Tamil nadu: దిగొచ్చిన తమిళనాడు గవర్నర్.. బిల్లులకు ఆమోదం..

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించే బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తన ఆమోదం తెలిపారు. అధికారిక వర్గాలు సోమవారం తెలిపారు. అయితే గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్‌, గవర్నర్ ఆర్‌ఎన్‌‌ రవి వివాదం నెలకొంది.

అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్‌లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్‌ ఎట్టకేలకు ఆమోదించారు.

Tamil Nadu Governor RN Ravi approved the bill to ban online gambling

సభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి రాష్ట్ర గవర్నర్‌లకు గడువును నిర్ణయించాలని కేంద్రం, రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే గవర్నర్ రవి బిల్లుకు తన ఆమోదం తెలిపారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిషేధం, ఆన్‌లైన్ గేమ్‌ల నియంత్రణ బిల్లును తమిళనాడు గవర్నర్ క్లియర్ చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ రానుంది. ఆన్‌లైన్ జూదాన్ని ప్రోత్సహించడం లేదా డబ్బు లేదా ఇతర వాటాలతో ఆన్‌లైన్ గేమ్‌లను ఆడడాన్ని ప్రోత్సహించే ఏ రూపంలోనైనా ప్రకటనలు తమిళనాడులో నిషేధించారు.

ప్రమోషన్ కోసం ప్రకటనపై నిబంధనను ఉల్లంఘించిన వారికి లేదా ఆన్‌లైన్‌లో జూదం/ఆటలు ఆడేందుకు ప్రజలను ప్రేరేపించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధిస్తారు. తమిళనాడులో, డబ్బు లేదా ఇతర వాటాలతో అవకాశం కోసం ఆన్‌లైన్ జూదం/ఆన్‌లైన్ గేమ్‌లలో ఎవరైనా పాల్గొనే వ్యక్తికి మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 5,000 వరకు జరిమానా, ఒక్కోసారి రెండు విధిస్తారు.

డబ్బు లేదా ఇతర వాటాలతో ఆన్‌లైన్ జూదం సేవ లేదా పోకర్, రమ్మీ గేమ్‌లను అందించే ఎవరైనా వ్యక్తికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఈ బిల్లును మొదటిసారి అసెంబ్లీలో అమోదించిన తర్వాతి గవర్నర్ కు పంపారు. అయితే బిల్లును గర్నర్ తిరిగి పంపారు. దీంతో బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.

ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడిన అనేక మంది వ్యక్తులు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమ జీవితాలను ముగించుకుంటున్నారు. అలాంటి గేమ్‌లు ఆడుతూ భారీగా డబ్బును పోగొట్టుకోవడంతో ఆన్‌లైన్ జూదానికి వ్యతిరేకంగా ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించడానికి ప్రభుత్వం గత సంవత్సరం ఆర్డినెన్స్‌తో తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+