• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్‌కు గవర్నర్‌ పదవి : తాజా భేటీలో ఫిక్స్..!!

|
Google Oneindia TeluguNews

తమిళ సూపర్ స్టార్..గవర్నర్ కాబోతున్నారా. రాజకీయంగా ఎంట్రీకి నిర్ణయించి..చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే, ఇప్పడు ఆయన నేరుగా గవర్నర్ కాబోతున్నారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగుతోంది. తమిళనాట ఎలాగైనా బలం పెంచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్నా డీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో కొత్త రూటు లో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా.. జాగ్రత్తగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేసుకుంది.

ప్రధాని మోదీ - రజనీ మధ్య సాన్నిహిత్యం

ప్రధాని మోదీ - రజనీ మధ్య సాన్నిహిత్యం


బీజేపీ ముందుగానే ఫిక్స్ చేసుకున్న ప్రణాళికలో భాగంగా..ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం ఆయనతో ప్రాధమికంగా చర్చలు సైతం పూర్తయినట్లు సమాచారం. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఆజాదీ కా మహోత్సవ్ నిర్వహణ పైన అన్ని రంగాల ప్రముఖులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రజనీకాంత్ హాజరయ్యారు.ఆ సమయంలో ప్రధాని మోదీతో పాటుగా హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో రజనీ భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన మరుసటి రోజునే తమిళనాడు గవర్నర్ రవితో సమావేశం అయ్యారు.

రజనీకి గవర్నర్ గా ఆఫర్

రజనీకి గవర్నర్ గా ఆఫర్

ఆయనతో రాజకీయాల పైన చర్చించానంటూ వ్యాఖ్యానించారు. దీంతో..ఆ వ్యాఖ్యలతో రజనీ రూటు ఏంటనే చర్చ మొదలైంది. రజనీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, వామపక్షాలు స్పందించాయి. గవర్నర్ తో రాజకీయాలు మాట్లాడటం ఏంటంటూ వ్యాఖ్యానించాయి. అయితే, 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తున్న ప్రధాని మోదీ.. ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసారు. అందులో తమిళనాడు పైన ప్రధాని మోదీ - షా కొత్తగా పావులు కదుపుతున్నారు. దీంతో..రజనీ కాంత్ తో ప్రధాని మోదీకి ఉన్న స్నేహం ను అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. మోదీ చెన్నై వచ్చినప్పుడు రజనీ నివాసానికి వెళ్లి చాలాసేపు ఆ కుటుంబంతో సరదాగా గడిపారు. రాజకీయ పార్టీ నుంచి వెనక్కు తగ్గినా.. అభిమానంలో మాత్రం రజనీ క్రేజ్ తగ్గలేదు.

రజనీకాంత్ అంగీకరించారంటూ

రజనీకాంత్ అంగీకరించారంటూ

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దూత..రజనీతో గవర్నర్ ఆఫర్ పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి రజనీ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. రాజకీయంగా పార్టీలో చేరటం పైన ఆసక్తి లేని రజనీ కాంత్.. గవర్నర్ పదవి విషయంలో మాత్రం నో అనలేదని చెబుతున్నారు. రజనీ కాంత్ బీజేపీలో లేకపోయినా.. గవర్నర్ గా అవకాశం కల్పిస్తే..తమిళనాట ఆయనకు ఉన్న అభిమానం తమకు అనుకూలంగా మారుతుందనేది బీజేపీ వ్యూహం. దీంతో..ఆయన్ను ఈ దిశగా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీని పైన అటు బీజేపీ..ఇటు రజనీ కాంత్ నుంచి అధికారికంగా నిర్ణయం ఒకటి రెండు రోజుల్లోనే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు రజనీకి గవర్నర్ వ్యవహారం అటు సినీ ఇండస్ట్రీతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

English summary
News Roaming that BJP national leadership offer governor post for Rajanikanth. BJP moving with hidden agneda in Tamilanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X