కలికాలంలో కన్యాశుల్కం ..10ఏళ్లు కూడా నిండని చిన్నారికి 50ఏళ్ల వాడితో పెళ్లి

కలికాలంలో కన్యాశుల్కం ఇచ్చి బాల్య వివాహం చేసుకునేందుకు యత్నం చేసిన ఘటన అందర్నీ ఆలోచింపజేస్తుంది . ఒకప్పుడు బాల్య వివాహాలు చెయ్యటం , కన్యా శుల్కం తీసుకుని చిన్న పిల్లలని ముసలి వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయటం వంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా అలాంటి దురాచారాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటే నమ్ముతారా ? అలాంటి ఘటనే శ్రీకాళహస్తి లో చోటు చేసుకుంది.

డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి యత్నం

డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి యత్నం

ఆడపిల్లలను భారంగా భావించకూడదని , ఆడపిల్లలకు స్వేచ్చా స్వాతంత్రాలు ఇవ్వాలని, మగవాళ్ళతో సమానంగా పెంచాలని , ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ, ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్లల మీద చులకన భావం మారటం లేదు . డబ్బు కోసం 10ఏళ్లు కూడా నిండని ఓ చిన్నారికి పెళ్లి చేసేందుకు సిద్ధమయిన తల్లిదండ్రులు ఆమెను 50ఏళ్ళ వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ప్రయత్నం చేశారు .

 కన్యాశుల్కం ఇచ్చి 10ఏళ్ళ చిన్నారిని పెళ్లి చేసుకోబోయిన 50ఏళ్ల వ్యక్తి

కన్యాశుల్కం ఇచ్చి 10ఏళ్ళ చిన్నారిని పెళ్లి చేసుకోబోయిన 50ఏళ్ల వ్యక్తి

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈ బాల్య వివాహాన్ని ఆపి బాలికను కాపాడారు . చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి రూరల్ మండలం తొండమనాడులో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారికి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. 50ఏళ్ల మాధవాచారి అనే వ్యక్తికి ఆ చిన్నారిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు . ఇక ఆ బాలికను వివాహం చేసుకునేందుకు మాధవాచారి ఆమె తల్లిదండ్రులకు ఎదురు కట్నం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు .. కేసు నమోదు

పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు .. కేసు నమోదు

ఈ విషయం గ్రామస్తులకు తెలియటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వివాహం ఆపి చిన్నారిని ఆ పెళ్లి నుండి కాపాడి బాలసదన్‌కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులను, మాధవాచారి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు . ఈ తరహా ఘటనలు నేటి రోజుల్లోనూ చోటు చేసుకోవటం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది . ఒకపక్క కేంద్ర సర్కార్ బేటీ బచావో .. బేటీ పడావో నినాదంతో ముందుకు వెళ్తుంటే ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహం చెయ్యటం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక అన్నిటికంటే కన్యాశుల్కం తరహా ఘటన వెలుగులోకి రావటం నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+