Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

చెన్నై/ తిరుచ్చి/ మదురై: బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్న వ్యక్తితో ఓ యువతితో పెళ్లి అయ్యింది. ఫస్ట్ నైట్ నుంచి భార్యతో కాపురం చెయ్యకుండా ఆమెను పస్తులు పెట్టిన క్యాషియర్ కాలం గడిపేశాడు. ఎన్నిరోజులైనా భర్త తనతో ఎందుకు సంసారం చెయ్యడం లేదు ? అంటూ భార్యకు అనుమానం వచ్చి ఆరా తీసింది. ఒకటి కాదు రెండు కాదు భర్త ఉపయోగిస్తున్న 12 మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్ టాప్ ల్లో 400 మందికి పైగా అమ్మాయిలు, సైజులను బట్టి ఆంటీల నగ్న వీడియోలు, భర్త రాసలీలల వీడియోలు చూసిన భార్య షాక్ అయ్యింది. పరాయి స్త్రీలతో ఎంజాయ్ చేస్తూ తనను మోసం చేస్తున్న భర్త భాగోతాన్ని భార్య బయటపెట్టింది. భార్య దెబ్బకు అరెస్టు అయిన భర్య బెయిల్ రాకపోవడంతో జైల్లో కాలం గడుపుతున్నాడు. ఇదే సమయంలో భర్త మొబైల్ ఫోన్లలో ఉన్న ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మరణించడంతో కలకలం రేపింది.

తంజావూర్ శిల్పంతో బ్యాంకు క్యాషియర్ పెళ్లి

తంజావూర్ శిల్పంతో బ్యాంకు క్యాషియర్ పెళ్లి

తమిళనాడులోని తిరుచ్చిలోని మనప్పరై మస్తాన్ వీధికి చెందిన ఎడ్విన్ జయకుమార్ ఇండియన్ బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. చూడటానికి అమాయకుడలాగా ఉంటున్న ఎడ్విన్ జయకుమార్ కేటుగాడు అనే విషయం తెలీకపోవడంతో తంజావూర్ కు చెందిన ఓ ఫ్యామిలీ అతనికి వారి కుమార్తెను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. గత ఏడాది డిసెంబర్ నెలలో తంజావూర్ కు చెందిన శిల్ప (పేరు మార్చడం జరిగింది)తో ఎడ్విన్ జయకుమార్ పెళ్లి జరిగింది.

ఫస్ట్ నైట్ లేదు.... చింతకాయి అసలే లేదు

ఫస్ట్ నైట్ లేదు.... చింతకాయి అసలే లేదు


బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చని శిల్ప బావించింది. పెళ్లి జరిగిన రోజు గ్రాండ్ గా ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఎడ్విన్ జయకుమార్ దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. భర్త జయకుమార్ కు ఏమైనా స్వల్ప అనారోగ్యంగా ఉందోమో ? అని శిల్ప పెద్దగా పట్టించుకోలేదు.

సరసాలకు భార్య రంగంలోకి దిగినా ?

సరసాలకు భార్య రంగంలోకి దిగినా ?

పెళ్లి జరిగిన తరువాత వారం, నెల, రెండు నెలలు అయినా భర్త జయకుమార్ తనతో సరసాలు ఆడకపోవడం కొత్త పెళ్లి కూతురు శిల్ప విసిగిపోయింది. ఇక లాభంలేదని భార్య శిల్ప భర్త జయకుమార్ దగ్గరకు వెళ్లి సరసాలు ఆడటానికి ప్రయత్నించిన సమయంలో భర్త జయకుమార్ చీదరించోవడంతో శిల్పకు మండిపోయింది. ప్రతిరోజు అర్దరాత్రి వరకు బెడ్ రూమ్ లో ఓ మూల కుర్చుకుంటున్న జయకుమార్ మొబైల్ ఫోన్ లో కాలం గడపడంతో శిల్పకు అనుమానం వచ్చింది. ఈ నగరానికి ఏమైయ్యింది ? అనే యాడ్ లాగా నా భర్తకు ఏమైయ్యింది ? అంటూ శిల్ప రకరకాలుగా ఆలోచించింది.

 లాకర్ లో 12 సెల్ ఫోన్లు

లాకర్ లో 12 సెల్ ఫోన్లు


ఓ రోజు భర్త జయకుమార్ బ్యాంకుకు వెళ్లిన తరువాత బెడ్ రూమ్ లోని అతని లాకర్ తీసిన శిల్ప పరీలించింది. జయకుమార్ ఉపయెగిస్తున్న మొబైల్ ఫోన్ కాకుండా లాకర్ లో 12 స్మార్ట్ సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ లు ఉండంటం గుర్తించింది. శిల్ప చదువుకోవడంతో సెల్ ఫోన్లు పరిశీలించగా ఆమె షాక్ కు గురైయ్యింది.

నా మొగుడే పోర్న్ హీరో

నా మొగుడే పోర్న్ హీరో

12 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్ ట్యాప్ లు నిండుగా పొర్న్ వీడియోలు. అన్ని లోకల్ మసాలాలే అని గుర్తించిన శిల్పకు దిమ్మతిరిగిపోయింది. సెల్ ఫోన్లలోని పోర్న్ వీడియోల్లో చాలా వరకు తన భర్త జయకుమార్ అనేక మంది అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్ చేస్తూ సరసాలు ఆడుతున్న వీడియోలు, ఫోటోలు చూసిన భార్య శిల్ప షాక్ కు గురైయ్యింది.

18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల అమ్మాయిలు, ఆంటీలు

18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల అమ్మాయిలు, ఆంటీలు


భర్త జయకుమార్ సరసాలు ఆడిన వారిలో 18 ఏళ్ల అమ్మాయిల నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న ఆంటీల వరకు ఉన్నారని తెలుసుకున్న శిల్ప రగిలిపోయింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్త జయకుమార్ ను శిల్ప నిలదీసింది. నేను ఎవరితో అయినా సరసాలు ఆడుతాను, నీకెందుకు, నోరుమూసుకుని పడుండు, లేదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ భర్త జయకుమార్ రెచ్చిపోయాడు. నెల రోజుల పాటు దంపతులు జయకుమార్, శిల్పల మద్య ఇదే విషయంలో గొడవలు జరిగాయి. అయితే భర్త జయకుమార్ మాత్రం భార్య శిల్ప దారిలోకి రాలేదు.

భర్త మొబైల్ ఫోన్లలో 400 వీడియోలు

భర్త మొబైల్ ఫోన్లలో 400 వీడియోలు

జయకుమార్ మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లో 400కు పైగా పోర్న్ వీడియోలు ఉన్నాయని, అతను అనేక మంది అమ్మాయిలు, వివాహిత మహిళల నగ్న చిత్రాలు సేకరించాడని గుర్తించింది. పరాయి స్త్రీల జీవితాలతో కామాంధుడైన తన భర్త ఆడుతున్న రాసలీలలు చూసి తట్టుకోలేని శిల్ప ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదైన తరువాత ఎడ్విన్ జయకుమార్ మాయం అయిపోయాడు. సుమారు ఐదు నెలల పాటు గాలించిన పోలీసులు చివరికి ఎడ్విన్ జయకుమార్ ను జులై 10వ తేదీ అరెస్టు చేశారు.

 జయకుమార్ హాబీ ఇదే

జయకుమార్ హాబీ ఇదే

బ్యాంకులో క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్న ఎడ్విన్ జయకుమార్ ఆ బ్యాంకుకు వస్తున్న కస్టమర్లలో అమ్మాయి, ఆంటీలను సెలక్ట్ చేసుకుని మాయమాటలు చెప్పి వారిని అనేక రకాలుగా లొంగదీసుకున్నాడని వెలుగు చూసింది. తనకు లొంగని వివాహిత మహిళను బెదిరించిన జయకుమార్ వారితో నగ్నంగా వీడియో కాల్స్ చేశాడని. చాటింగ్ చేశాడని. చాలా మందితో అతను సరసాలు ఆడాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమ్మాయిలు, వివాహిత మహిళలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియోలు తీసి భార్యతో కాపురం చెయ్యకుండా ఆవీడియోలు చూస్తూ ఎంజాయ్ చేసేవాడని, ఇది అతనికి హాబీ అయిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

భార్య అంటే బేజారు

భార్య అంటే బేజారు

అనేక మంది పరాయి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్న తరువాత తన భార్య శిల్పతో కాపురం చెయ్యాలంటే బేజారుగా ఉండేదని, అందుకే ఆమెతో సంసారం చెయ్యలేదని పోలీసుల విచారణలో జయకుమార్ అంగీకరించాడు. ప్రస్తుతం జయకుమాఱ్ లాల్ గుడి జైల్లో ఉంటూ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే జయకుమార్ కు బెయిల్ ఇవ్వరాదని, బెయిల్ వస్తే అతను సాక్షాలు తారుమారు చేస్తాడని స్వయంగా అతని భార్య శిల్పతో పాటు పోలీసులు వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జయకుమార్ ఇంకా కొన్ని మొబైల్ ఫోన్లలో అనేక మంది మహిళలు, అమ్మాయిల నగ్న వీడియో దాచిపెట్టి ఉంటాడని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో జయకుమార్ మొబైల్ ఫోన్లలో ఉన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+