టీవీ నటి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్: అభ్యంతరకర సీన్లలో యాక్ట్: భర్త అరెస్ట్
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసు.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఆమె భర్త హేమంత్ కుమార్ అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని నజరత్‌పేట పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీనికి గల కారణాలను వెల్లడించారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 9వ తేదీన తెల్లవారు జామున వీజే చిత్ర.. చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు. పాపులర్ టీవీ షో పాండ్యన్ స్టోర్స్‌లో ఆమె నటించారు. చెన్నై నజరత్‌పేటలోని హోటల్‌లో ఉరి వేసుకున్న స్థితిలో ఆమెను గుర్తించారు. తెల్లవారు జామున 2:30 గంటలు దాటిన తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోస్ట్‌మార్టమ్ నివేదిక ద్వారా నిర్ధారించారు.
Recommended Video

ఆత్మహత్యకు పాల్పడేలా..
వీజే చిత్ర. బలవన్మరణానికి పాల్పడేలా ఆమె భర్త హేమంత్ కుమార్ వ్యవహరించినట్లు నజరత్ పేట పోలీసులు తెలిపారు. సీరియళ్లతో పాటు ఒకట్రెండు తమిళ సినిమాల్లో ఆమె అభ్యంతరకర సీన్లలో నటించడం పట్ల హేమంత్.. ఆగ్రహంతో, అసహనంతో ఉన్నారని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన రోజు.. వారిద్దరి మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుందని చెన్నై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుదర్శన్ తెలిపారు. ఈవీపీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ను ముగించుకున్న హోటల్‌కు చేరుకున్న అనంతరం ఆమె తన చివరి ఫోన్‌కాల్‌ను హేమంత్‌కు చేశారని వివరించారు.

భర్తపైనే అనుమానాలు..
వీజే చిత్ర ఆత్మహత్య కేసులో పోలీసులు తొలుత అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించారు. ఆర్థిక ఇబ్బందులేవీ లేవని తేలింది. దీనితో ఆమె వ్యక్తిగత అంశాలపై దృష్టి సారించారు. హేమంత్‌తో ఆమెకు ఉన్న కుటుంబ సంబంధంపైనా విచారించారు. కొంతకాలంగా వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉండట్లేదని తేలింది. రెండుసార్లు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. కొంతకాలంగా తాను చిత్రతో సన్నిహితంగా ఉండట్లేదని హేమంత్ అంగీకరించినట్లు చెప్పారు.

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినట్లు కేసు..
చిత్రకు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. హేమంత్ తీసుకొచ్చిన ఒత్తిడి, మానసిక క్షోభ వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్దారించామని ఏసీపీ చెప్పారు. ఆత్మహత్మ చేసుకునేంతటి పరిస్థితులను హేమంత్.. ఆమెకు కల్పించాడని తెలిపారు. ఈ కారణంతోనే ఆయనను అరెస్టు చేశామని అన్నారు. ఐపీసీ సెక్షన్‌లోని 302 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఆమె చివరి ఫోన్ కాల్ కూడా హేమంత్‌కే చేశారని పేర్కొన్నారు. టీవీ ఛానళ్లలో ప్రజెంటర్‌గా కేరీర్‌ను ప్రారంభించిన చిత్ర తమిళ చిత్ర పరిశ్రమ నిర్వహించే కొన్ని ఈవెంట్లలోనూ వీజే చిత్ర.. యాంకరింగ్ చేశారు. టీవీ సీరియళ్లలో నటించారు.












Click it and Unblock the Notifications