Wife: నా పెళ్లాంకు వీడు ఏదో చేశాడు ?, భర్తకు స్వామీజీ మీద డౌట్, రేయ్, కసక్.. కసక్...!
చెన్నై/హైదరాబాద్: ఆదిపరాశక్తి ఆలయంలో ఉంటున్న స్వామీజీ అనేక మంది సమ్యలు పరిష్కారం కోసం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తున్నాడు. నిత్యం చాలా మంది ఆ స్వామిజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లి వస్తుంటారు. అదే ప్రాంతంలోనే ఉంటున్న ఓ మహిళ స్వామీజీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కువగా వెళ్లి వచ్చేంది. ఇటీవల ఒక్కసారిగా ఆ మహిళ భర్తకు చెప్పాపెట్టకుండా జెండా ఎత్తేసింది. స్వామీజీ మాయమాటలు నమ్మి తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందని భర్త పగ పెంచుకున్నాడు. ఆశీర్వాదం ఇవ్వండి అంటూ స్వామీజీ దగ్గరకు వెళ్లిన భర్త జోబులో ఉన్న కత్తి తీసుకుని కసక్ కసక్ అంటూ పొడిచేశాడు. నా పెళ్లాం లేచిపోవడానికి నువ్వే కారణం చచ్చిపోరా అంటూ కిందపడి కొట్టుకున్న స్వామీజీకి భర్త వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

ఆదిపరాశక్తి ఆలయం
చెన్నైలోని మదురవాయిల్ ప్రాంతంలో శ్రీ ఆదిపరాశక్తి ఆలయం ఉంది. ఆదిపరాశక్తి ఆలయంలో రాజేంద్రన్ (56) అనే ఆయన స్వామీజీగా ఉన్నాడు. ఆదిపరాశక్తి ఆలయంలో ఉంటున్న రాజేంద్రన్ స్వామీజీ అనేక మంది సమ్యల పరిష్కారం కోసం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తున్నాడు. నిత్యం చాలా మంది రాజేంద్రన్ స్వామిజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లి వస్తుంటారు.

దంపతులు కూడా భక్తులే
మదురవాయిల్ ప్రాంతంలోనే తిరుమలై (38), సెల్వి (పేరుమార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదిపరాశక్తి ఆలయానికి తిరుమలై, సెల్వి దంపతులు వెళ్లి రాజేంద్రన్ స్వామీజీ ఆశీర్వాదం తీసుకుని వచ్చేవాళ్లు. అప్పుడడప్పుడు తిరుమలై లేని సమయంలో సెల్వి రాజేంద్రన్ స్వామీజీ దగ్గరకు వెళ్లి ఆయనతో ఎక్కువగా మాట్లాడేది.

జెండా ఎత్తేసిన పెళ్లాం
మూడు రోజుల క్రితం ఇంట్లో తిరుమలై, సెల్వి దంపతుల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తరువాత తిరుమలై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన తిరుమలై భార్య సెల్వి కనపడకపోవడంతో షాక్ అయ్యాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో సెల్వి కోసం వెతికిన తిరుమలై కొంత ఆందోళన చెందాడు.

స్వామిగాడు నా కొంప ముంచేశాడు
రాజేంద్రన్ స్వామీజీ తన భార్య సెల్వికి లేనిపోని మాయమాటలు చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యాడని తిరుమలై అనుమానం పెంచుకున్నాడు. రాజేంద్రన్ స్వామీజీ రెచ్చగొట్టడం వలనే తన భార్య ఎక్కడికో వెళ్లిపోయిందని తిరుమలై రగిలిపోయాడు.

మొగుడు ఏదో అడిగితే స్వామీజీ ఏం చెప్పాడంటే ?
మంచి పదునైన కత్తి తీసుకున్న తిరుమలై నేరుగా రాజేంద్రన్ స్వామీజీ దగ్గరకు వెళ్లాడు. తన భార్య సెల్వి ఇంటి నుంచి వెళ్లిపోయిందని, ఆమెను ఇంటికి పిలుచుకురావడానికి ఏదైనా ఉపాయం చెప్పాలని తిరుమలై స్వామీజీకి మనవి చేశాడు. నువ్వు, నీ తిక్క చేష్టలతో ఎవరైనా ఇంట్లో ఉంటారా ?, నీకు సరైన శాస్తి జరిగిందని అంటూ రాజేంద్రన్ స్వామీజీ వెటకారంగా మాట్లాడాడని తెలిసింది.

కసక్.... కసక్..... రేయ్ చచ్చిపోరా
నా గురించి నువ్వు నా భర్తకు లేనిపోని అనుమానాలు నూరిపోశావని, నీ వల్లే నా కాపురం సంకనాకిపోయిందని, నువ్వు బతికితే నాకే ప్రమాదం అంటూ రెచ్చిపోయిన తిరుమలై జోబులో ఉన్న కత్తి తీసుకుని రాజేంద్రన్ స్వామీజీ కడుపులో కసక్ కసక్ అని పొడిచేశాడు. కత్తిపోట్లు ఎక్కువ కావడంతో గట్టిగా కేకలు వేసిన రాజేంద్రన్ స్వామీజీ కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజేంద్రన్ స్వామీజీని మదురవాయిల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

స్వామీజీ నా కొంప ముంచేశాడు
పారిపోతున్న తిరుమలైని స్థానికులు పట్టుకుని మదురవాయిల్ పోలీసులకు అప్పగించారు. తన భార్యకు రాజేంద్రన్ స్వామీజీ లేనిపోని విషయాలు చెప్పి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం అయ్యాడని, అందుకే చంపేయాలని అనుకున్నానని తిరుమలై అంటున్నాడని పోలీసులు తెలిపారు. మొత్తం మీద తన భార్య లేచిపోవడానికి స్వామీజీ కారణం అంటూ భర్త తిరుమలై అతన్ని చంపేయాలని ప్రయత్నించడం చెన్నైలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications