Illegal affair: శశికళ బీఎస్పీ, బీఈడీ, భర్త చికెన్ పకోడా వ్యాపారం, ఇంట్లో భార్య ?, ప్లాన్ బి రివర్స్!

చెన్నై/ సేలం: కాలేజ్ చదివే సమయంలో కాలేజ్ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. బీఎస్పీ, బీఈడీ పూర్తి చేసిన యువతిని అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బాగా చదువుకున్న భార్య ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని ప్రయత్నిస్తుంటే భర్త చికెన్ పకోడా షాపు నిర్వహిస్తున్నాడు. ఇంట్లోనే ఉంటున్న భార్య నిత్యం గంటలు గంటలు వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోంది. ఈ విషయంలో దంపతుల మద్య గొడవలు జరిగాయి. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్త తెలుసుకున్నాడు.

గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆవేదనతో తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పిన భర్త ఆమె శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించాడు. చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి మహిళ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక దెబ్బతో చనిపోయిన మహిళ భర్తను అతని, తాతను పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. భర్త ప్లాన్ బి రివర్స్ కావడంతో అతను జైలుపాలైనాడు.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని సేలం జిల్లాలోని సిరువచ్చూరులో నివాసం ఉంటున్న శశికళ (35) అనే మహిళ 12 సంవత్సరాల క్రితం కాలేజ్ లో చదువుతున్న సమయంలో తిరుచ్చి జిల్లాలోని అత్తూరు సమీపంలోని నరసింగపురంలోని వినాయకపురంలో నివాసం ఉంటున్న జయకుమార్ అలియాస్ జయ (40) అనే వ్యక్తితో పరిచయం అయ్యింది.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

కాలేజ్ చదివే సమయంలో కాలేజ్ పరిచయం అయిన శశికళ, జయకుమార్ తరువాత ప్రేమించుకున్నారు. బీఎస్పీ, బీఈడీ పూర్తి చేసిన శశికళ, జయకుమార్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు, జయకుమార్, శశికళ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి శశికళ, జయకుమార్ దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించారు.

చికెన్ పకోడా వ్యాపారం చేస్తున్న భర్త

చికెన్ పకోడా వ్యాపారం చేస్తున్న భర్త

బాగా చదువుకున్న శశికళ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని ప్రయత్నిస్తుంటే ఆమె భర్త జయకుమార్ సొంత ఊరిలో చికెన్ పకోడా షాపు నిర్వహిస్తున్నాడు. ఇంట్లోనే ఉంటున్న శశికళ నిత్యం గంటలు గంటలు వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతోంది. ఈ విషయంలో జయకుమార్, శశికళ దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి.

భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని?

భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని?

చివరికి జయకుమార్ అతని భార్య శశికళకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని రగిలిపోయాడు. ఈ దెబ్బతో జయకుమార్, శశికళ దంపతుల మద్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. గురువారం ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆవేదనతో తన భార్య శశికళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త జయకుమార్ ఊరందరిని నమ్మించాడు. భర్త శశికళ శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించాడు.

 పోస్టుమార్టం నివేదికలో?

పోస్టుమార్టం నివేదికలో?

అనుమానాస్పదంగా చనిపోయిన శశికళ కుటుంబ సభ్యులు జయకుమార్ ఆమెను హత్య చేశాడని ఆందోళనకు దిగడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. శశికళ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. శశికళ గొంతు బిగించి హత్య చేశారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. శశికళ అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఆమెను హత్య చేశానని భర్త జయకుమార్ పోలీసుల ముందు అంగీకరించాడు. శశికళను హత్య చేసిన ఆమె భర్త జయకుమార్ ను, శవాన్ని మాయం చెయ్యడానికి ప్రయత్నించిన అతని తాత సెల్వరాజ్ (60)ని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+