Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astrologer: గురువు అంటూనే కూతురికి శిష్యుడు పంగనామాలు, మస్త్ మజా, వీడి స్కెచ్ తో షాక్, సర్వం!

చెన్నై/ నామక్కల్: విద్య నేర్పించిన గురువుకు శిష్యులు మమూలుగా గురుదక్షిణ ఇస్తుంటారు. ఇక్కడో ఓ ప్రభుద్దుడు గురువుతో పాటు ఆయన కూతురికి ఏకంగా గునపం పెట్టేసి ఆయన కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని పైలోకాలకు పంపించేశాడు. అక్రమ సంబంధం సాగిస్తున్న యువతి దగ్గర భారీ మొత్తంలో నగదు, బంగారు నగలు తీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే తన మీద అత్యాచారం చేసి బెదిరించి నగలు, నగదు తీసుకున్నాడని పోలీసు కేసు పెట్టి జైలుకు పంపిస్తానని యువతి ప్రియుడిని బెదిరించింది. పెళ్లి చేసుకోవాలని పదేపదే ఒత్తిడి చేసిన యువతిని పక్కాప్లాన్ తో ఓ జ్యోతిష్కుడు హత్య చేసి కావేరీ నిదిలో విసిరేశాడు. గత్యంతరం లేక ప్రియురాలిని హత్య చేసిన జ్యోతిష్కుడు తహసిల్దార్ ముందు లొంగిపోయి జైలుపాలైనాడు.

భర్త తన్ని తరిమేశాడు

భర్త తన్ని తరిమేశాడు

తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచ్చెంగోడు సమీపంలోని ఆలండివలస ప్రాంతంలో నివాసం ఉంటున్న జ్యోతిష్కుడు కంఠస్వామి తన కుమార్తె నెలైయమ్మాల్ (22)ను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడితో వివాహం చేశాడు. నెలైయమ్మాల్ దంపతుల మధ్య అభిప్రాయవిభేదాలు రావడంతో ఆరు నెలల్లోనే వారు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న నెలైయమ్మాల్ పుట్టింటికి చేరుకుని అక్కడే నివాసం ఉంటోంది.

విరహంతో పుట్టింటిలో యువతి

విరహంతో పుట్టింటిలో యువతి

భర్త తన్ని తిరిమేయడంతో నెలైయమ్మాల్ చాలా విరహంతో ఉండేది. నామక్కల్ సమీపంలోని అన్నై సెట్టియార్ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ముగం కుమారుడు ముత్తు (25) జ్యోతిష్కుడు. వ్యాపార లావాదేవీల కారణంగా ముత్తు తన గురువు కంఠస్వామి ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో కంఠస్వామి కుమార్తె నెలైయమ్మాల్ తో ముత్తుకు పరిచయం అయ్యింది. అదే సమయంలో విరహంతో ఉన్న గురువు కూతురి మీద ముత్తు కన్నుపడింది.

 గురువు కోసం వెళ్లి గునపం చెక్కేశాడు

గురువు కోసం వెళ్లి గునపం చెక్కేశాడు

గురువు కంఠస్వామి కుమార్తె నెలైయమ్మాల్ తో పరిచయం పెంచుకున్న ముత్తు నిన్నేప్రేమిస్తున్నా, నువ్వులేకపోతే నేనులేను అంటూ ఆమె వెంటపడ్డాడు. తరువాత ముత్తు, నెలైయమ్మాల్ కలిసి అనేక సార్లు సినిమాలు, షికార్లకు తిరిగారు. తరువాత ముత్తు, నెలైయమ్మాల్ శారీరకంగా దగ్గరై ఉల్లాసంగా, ఏకాంతంగా గడిపారు. గురువు కూతురితో ముత్తు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ప్రియురాలు త్యాగశీలి

ప్రియురాలు త్యాగశీలి

తనకు ఎక్కువ అప్పులు ఉన్నాయని, ఆ సమస్యలు తీరిపోతే మనం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని ముత్తు అతని ప్రియురాలు నెలైయమ్మాల్ కు చెప్పాడు. తన తండ్రి శిష్యుడు, ప్రియుడు అయిన ముత్తు అతని అప్పులు అన్నీ తీరిపోతే తనను వివాహం చేసుకుంటే ఇద్దరూ సుఖంగా ఉంటామని నెలైయమ్మాల్ భావించింది. తరువాత తన దగ్గర ఉన్న నగదుతో పాటు బంగారు నగలు ఇచ్చిన నెలైయమ్మాల్ వాటిని కుదవ పెట్టుకుని మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రియుడు ముత్తుకు చెప్పింది.

పెళ్లి పేరు చెబితే ప్రియుడు రివర్స్ గేర్

పెళ్లి పేరు చెబితే ప్రియుడు రివర్స్ గేర్

ప్రియురాలి దగ్గర నగదు, నగలు తీసుకున్న ముత్తు రానురాను నెలైయమ్మాల్ కు దూరం కావడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో తనను వివాహం చేసుకోవాలని నెలైయమ్మాల్ ప్రియుడు ముత్తు మీద ఒత్తిడి చేసింది. పెళ్లి చేసుకుంటానని ఈ రోజు, రేపు, మంచి రోజులు రావాలి అంటూ కొంత కాలం గడిపిన ముత్తు నిన్ను వివాహం చేసుకోవడం కుదరదని, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ రివర్స్ గేర్ వేసి ఎందురుతిరిగాడంతో నెలైయమ్మాల్ షాక్ కు గురైయ్యింది.

రేప్ కేసుతో అడ్రస్ లేకుండా పోతావ్ జాగ్రత్త ?

రేప్ కేసుతో అడ్రస్ లేకుండా పోతావ్ జాగ్రత్త ?

తనను వివాహం చేసుకోకుంటే తన మీద అత్యాచారం చేసి బలవంతంగా నగలు, నగదు లాక్కొన్నాడని కేసు పెట్టి జైలుకు పంపిస్తానని నెలైయమ్మాల్ ప్రియుడు ముత్తును బెదిరించింది. ఆ సమయంలో కొంత కాలం ఓపికపట్టాలని, మా ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని ముత్తు ప్రియురాలు నెలైయమ్మాల్ కు నచ్చచెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

జ్యోతిష్యుడి పక్కా స్కెచ్... అంతలోనే రివర్స్

జ్యోతిష్యుడి పక్కా స్కెచ్... అంతలోనే రివర్స్

పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు నెలైయమ్మాల్ ను నమ్మించిన ముత్తు ఆమెను పిలుచుకుని కావేరి నదీ తీరానికి తీసుకెళ్లాడు. తరువాత అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ముత్తు ఆవేశంలో కత్తి తీసుకుని ప్రియురాలు నెలైయమ్మాల్ ను పొడిచి చంపేశాడు. తరువాత నెలైయమ్మాల్ శవం కావేరీ నదిలో విసిరేశాడు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సమీపంలోని తహసిల్దార్ కదిరివేల్ దగ్గరకు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కావేరీ నదిలో గాలించి నెలైయమ్మాల్ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలి హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన ముత్తు ఇప్పుడు కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+