Viral: దాదాలు అనుకున్నారు, దారినపోయే హిజ్రాలను పట్టుకుని ?, వాళ్ల వీడియో వాళ్లే పోస్టు చేసి!
చెన్నై/కోవిల్ పట్టి: హిజ్రాలు భిక్షం ఎత్తుకుంటూ, హైవే రహదారిలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి డ్రైవర్ల దగ్గర డబ్బులు అడుక్కుంటూ కాలం గడుపుతున్నారు. హిజ్రాలను నమ్మించి పొలం దగ్గరకు పిలుచుకుని వెళ్లిన ఇద్దరు యువకులు వాళ్లను చితకబాదేశారు. హిజ్రాలను చితకబాదిన తరువాత ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఓ హిజ్రా జట్టును బ్లేడ్ తో కత్తిరించి పొలంలో విసిరేశారు. మరో హిజ్రా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ధీనంగా కింద కుర్చుంది.
హిజ్రాల మీద దాడి చేసిన తరువాత జట్టు కత్తిరించే సమయంలో ఓ నిందితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. హిజ్రాల మీద దాడి చెయ్యడంతో తీవ్రస్థాయిలో విమర్శలు రావడం, వైరల్ అయిన వీడియోలు ఇద్దరు నిందితుల ముఖాలు స్పష్టంగా కనపడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు శాడిస్టులను అరెస్టు చేశారు.

భిక్షం ఎత్తుకుంటున్న హిజ్రాలు
తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని కోవిల్ పట్టిలో హిజ్రాలు భిక్షం ఎత్తుకుని జీవిస్తున్నారు. హైవే రహదారిలో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి డ్రైవర్ల దగ్గర డబ్బులు అడుక్కుంటూ కాలం గడుపుతున్నారు. హిజ్రాలు కోవిల్ పట్టి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.

పొలంలోకి పిలుచుకుని వెళ్లి?
ఇద్దరు హిజ్రాలకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి పొలం దగ్గరకు పిలుచుకుని వెళ్లిన విజయ్, నోవాహ్ అనే ఇద్దరు యువకులు పొలంలో హిజ్రాలతో వాగ్వివాదానికి దిగారు. తరువాత విజయ్, నోహాల్ కలిసి హిజ్రాలు ఇద్దరిని చితకబాదేశారు. హిజ్రాలను చితకబాదిన తరువాత ఓ యువకుడు రెచ్చిపోయాడు.

బ్లేడ్ తో జుట్టుకోసేసి ?
ఓ హిజ్రా జట్టును బ్లేడ్ తో కత్తిరించి పొలంలో విసిరేశారు. మరో హిజ్రా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ధీనంగా కింద కుర్చుంది. హిజ్రాల మీద దాడి చేసిన తరువాత జట్టు కత్తిరించే సమయంలో ఓ నిందితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

శాడిస్టులు అరెస్టు
హిజ్రాల మీద దాడి చెయ్యడంతో తీవ్రస్థాయిలో విమర్శలు రావడం, వైరల్ అయిన వీడియోలు ఇద్దరు నిందితులు విజయ్, నోవాహ్ ముఖాలు స్పష్టంగా కనపడటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. తాము ఏ తప్పు చెయ్యలేదని, మామీద కావాలని విజయ్, నోవాహ్ దాడి చేశారని హిజ్రాలు కేసు పెట్టారని పోలీసులు అంటున్నారు.

వాళ్ల వీడియో వాళ్లే పోస్టు చేసి?
మొత్తం మీద హిజ్రాల జట్టుకత్తిరించి వారి మీద దాడి చేసే సమయంలో వీడియో సోషల్ మీడియాలో స్వయంగా పోస్టు చేసిన ఇద్దరు యువకులు వాళ్ల వల్లవాళ్లే అరెస్టు కావడం హాట్ టాపిక్అ య్యింది. హిజ్రాల మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిజ్రా హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications