Rajinikanth: మళ్లీ గోడ మీద దీపం పెట్టిన తలైవా, ఉంటుందా ? దీపం ఆరిపోతుందా ?, ఫ్యాన్స్ కు టెన్షన్... టెన్షన్!

చెన్నై/ మదురై/ న్యూఢిల్లీ: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన రాజకీయ రంగప్రవేశం విషయంలో మళ్లీ గోడ మీద దీపం పెట్టారు. సోమవారం అభిమాన సంఘాల నాయకులతో సమావేశమైన రజనీకాంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేను త్వరలో నా రాజకీయ రంగప్రవేశం గురించి పూర్తి సమాచారం ఇస్తానని చెప్పడంతో తలైవా అభిమానులు షాక్ అయ్యారు. నా రాజకీయ రంగప్రవేశం విషయంలో తన నిర్ణయాన్ని తనకే తన అభిమానులు వదిలిపెట్టారని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఆయన ఫ్యాన్స్ కు మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది.

 ఫ్యాన్స్ లో ఉత్కంఠ

ఫ్యాన్స్ లో ఉత్కంఠ

సోమవారం చెన్నైలోని కోడంబాక్కంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కల్ మండ్రం పార్టీ నాయకుల సమావేశం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని 38 జిల్లాలకు చెందిన 52 మంది రజనీ పార్టీ అభిమాన సంఘాల ముఖ్య నాయకులు, రజనీ మక్కల్ మండ్రం పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరైనారు. మీటింగ్ పూర్తి అయిన తరువాత తలైవా రజనీకాంత్ ఏమి చెబుతారు ? అంటూ ఆయన అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది.

రజనీకాంత్ క్లారిటీ

రజనీకాంత్ క్లారిటీ

రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడిన తరువాత బయటకు వచ్చిన రజనీకాంత్ చెనైలోని పూజా గార్డెన్ లో మీడియాతో మాట్లాడారు. తన అభిమాన సంఘాల నాయకులతో తాను మాట్లాడాను, వారి అభిప్రాయాలు సేకరించాను. తన రాజకీయ రంగప్రవేశం గురించి త్వరలో పూర్తి సమాచారం వెల్లడిస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాకు చెప్పారు.

మళ్లీ మళ్లీ ఆలస్యం చేస్తున్న రజనీ ?

మళ్లీ మళ్లీ ఆలస్యం చేస్తున్న రజనీ ?

ఈ రోజు తన అభిమాన సంఘాల నాయకులు వారివారి జిల్లాల్లోని పరిస్థితుల గురించి, అభిమానుల ఆకాంక్ష గురించి తనకు వివరించారని రజనీకాంత్ అన్నారు. అభిమానుల ఆశయాలకు అనుగునంగా తాను త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటానని సూపర్ స్టార్ రజనీకాంత్ మీడియాకు చెప్పారు. త్వరలో తన రాజకీయ రంగప్రవేశం గురించి కీలక ప్రకటన చేస్తానని చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ ఆయన నిర్ణయాన్ని వాయిదా వేశారు.

గోడ మీద దీపం పెట్టిన తలైవా

గోడ మీద దీపం పెట్టిన తలైవా

రాజకీయాల్లోకి వచ్చే విషయంలో తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తన అభిమాన సంఘాల నాయకులు ఈ రోజు చెప్పారు, నేను ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటానని రజనీకాంత్ అన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం విషయంలో ఆయన మళ్లీ గోడ మీద దీపం పెట్టడంతో ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు. మొత్తం మీద రజనీకాంత్ ఆయన రాజకీయ రంగ ప్రవేశం విషయం మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+