చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇళయ దళపతి గ్రాండ్ ఎంట్రీ?: సొంత పార్టీ కోసం: ఎన్నికల కమిషన్‌లో పేరు? టార్గెట్-2021

|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమైందా? త్వరలోనే ఆయన సొంత పార్టీని ప్రకటించబోతున్నారా? ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండొచ్చు? పార్టీ పేరేంటీ? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్నలు ఇవి. ఇళయ దళపతిగా లక్షలాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఉన్న విజయ్.. అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్‌గా చేసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనికోసం సొంతంగా ఓ పార్టీని ఏర్పాటు చేయనున్నారని, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని అభిమానులు చెబుతున్నారు.

కమల్ హాసన్, రజినీకాంత్ తరహాలో..

కమల్ హాసన్, రజినీకాంత్ తరహాలో..

సినిమా నటులు వెండితెర మీది నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. తమిళనాడులో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్యదైవాలుగా నిలిచిన ఎం జీ రామచంద్రన్, జయలలిత రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత.. ఇద్దరి బ్యాక్‌గ్రౌండ్ సినిమాలే. బహుభాషా నటుడు కమల్ హాసన్ మక్కళ్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. గత ఏడాది నిర్వహించిన లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు.

ఊరిస్తోన్న రజినీ

ఊరిస్తోన్న రజినీ

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందంటూ ఊరిస్తున్నారు గానీ.. ఈ దిశగా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోతున్నారు. రజినీకాంత్ కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారంటూ చాలాకాలం నుంచి వార్తలు వస్తున్నప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడిగా ఆయన పేరు తెచ్చుకోగలిగారే తప్ప పొలిటికల్ ఎంట్రీపై ఏనాడూ అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి రజినీకాంత్ వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంటోంది.

తమిళనాడులో విస్తృతంగా పోస్టర్లు, బ్యానర్లు..

తమిళనాడులో విస్తృతంగా పోస్టర్లు, బ్యానర్లు..


విజయ్.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే వార్తలు తమిళనాడులో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు వెలుస్తున్నాయి. విజయ్ అభిమానులు అధిక సంఖ్యలో ఉన్న కొన్ని జిల్లాల్లో విస్తృతంగా ఈ బ్యానర్లు వెలుస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తూ.. విజయ్ కూడా సొంతంగా రాజకీయ పార్టీని నెలకొల్పబోతున్నారని అంటున్నారు. వైఎస్ జగన్ తరహాలోనే అధికారాన్ని అందుకుంటారనే ధీమాను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్, విజయ్‌లను ముద్రించిన బ్యానర్లు, పోస్టర్లు ఇప్పటికీ తమిళనాడులో కనిపిస్తున్నాయి.

ఎన్నికల కమిషన్ కార్యాలయంలో..

ఎన్నికల కమిషన్ కార్యాలయంలో..

కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన పనులన్నీ గప్‌చుప్‌గా కొనసాగుతున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఓ కొలిక్కి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారనే చెబుతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందనీ అంటున్నారు. ఎన్నికల పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులను విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తీసుకున్నారని చెబుతున్నారు. దీనికోసం ఆయన అధికార ఏఐఎడీఎంకే, డీఎంకే పార్టీల్లో తనకు ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుంటున్నారని సమాచారం.

రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయా?

రాజకీయ కక్ష సాధింపులు ఉన్నాయా?

విజయ్‌పై ఇదివరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. విజిల్ సినిమా నిర్మాతపైనా ఈ దాడులు కొనసాగాయి. ఆయన నటిస్తోన్న మాస్టర్ సినిమా షూటింగ్ సందర్భంగా లొకేషన్‌కు వెళ్లి మరీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణను నిర్వహించారు. ఈ ఘటన అప్పట్లో తమిళనాడులో కలకలం పుట్టించింది. తమ అభిమాన కథానాయకుడిపై ఉద్దేశపూరకంగా దాడులు చేయించారని, కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడిందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి విజయ్ కూడా రాజకీయాల్లోకి రావలంటూ అభిమానులు పట్టుబడుతున్నారు.

English summary
Tamil Actor Ilayathalapathy vijay is likely to form a own political party and contest in upcoming assembly elections in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X