నాడు. మొదటి భర్తతో తెగతెంపులు చేసుకున్న నటి రాధా ఆమె తల్లి, కుమారుడితో కలిసి చెన్నైలోని శాలిగ్రామంలోని లోకయ్య వీధిలో నివాసం ఉంటున్నది. అనేక తమిళ సినిమాల్లో నటిస్తున్న నటి రాధా ఓ రకంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఎస్ఐతో హీరోయిన్ లవ్

ఎస్ఐతో హీరోయిన్ లవ్

ఓ సినిమా షూటింగ్ సందర్బంగా చెన్నైలోని తిరువన్మీయూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న వసంత్ రాజ్ తో నటి రాధాకు పరిచయం అయ్యింది. రాధా, ఎస్ఐ వసంత్ రాజ్ పరిచయం ప్రేమగా మారింది. అప్పటికే ఎస్ఐ వసంత్ రాజ్ కు పెళ్లి అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ వసంత్ రాజ్ కు పెళ్లి అయ్యిందని నటి రాధాకు అప్పడే తెలిసింది.

రాధా చుట్టూ రింగరింగా అని తిరిగేసిన ఎస్ఐ

రాధా చుట్టూ రింగరింగా అని తిరిగేసిన ఎస్ఐ

భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా ఎస్ఐ వసంత్ రాజ్ మాత్రం ఎక్కువ సమయం నటి రాధాతో గడపడం మొదలుపెట్టాడు. రాధా ఇంటిలోనే ఎక్కువ సమయం ఉంటున్న ఎస్ఐ వసంత్ రాజ్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాధా మోజులో పడిపోయిన వసంత్ రాజ్ తిరువన్మీయూర్ పోలీస్ స్టేషన్ నుంచి వడపళని పోలీస్ స్టేషన్ కు బదిలి చేయించుకుని రాధాకు మరింత దగ్గరగా ఉంటూ ఆమెతో జల్సా చేశాడు.

ఇంట్లోనే హీరోయిన్ తో పెళ్లి?

ఇంట్లోనే హీరోయిన్ తో పెళ్లి?

నటి రాధా తననను పెళ్లి చేసుకోవాలని ఎస్ఐ వసంత్ రాజ్ మీద ఒత్తిడి చేసిందని తెలిసింది. భార్య ఇద్దరు పిల్లలు ఉన్న తాను పబ్లిక్ గా నిన్ను పెళ్లి చేసుకోలేనని ఎస్ఐ నటి రాధాకు చెప్పాడు. రాధా ఒత్తిడి ఎక్కువ కావడంతో ఎస్ఐ వసంత్ రాజ్ ఇంట్లోనే ఆమెను రెండో పెళ్లి చేసుకుని సీక్రెట్ గా కాపురం పెట్టేశాడు. నటి రాధా, ఎస్ఐ వసంత్ రాజ్ సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎస్ఐ వసంత్ రాజ్ వ్యవహారం తెలుసుకున్న ఆమె మొదటి భార్య తనకు న్యాయం చెయ్యాలని పోలీసు అధికారులకు ఇప్పటికే మనవి చేసింది.

నటి రాధా ఏం చేసిందంటే?

నటి రాధా ఏం చేసిందంటే?

తన భర్త పేరు వసంత్ రాజ్, ఆయన ఎస్ఐ అంటూ నటి రాధా ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు తీసుకుంది. తన కొడుక్కి తండ్రి వసంత్ రాజ్ (మొదటి మొగుడు పేరు తీసేసింది) అని సర్టిఫికెట్లు తీసుకుంది. అంతే కాకుండా రాధా, ఆమె భర్త ఆధార్ కార్డులు ఇచ్చి రూ. 13 లక్షల విలువైన కారు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ వసంత్ రాజ్ అతని రెండో భార్య, నటి రాధా మీద ఫైర్ అయ్యాడు. ఎవరిని అడిగి ఇవన్నీ చేశావు అంటూ ఎస్ఐ వసంత్ రాజ్ అతని పోలీస్ స్టైల్లో రెచ్చిపోవడంతో నటి రాధా కథ పూర్తిగా అడ్డం తిరిగింది.

నా రెండో మొగుడు టార్చర్ పెడుతున్నాడు

నా రెండో మొగుడు టార్చర్ పెడుతున్నాడు

నటి రాధాకు దూరం కావాలని డిసైడ్ అయిన ఎస్ఐ వసంత్ రాజ్ వడపళని పోలీస్ స్టేషన్ నుంచి ఎన్నూర్ పోలీస్ స్టేషన్ కు బదిలి చేయించుకున్నాడు. వసంత్ రాజ్ దూరం కావడంతో నటి రాధా తట్టుకోలేకపోయింది. అంతే తన రెండో భర్త తనను మోసం చేశాడని, పోలీసు అధికారి కావడంతో తనను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ నటి రాధా విరుబాక్కం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వసంత్ రాజ్ మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

రాధాది చెత్త క్యారెక్టర్

రాధాది చెత్త క్యారెక్టర్

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు కొందరు ప్రముఖులతో నటి రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కొందరితో ఆమెకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఈ విషయాల గురించి తాను ప్రశ్నిస్తే తన మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడుతానని బెదిరించిందని ఎస్ఐ వసంత్ రాజ్ నటి రాధా మీద రివర్స్ కేసు పెట్టాడు. మొత్తం మీద రెండో మొగుడి మీద నటి రాధా కేసు పెట్టడం, రెండో భార్య నటి రాధాది చెత్త క్యారెక్టర్ అంటూ ఎస్ఐ రివర్స్ కేసు పెట్టడంతో సినీ పరిశ్రమలో, ఇటు తమిళనాడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Sundara Travels Actress Radha complaint against her Second Husband in Chennai City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X