TikTok lovers: టిక్ టాక్ కే దిక్కులేదు, నా లైఫ్ లో నువ్వు బ్యాన్, తల్లిని చేసి, రెండో పెళ్లికి !

చెన్నై/ మదురై: టిక్ టాక్, ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయితో నేను నిన్నుప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని అతను నమ్మించాడు. కులాలు వేరుకావడంతో పెద్దలను ఎదరించి ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని కాపురం పెట్టారు. ప్రస్తుతం నవవధువు గర్బవతి. ఇలాంటి సమయంలో అబ్బాయి తండ్రి ఎంట్రీ ఇవ్వడంతో కథలో అనేక మలుపులు తిరిగాయి. వేరే అమ్మాయితో నీకు పెళ్లి జరిపిస్తామని, రూ. లక్షల రూపాయలు కట్నంగా, భారీ మొత్తంలో బంగారు నగలు ఇస్తారని అబ్బాయికి మాయమాటలు చెప్పాడు. భర్తను నమ్మి బాండు పేపర్ల మీద సంతకాలు చేసింది. టిక్ టాక్ కే దిక్కులేదు, నువ్వు నా లైఫ్ లో బ్యాన్ అంటూ భర్త ఎదురుతిరిగాడు. తాను సంతకాలు చేసింది విడాకుల పత్రాలపైన అని తెలుసుకున్న భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాటం చేస్తున్నది.

హీరోలాగా వెంటపడ్డాడు

హీరోలాగా వెంటపడ్డాడు

తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు తార్కుడి ప్రాంతానికి చెందిన ఉదయ్ కుమార్ అనే యువకుడికి టిక్ టాక్ లో, ఫేస్ బుక్ లో సత్య అనే అమ్మాయి పరిచయం అయ్యింది. తరువాత హీరోలాగా టిక్ టాక్ అమ్మాయి సత్య వెంటపడిన ఉదయ్ కుమార్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నేపెళ్లాడుతా అంటూ భారీ సినిమా డైలాగులు చెప్పాడు. బ్యూటీ పార్లల్ నిర్వహిస్తున్న సత్య కొంతకాలం తరువాత ఉదయ్ కుమార్ ప్రేమలో పడిపోయింది.

 ప్రపంచం తల్లకిందులైనా నువ్వే నాభార్య

ప్రపంచం తల్లకిందులైనా నువ్వే నాభార్య

ఉదయ్ కుమార్, సత్య కొంతకాలం ప్రేమించుకున్న తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ కుమార్, సత్య కుటుంబ సభ్యులు నో అంటూ ఇవీవీ సత్యనారాయణ సినిమాలో డైలాగులు చెప్పారు. మనం ఏమిటి, మన కులం ఏమిటి, మన పరువు ఏమిటీ, నువ్వు సత్యను పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించమని ఉదయ్ కుమార్ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. ప్రపంచ తల్లికిందులైనా నువ్వే నా భార్య అంటూ ఉదయ్ కుమార్ ప్రియురాలు సత్యకు మంగమ్మ శపథం చేశాడు.

పెళ్లి... వెంటనే గర్బవతి

పెళ్లి... వెంటనే గర్బవతి

పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఉదయ్ కుమార్, సత్య స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. మదురైలో ప్రత్యేకంగా కాపురం పెట్టిన ఉదయ్ కుమార్, సత్య హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో సత్య గర్బవతి అయ్యింది. తాను తల్లిని కాబోతున్నానని సత్య మురిసిపోయింది. ఇలాంటి టైమ్ లో తమిళ సినిమాలో ట్విస్ట్ లాగా హీరో ఉదయ్ కుమార్ తండ్రి ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్తమలుపు తిరిగింది.

భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు

భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బులు

ఏదో జరిగింది జరిగిపోయింది.... నువ్వు సత్యతో ఇంతకాలం ఎంజాయ్ చేశావ్, ఇక ఆమెను వదిలేసి మేము చెప్పినచోట పెళ్లి చేసుకుంటే భారీ మొత్తంలో కట్నం కింద డబ్బులు, బంగారు నగలు ఇస్తారని, నీ జీవితం హ్యాపీగా సాగిపోతుందని ఉదయ్ కుమార్ కు అతని తండ్రి మాయమాటలు చెప్పాడు. ఇదే సమయంలో సత్యతో నువ్వు విడాకులు తీసుకుంటే ముందుముందుకు ఎలాంటి సమస్యలు రావని, నువ్వు ఆ పని చెయ్యి, పెళ్లి ఏర్పాట్లు మేము చూసుకుంటాం అంటూ ఉదయ్ కుమార్ కు అతని కుటుంబ సభ్యులు మాయమాటలు చెప్పారు.

అన్నంతపని చేసిన మొగుడు

అన్నంతపని చేసిన మొగుడు


విడాకుల కోసం బాండు పేపర్లు (దస్తావేజు)లు సిద్దం చేసిన ఉదయ్ కుమార్ భార్య సత్యకు మాయమాటలు చెప్పి వాటి మీద సంతకాలు చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. తాను వ్యాపారం చేస్తున్నానని, నువ్వు వీటి మీద సంతకాలు చెయ్యాలని భార్య సత్యను నమ్మించి ఆ దస్తావేజుల మీద సంతకాలు చేయించుకున్నాడు. ఇదే సమయంలో ఉదయ్ కుమార్ మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. 10 రోజుల నుంచి ఉదయ్ కుమార్ భార్య సత్య నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లడం మానేశాడు.

విడాకుల పత్రాలు ఇవే కదా ?

విడాకుల పత్రాలు ఇవే కదా ?

తన భర్త వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడని తెలుసుకున్న సత్య షాక్ కు గురైయ్యింది. వెంటనే భర్త ఉదయ్ కుమార్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ లో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో ఉదయ్ కుమార్, అతని తండ్రి కుటుంబ సభ్యులు పోలీసుల ముందు హాజరైనారు. నా కొడుకు నీకు ఏం చెప్పాడో ? ఏం చేశాడో నాకు తెలీదు, నువ్వు విడాకుల పత్రాల మీద సంతకాలు చేశావ్, ఇవిగో పేపర్లు అంటూ ఉదయ్ కుమార్ తండ్రి దస్తావేజుల పత్రాలు పోలీసుల సమక్షంలో సత్యకు ఇచ్చాడు.

 నీ దిక్కున్న చోట చెప్పుకో... అంతే !

నీ దిక్కున్న చోట చెప్పుకో... అంతే !

నువ్వు బాండుపేపర్ల మీద మాకు సంబంధం లేదు అని రాసి ఇచ్చావని, ఇప్పుడు పోలీసుల ముందు పంచాయితీ పెడుతావా ? నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఉదయ్ కుమార్ తండ్రి రెచ్చిపోయాడు. ఈ సమయంలో దిక్కుతోచనిస్థితిలో అయోమయానికి గురైన సత్య నేరుగా ఇంటికి వెళ్లి నిద్రమాత్రలు మింగేసింది. తీవ్రఅస్వస్థతకు గురైన సత్య ఇంటిలో కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన పక్కింటివాళ్లు సత్యను ఆసుపత్రికి తరలించారు. తన ఆత్మహత్యకు తన భర్త ఉదయ్ కుమార్, అతని తండ్రే కారణం అని సత్య పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు అయ్యింది. రెండో పెళ్లికి సిద్దం అయిన ఉదయ్ కుమార్ ప్రస్తుతం కరోనా వైరస్ ను లెక్క చెయ్యకుండా పోలీసులకు చిక్కకుండా చెట్ల వెంట పుట్టల వెంట తప్పించుకుని తిరుగుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+