Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఒక్కసారి కాన్సన్‌ట్రేట్ చేస్తే: కుప్పంలో సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్న పెద్దిరెడ్డి

చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి అంతా ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మీదే ఉంది. ఆయన ఒక్కసారి కాన్సన్‌ట్రేట్ చేస్తే.. అన్నట్లుగా తయారైందక్కడి పరిస్థిితి. ఈ సారి కుప్పంలో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలనే లక్ష్యంతో ఉన్నారాయన. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ధీటుగా వ్యూహాలను పన్నుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

 కుప్పం ఓటర్ల పల్స్..

కుప్పం ఓటర్ల పల్స్..

చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఇది. ఏడు దఫాలుగా ఆయన ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తోన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఇదివరకట్లా టీడీపీకి అనుకూలంగా ఉండట్లేదని, దీనికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలేనని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కుప్పం ఓటర్ల పల్స్ తమ పార్టీ వైపు మొగ్గు చూపుతోందని స్పష్టం చేస్తోన్నారు. ఈ సారి ఎన్నికల్లో కుప్పంలో తాము గెలిచి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తోన్నారు.

కుప్పంపై పట్టు జారుతోందా?

కుప్పంపై పట్టు జారుతోందా?

ఇటీవలే చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండలాన్నీ పలకరించారు. అనంతరం మాజీమంత్రి నారా లోకేష్ కూడా కుప్పాన్ని సందర్శించారు. కుప్పంపై పట్టుజారిపోతోందనే ఉద్దేశంతోనే చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అక్కడ తరచూ పర్యటనలను నిర్వహిస్తోన్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతోన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ జెండా పాతడంలో భాగంగా కుప్పాన్ని కూడా గెలిచి తీరుతామనే ధీమా వారిలో నెలకొని ఉంది.

ఏర్పాట్ల పరిశీలన..

ఏర్పాట్ల పరిశీలన..

ఈ పరిస్థితుల మధ్య ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ కుప్పం పర్యటనకు వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారిగా కుప్పం పర్యటనకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికడానికి పార్టీ క్యాడర్ సిద్ధమౌతోంది. బహిరంగ సభకు భారీగా జనాలను సమీకరించడానికి స్థానిక నేతలు కసరత్తు చేపట్టారు.

జగన్ పర్యటన నేపథ్యంలో..

జగన్ పర్యటన నేపథ్యంలో..

జగన్ పర్యటన నేపథ్యంలో.. దృష్టిలో ఉంచుకుని విద్యుత్, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇవ్వాళ కుప్పంలో పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి, చిత్తూరు లోక్‌సభ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ కుమార్, ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు.

ఎన్టీఆర్ స్టేడియం లేదా..

ఎన్టీఆర్ స్టేడియం లేదా..

ఇందులో భాగంగా కుప్పం పీఈఎస్ కళాశాల, బంగారునత్తంలల్లో హెలిప్యాడ్, బహింగ సభ కోసం ఎన్టీఆర్ స్టేడియం, అనిమిగాని పల్లి వద్ద స్థలాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక దాన్ని వైఎస్ జగన్ బహిరంగ సభ కోసం ఎంపిక చేయవచ్చు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు.

వైసీపీలో చేరిక..

వైసీపీలో చేరిక..

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. మంత్రి సమక్షంలో వారంతా వైసీపీ కండువా కప్పుకొన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్.. సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలో సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా కొనసాగుతున్న పాలనను చూసి వారంతా వైసీపీలో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+